చికిలింత చిగురు సంపంగి గుబురు

  • 320 Views
  • 0Likes

    పి.వి.శివప్రసాదరావు

  • అద్దంకి, ప్రకాశం జిల్లా
  • 9391286438

అతడు: చికిలింత చిగురు సంపంగి గుబురు
      చినదాని మనసూ చినదాని మీద మనసూ ।।చికిలింత।।
ఆమె: మనసైన చినదానికి అందానికీ  ।। మనసైన।।
       కనుసైగ మీద మనసూ   
అ: చెంపకు చారడేసి కనులున్న చిన్నదీ
    చిన్నదాని సిగలో రేకలెన్నో గువ్వకన్ను రైక మీద చుక్కలెన్నో
ఆ: ఎన్నుకో వన్నెలెన్నుకో చిన్నెలెన్నుకో  ।।ఎన్నుకో।।
    వన్నెచిన్నెలెన్నుకో ఎన్నికైన చిన్నవాడా
    పైరగాలి ఘుమఘుమలో చెంగావి చెంగు రిమరిమలో
అ: దిరిసెన పూవుమీద చిలుకూ ముగ్గులూ
    చిన్నారి బుగ్గమీద చిలిపీ సిగ్గులూ
    మల్లెల దొంతరలూ మరుమల్లె దొంతరలూ
ఆ: మనసే.. మనసే మరు మల్లెల దొంతర
అ: మన ఊసే విరజాజి దొంతర
ఆ: పాలవెన్నెలలో.. 
అ: మురిపాల వెన్నెలలో..

ఈ పాటను మల్లాది రామకృష్ణశాస్త్రి రచించారు. ‘చిరంజీవులు’ చిత్రంలోనిది. ఘంటసాల స్వీయ సంగీత దర్శకత్వంలో లీలతో కలిసి గానం చేశారు. ఎన్‌.టి.ఆర్, జమునల మీద చిత్రీకరించారు. సాహిత్యపరంగా చూస్తే పాటనిండా కనిపించేది తెలుగుదనమే. సొగసైన తేలికైన పదాలతో పదునైన భావాలు సృష్టించగల దిట్ట మల్లాది. ఆయన శైలి దేవులపల్లి వారి శైలిని తలపింపజేస్తుంది. ఈ పాటను పరిశీలిస్తే చికిలింత చిగురు, సంపంగి గుబురు, గువ్వకన్ను రైక, పైరగాలి, రిమరిమ, వన్నెచిన్నెలు, ఊసు, దొంతర, దిరిసెనపూవు చిలిపి సిగ్గులు, చిన్నారి బుగ్గలు, చిలికే ముగ్గులని.. ఎంత అచ్చతెలుగు భావుకత! సాహో మల్లాది అని తక్కిన కవులు ఊరికే అన్నారా! ఇక బాణీపరంగా చూసుకుంటే పల్లవిలోని వేగానికి బుడిబుడి గంతుల కుందేలు పిల్ల గమనం, చరణాల్లో హాయిగా తీసుకొనే ఎత్తుగడకి నిదానంగా పరిగెడుతున్న లేడి పిల్లల పరుగు... ఈ రెండూ కళ్ల ముందు కనిపిస్తున్నట్టు ఉంటుంది. తర్వాత రోజుల్లో ఘంటసాల ఇలాంటి పాట మరొకటి చేయలేదేమో! 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తిలకం

తిలకం

ముకుందాపురం పెద్దన్న


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్


మౌనంగా ఒక నీ కోసం

మౌనంగా ఒక నీ కోసం

గ‌విడి శ్రీనివాస్‌