వైరుధ్యాలు

  • 282 Views
  • 0Likes

    చంద్రశేఖర్‌ ప్రతాప

  • కరీంనగర్
  • 9948856377

తూర్పున సూర్యోదయం ఆస్వాదిస్తూ వాడు!
వెల్తురు వెనక చీకటి కుట్రనేదో శోధిస్తూ నువ్వు!

ముళ్ల దారైనా కొత్తగా నడవాలని వాడు!
ట్రెడ్మిల్‌ మీద నడుస్తూ 
నడక తెలీదని పరిహసిస్తూ నువ్వు!

నీ చెంత నాలుగు అక్షరాలు నేర్చుకుంటాననుకుంటూ వాడు
వాడి కక్ష్యని సైతం నిర్ణయించాలని నువ్వు!

గొంతు సవరించుకుని కొత్త పాట పాడుతూ వాడు! 
అది నీ గూటి పాటై ఉండాలని శాసిస్తూ నువ్వు!

జంతువుల్ని ప్రేమిస్తూ వాడు
మనిషిగా ఎదగలేదని వాదిస్తూ నువ్వు!
సీతాకోక చిలుకవర్ణాల్లో వివశుడౌతూ వాడు
ఇంకా గొంగళి పురుగనే ఊహిస్తూ నువ్వు!

హృదయం అద్దంలా ఉండాలని వాడు
లైబ్రరీలా ఉండాలని నువ్వు!
నవ్వులో నవ్వు మాత్రమే చూసే వాడు
నవ్వు వెనక విషం శోధించే నువ్వు!

నీకేదీ తిన్నగా వినిపించదు
వాడికేదీ నిన్నగా కనిపించదు!
ఎదిగేకొద్దీ తేటతెల్లం అవుతూ వాడు
కొత్త ముసుగులు తొడుక్కుంటూ నువ్వు! 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నీవు

నీవు

చందలూరి నారాయణరావు


మహానది

మహానది

డా।। సి.భవానీ దేవి


కర్తవ్యం

కర్తవ్యం

పచ్చా పెంచలయ్య


కన్యాదానం

కన్యాదానం

ఐతా చంద్రయ్య


నల్లరేగడి రంగుల స్వప్నం

నల్లరేగడి రంగుల స్వప్నం

గ‌రిక‌పాటి మ‌ణీంద‌ర్‌


వసంత విహారం

వసంత విహారం

నందిరాజు శ్రీనివాస్‌