వికృతం

  • 852 Views
  • 0Likes

    కె.శాంతారావు

  • హైదరాబాదు
  • 9959745723

నిన్ను నీవు కుళ్లపొడుచుకో
నిన్ను నీవు దుక్కి దున్నుకో
ప్రక్షాళనతో నీ మాలిన్యాన్ని
నీకు నీవే ఎరువుగా మార్చుకో
నిన్ను నీవే ఇంధనంలా
దహించుకో...
మొండికేస్తే...
బండరాయి మూర్ఖత్వంగా
ఆత్మక్షేత్రం బీడై మొరాయిస్తుంది
ప్రకృతి కరుణ
ఎంతగా వర్షించినా
పరిశుద్ధ బీజాలు ఎంత
స్వచ్ఛంగా మెరిసినా
జీవంలేని జడ పదార్థంలో
మొక్క మొలవడం ఎలా సాధ్యం?
కటిక నేలైనా
కసాయి ఆత్మయినా
నులివెచ్చని నవనీతం కావాల్సిందే
పచ్చగా చిగురించాలంటే
ప్రతిక్షణం తొలకరై
పచ్చి బాలింత కావాల్సిందే
జీవాత్మ సజీవత్వానికి
నిత్య సేద్యం జరగాల్సిందే
సేద్యం చేసుకోకుండా
పంటను ఆశించడమే
ప్రపంచీకరణ వికృతం

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చినుకులు

చినుకులు

బి.గోవర్ధనరావు


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


మనస్సులం!

మనస్సులం!

ఎ.కిశోర్‌బాబు


య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

చేబ్రోలు అరుణ


నాలో

నాలో

వినోద్‌ గోరంట్ల


స్వాగతం

స్వాగతం

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి