స్వచ్ఛ భారతం

  • 1064 Views
  • 0Likes

    గరిమెళ్ళ నాగేశ్వరరావు

  • విశాఖపట్టణం
  • 9491804709

ఒక్క అడుగు.. మరొక్క అడుగు
వేయాలిప్పుడు
పరిశుభ్ర భారత నిర్మాణానికి
పరిమళ భరిత మానవతా సౌందర్య సాధనకి
శుభ్రత ఒట్టి నినాదం కాదు అదొక విధానం
మంచి కోసం మనిషి చేసే నిరంతర శ్రమదానం
దేశానికైనా.. దేహానికైనా..
స్వచ్ఛత సజీవ చైతన్య పతాకం
చీకటిని వెలుగుతో తుడిచినట్టు
దుఃఖాన్ని చిరునవ్వు పెట్టి కడిగినట్టు
శుభ్రత పావన జీవనానికో మార్గం కావాలి
మదిలో అయినా.. గదిలో అయినా..
చేరే చెత్త ఎప్పుడూ చెడునే చేస్తుంది
కర్తవ్యం కార్యాలయంలో నిద్రపోతే
దేశపటం చుట్టూ సాలెగూళ్లు అల్లుకుంటాయ్‌
బల్లులు తిరిగే బల్లల కింద అరచేతుల్లో
అవినీతి ముళ్లడొంకలు మొలుచుకొస్తాయ్‌
దుమ్ము పట్టిన గోడగడియారపు ముఖంలా
వివర్ణమవుతోందిప్పుడు భూగోళం
మహాత్ముడి కళ్లద్దాల వెనకనుంచి చూస్తూ
శుభ్రం చేసుకోవాలి నైతికాన్నీ.. భౌతికాన్నీ
చిన్ని బుగ్గలమీద కన్నీటి చారికల వెనక కలతలనీ
నెత్తురోడే గాయాలు చెప్పే రక్త చారిత్రక కథలనీ
డబ్బు చుట్టూ తిరిగి మురిగిపోతోన్న
మనిషి మదికంటిన మకిలినీ
చెత్తనీ.. చెదారాన్నీ.. పురుగునీ.. పుట్రనీ.. కీచకులనీ.. వంచకులనీ లోపలా బయటా...
ఉండ చుట్టిన కాగితాల గుట్టలతో పాటు
బండబారిన గుండెల మొండి దుర్మార్గాలనీ..
దుమ్ము దులిపేయాలి.. చిమ్మి పారేయాలి....
చెత్తబుట్టల్లోకి.. చరిత్ర మారుమూలల్లోకి!!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చినుకులు

చినుకులు

బి.గోవర్ధనరావు


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


మనస్సులం!

మనస్సులం!

ఎ.కిశోర్‌బాబు


య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

చేబ్రోలు అరుణ


నాలో

నాలో

వినోద్‌ గోరంట్ల


స్వాగతం

స్వాగతం

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి