మనిషిని చదవాలంటే

  • 331 Views
  • 0Likes

    పద్మావతి రాంభక్త

  • విశాఖపట్నం
  • 9966307777

మనిషిని చదువుదామని అనుకుంటాను 
కనీసం ఒక్క మనిషినైనా చదువుదామని
మొదలుపెడతాను 
తిరగేసే కొద్దీ
పేజీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి 
వ్యక్తిత్వవైరుధ్యాలు పూస్తూనే ఉన్నాయి
పుటలు తిప్పుతుంటే 
ఎన్నెన్ని 
పాములు అగాధాలు 
గాయాలు గమకాలు 
కల్లోలాలు సంక్షోభాలు
పంచదారచిలుకలు వాలిన 
విరబూసిన పూలతోటలు 
ఎక్కడ నుంచి ప్రయాణించి 
ఎక్కడ ముగించను 
పుటల నిండా పేరుకున్న 
ఎత్తైన పర్వతాలు 
సముద్రాలు 
వాటిలోకి ప్రవహించే నదులు 
కనీసం పాదాలు తడుపుకోవడమైనా కుదరట్లేదు 
కురుస్తున్న హోరువానలో 
ఒక చినుకునైనా ఒడిసిపడదామంటే 
వీలు పడట్లేదు 
కన్నీటి చుక్కై రాలిపడినపుడు ఒకలా 
ఆనందసుమమై విచ్చుకున్నప్పుడు మరోలా 
ఊసరవెల్లిలా రంగులు మారుస్తుంటే 
పాత్రకు తగ్గట్టు 
రూపు కడుతుంటే 
ఎలా కొలవగలను 
గుప్పెట్లో ఎలా బంధించగలను 
మనిషంటే 
ఎంత లోతు 
ఎంత చప్పుడు 
ఎంత నిశ్శబ్దం 
మరెంత వింత శబ్దం 
లోపల పక్షులు 
గిరికీలు కొడుతున్నాయి 
జలపాతాలు పాటలు పాడుతున్నాయి 
ఒక మనిషి గుండెనే చదవలేము 
ఇక సమూహపు నాడినెలా 
పట్టుకోగలం
మనిషిలోని అణువును చదవాలంటే 
ఎన్ని వేలసార్లు మరణించి
జన్మించాలి 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ఆవల

ఆవల

యామినీదేవి కోడే


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్


మౌనంగా ఒక నీ కోసం

మౌనంగా ఒక నీ కోసం

గ‌విడి శ్రీనివాస్‌