సమయం నీది కానపుడు

  • 1096 Views
  • 29Likes

    బి.అనిల్‌ డ్యాని

  • కొండపల్లి, కృష్ణా జిల్లా
  • 9703336688

సమయం నీది కానప్పుడు
విశాల మైదానంలో పరుగెడుతున్నప్పుడు
అకస్మాత్తుగా దాని పరిధి విశాలమవుతుంది
ఎప్పుడో పండక్కి దులిపిన అమ్మ నాన్నల
జంట ఫొటో ఏడుస్తున్నట్టుంటుంది
ఆకలేసిన వేళ తిండి
తాను పండిన మట్టి పెళ్లల వాసనేస్తుంది
ఆకాశం అంచు తెగి
నీరంతా కళ్లలోకి ఒలికిపోతుంది
రాలిపడ్డ క్షణాలని వెనక్కి తిరిగే లోపే
ఎవడో వూడ్చేస్తుంటాడు
కాళ్లకి అంటించుకున్న నడక చక్రం
నీ పుట్టుక ముందు ప్రపంచానికి లాక్కెళుతుంది
ఏ పొద్దు తిరుగుడు పువ్వులోనో దాక్కుని
నీ పొద్దు పొడిచే వరకు వేచి చూడాలి.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చినుకులు

చినుకులు

బి.గోవర్ధనరావు


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


మనస్సులం!

మనస్సులం!

ఎ.కిశోర్‌బాబు


య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

చేబ్రోలు అరుణ


నాలో

నాలో

వినోద్‌ గోరంట్ల


స్వాగతం

స్వాగతం

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి