జై తెలుగు తల్లి

  • 2099 Views
  • 1Likes

    ఎం.గోపాలాచార్యులు

  • కర్నూలు
  • 9030419806

ప॥ జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి
    జగమంత వ్యాపించు జయ కల్పవల్లి
చ॥ ఏడేడు లోకాలు ఏలేటి ఏడు కొండల సామికి
    జోల పాడింది నా తెలుగు తల్లి
     అనాదిగా కూస్తున్నా అలసట ఎరుగని
     కోయిలమ్మ నా తెలుగు తల్లి
     కోడి కూత జాములో కొత్త కొత్త పాటకై
     వేచిచూస్తున్నది నా తెలుగు తల్లి
     జాను తెనుగు పదాల్లో పల్లెపడుచు గుండెల్లో
     గూడు కట్టుకున్నది నా తెలుగు తల్లి
చ॥ పాలపిట్ట అంతరంగం కృష్ణా గోదావరి
     తుంగా తరంగం నా తెలుగు తల్లి
     అమ్మపాలు విషమని ఎంగిలి పాలకై
     అర్రులు చాస్తుంటే కుమిలి ఏడుస్తున్నది నా తెలుగు తల్లి
     నాడు పూల పానుపు, నేడు ముళ్ల పందిరి,
     రానున్న కాలం తలుచుకుంటున్నది నా తెలుగు తల్లి
     తెనుగు తనము పోయింది
     పరభాషా పోకడలు గతులు తప్పగా
     నా తెలుగు తల్లికి ముప్పు తప్పదా?

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చినుకులు

చినుకులు

బి.గోవర్ధనరావు


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


మనస్సులం!

మనస్సులం!

ఎ.కిశోర్‌బాబు


య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

చేబ్రోలు అరుణ


నాలో

నాలో

వినోద్‌ గోరంట్ల


స్వాగతం

స్వాగతం

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి