కొత్త చిగురులు

  • 271 Views
  • 0Likes

    శ్రీధర్‌ చౌడారపు

  • హైదరాబాదు
  • 9440032211

మళ్లీ కనిపించిన పాతముఖాలూ
వదిలివెళ్లిన స్థలాలూ వస్తువులూ
తరలిపోయిన జ్ఞాపకాలను తట్టిలేపుతాయి
కాలం ధాటికి బెదిరి పారిపోయిన
తడారిపోయి పొడారిపోయిన వాటిపై
కాసిన్ని సంఘటనల చన్నీళ్లు చల్లి పచ్చిగా చేస్తాయి
మనసు అరల్లో దాగి మాగిపోయిన
అనుబంధాలను అనుభవాలను అనుభూతులను
బయటికి లాగి మళ్లీ మనసుపై అద్దుకుంటాయి
కోపాన్ని కొంటెగా పక్కకి నెట్టేసిన
తక్కిన నవరసాల అనుభూతులన్నీ
పెదవులమీదికి నవ్వునే దిగుమతిచేస్తాయి
కళ్లలోకి ఎంతోకొంత చెమ్మనీ అద్దుతాయి
కొండొకచో కళ్లు చెలిమెలయి నీళ్లు తొణుకుతుంటాయి
నా దారి నీ దారి కాదు, అది రాదారి అంటూ
కోపం కళ్లెర్రచేసి శ్వాసను వేడెక్కిస్తే
శృంగారం సిగ్గుతో బుగ్గలను ఎరుపెక్కిస్తుంది
కరచాలనాలూ ఆలింగనాలూ
మనుషుల మధ్య మౌనంగా మార్పిడి అవుతూ
ఆత్మీయతను అటూఇటూ పంపిణీ చేసేస్తే
నదులైనా గదులైనా చెట్లైనా పుట్టలైనా
తిరిగిన వార్డులైనా చూసేసిన బోర్డులైనా
గతం తాలూకు సుగంధాన్ని పూసేసుకుంటూ
సన్నివేశాల సప్తవర్ణాలు చల్లేసుకుంటూ
అనుభూతుల ఆనందాల హోళీ ఆడుకుంటాయి
అవును...
గతం గొప్పదైనా గోరంతదైనా
మనసు మూలల్లో అణువంతగా అణిగిపోయినా
ఎండి మోడువారిపోయినా....
అనువైన సమయంలో
అందిన మాటల చెమ్మతోనో
అంటిన స్థలాల, వస్తువుల స్పర్శతోనో
అలా అలా కొత్త చిగురులు వేస్తుంది
మెల్లమెల్లగా ఎదిగి మానై నిలిచిపోతుంది
మరింతకాలం మనసులో నిండి ఉండిపోతుంది

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ఆవల

ఆవల

యామినీదేవి కోడే


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్


మౌనంగా ఒక నీ కోసం

మౌనంగా ఒక నీ కోసం

గ‌విడి శ్రీనివాస్‌