ఎన్నో

  • 323 Views
  • 1Likes

    మూలా వీరేశ్వరరావు

  • కడలూరు, తమిళనాడు

స్వార్థం ఘనీభవించినప్పుడు
సంభాషణ స్వనాలు
తెగిన
సందర్భాలు ఎన్నో!
యాంత్రికత చుట్టుముట్టినప్పుడు
వెలికి రాని బంధ
పరిమళాలు ఎన్నో!
సాంకేతికత సమీపించినప్పుడు
సంకోచించే
మెదళ్లు ఎన్నో!
తీరంలో
సాగుతున్నప్పుడు
అనివార్యమై తలపడి
తలలు పగిలిన అలలు
ఎన్నో!
‘వలస’ల
విలాసాల
కొరకు ఎగిరి,
ఎల్లలు చెరిగి
కలలు కరిగి
తృష్ణలన్నీ
మృగతృష్ణలైన
మానవులెందరో!
ఆనందపు అన్వేషణలో
అజ్ఞానం కలిగించే
అవరోధాలెన్నో!
జీవితమే
ప్రవహించినప్పుడు
జవాబు లేని
ప్రశ్నలు ఎన్నో!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి గూట్లో...

మట్టి గూట్లో...

రాజశేఖరుని శ్రీశివలక్ష్మి


నీవు

నీవు

చందలూరి నారాయణరావు


మహానది

మహానది

డా।। సి.భవానీ దేవి


కర్తవ్యం

కర్తవ్యం

పచ్చా పెంచలయ్య


కన్యాదానం

కన్యాదానం

ఐతా చంద్రయ్య


నల్లరేగడి రంగుల స్వప్నం

నల్లరేగడి రంగుల స్వప్నం

గ‌రిక‌పాటి మ‌ణీంద‌ర్‌