పిరికి ఎండ

  • 277 Views
  • 0Likes

    మల్లారెడ్డి మురళీమోహన్‌

  • బెంగళూరు
  • 8861184899

చెట్టుకింద తడినీడలు పరిచింది 
కుండపోతగా కురుస్తున్న ఎండ
రాదారి పొడవునా ఎండముళ్లు,
వీధి నిండా విచ్చుకున్న 
నల్లగొడుగు మల్లెలు,
వెల్లవేయని గోడలనిండా 
ఎండ రంగులు
దేహమంతా పూసిన 
చెమటపువ్వులతో   
గాజు తటాకంలాంటి ఎండ    
కంచెదాటి రంకెలేస్తున్న 
ఎనుములాంటి ఎండ   
కొలిమి కొలనులో 
నిప్పుల్లో స్నానించిన 
ఇనుములాంటి ఎండ
అంతోటి, ఇంతోటి ఎండ కాస్తా
అవ్వ నెత్తిమీది కడవలోని
చల్ల కడలిలో దూకి 
ఆత్మహత్య చేసుకుంది
మిరప మీసాల 
బడాయి ఎండ కాస్తా
సాంద్ర సాయంత్రపు చల్లగాలికి 
ఉక్కిరి బిక్కిరై ఉరిపోసుకుంది.
నిప్పు కత్తులు దూసిన 
నిలువుటెండ కాస్తా 
నల్లమబ్బుల మూకదాడితో
చినుకు శూలాలు గుచ్చుకుని కడతేరింది.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నీవు

నీవు

చందలూరి నారాయణరావు


మహానది

మహానది

డా।। సి.భవానీ దేవి


కర్తవ్యం

కర్తవ్యం

పచ్చా పెంచలయ్య


కన్యాదానం

కన్యాదానం

ఐతా చంద్రయ్య


నల్లరేగడి రంగుల స్వప్నం

నల్లరేగడి రంగుల స్వప్నం

గ‌రిక‌పాటి మ‌ణీంద‌ర్‌


వసంత విహారం

వసంత విహారం

నందిరాజు శ్రీనివాస్‌