నా స్వప్నాశ్రువులు!

  • 257 Views
  • 0Likes

    దండమూడి శ్రీచరణ్‌

  • భువనగిరి, నల్గొండ.
  • 9866188266

నేను జీవితాన్ని
చాలా దగ్గరగా
దూరం నుంచి చూశాను!
నేను సముద్రంలోకి అలలను తోశాను
నేను నా ముఖాన్ని మీలో చూశాను!
నన్ను నేను హింసించుకున్న క్షణాలేవీ కవిత్వం కాకపోవచ్చును
కానీ నా కవిత్వంలో ప్రవహించే కన్నీళ్లు మాత్రం నావే!
నేను చిత్తరువును ప్రేమించినాక గానీ
ప్రకృతిని ఆరాధించడం ఆరంభించలేదు!
మగువ మనసు నాకు అగాధ అఖాతం!
తెలిసిన తీరాలన్నీ నిన్ను మోసం చేసేవే!!
ఈ పచ్చిక బయలులో పులులు పొంచిన నిశ్శబ్దం,
నా కవితల్లో ధ్వనిస్తుంది!
ముఖ్యంగా ఆ పులుల పసుపు చారలు!!
ఈ జగత్తులో నాకు లభించినవి
ఇదిగో ఈ సిరా, కొంత ఏకాంతం!
అవి అనుకోవచ్చు నా సర్వస్వం!!
ఈ పుస్తకాలలో,
తెరిచిన వెంటనే
కొన్ని లోయలలోని గొంతుకలు ప్రతిధ్వనిస్తాయి!
ఆకళించుకునేలోపు
అవి మూగబోతాయి!!
ఇక్కడి ఇసుకలో పాదముద్రలే తప్ప
మనుషులు కనిపించరు,
ఆ పాదముద్రలను అనుసరించడమే
నిన్ను ఆ మనుషులను చేరుస్తుందని నా గుడ్డి నమ్మకం!
ఈ ఆకాశం కాన్వాసుపై అన్నీ అసంపూర్ణ వర్ణ చిత్రాలే,
నీ చూపు సోకేలోపు వాటి రూపు మారిపోతుంది
జీవితమూ అంతే కదా!
ఓ పాంథుడా!
నీవు ఇక్కడ చెరసాలలో బందీవి,
నీ దేశం వెతుకుతూ
నువ్వు కన్న స్వప్నాలు
ఇదిగో,
ఇక్కడి మొగ్గల్లో మంచు బిందువులై ఘనీభవించాయి!
అవి బహుశా పూల కన్నీళ్లు కావొచ్చు!!
లేదా ఈ కవి అక్షరాల అశ్రువులు కావొచ్చు!!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తిలకం

తిలకం

ముకుందాపురం పెద్దన్న


ఆవల

ఆవల

యామినీదేవి కోడే


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్