సీతాకోక చిలుక

  • 1171 Views
  • 0Likes

    ఎస్‌.ఆర్‌.భల్లం

  • తాడేపల్లిగూడెం, ప.గో.జిల్లా
  • 9885442642

ఎంత బావుందో
రాగరహిత ప్రపంచాన్ని
రంగురంగుల మయం చేస్తుంది
రెక్కలపై
చుక్కల ప్రేమలేఖ
ఏ చెలి ఎద చెంతకు చేరుస్తుందో
ఏ చిత్రకారుడు
ఈ రెక్కల కాన్వాసుపై
వేలవేల బొమ్మలు వేశాడో
తెగ మెచ్చుకోవాలని ఉంది
ఏదో ఉండలా
కొమ్మకు వేలాడుతూ
ఆపై ఒళ్లంతా రోమాలు
అదేదోలా అనిపించే
చిన్నారి సీతాకోకా...
నిన్ను చూశాకే తెలిసింది
నీ రూపంలో ఉన్న
నన్ను నేనే ఆరాధిస్తున్నానని
ఒంటి మీద పొలుసులు
సొగసైన రెక్కలవుతాయి
ఏదో తెలీని ఇంకేదో రసం
వాటి మీద బొమ్మలు, గీతలు గీస్తే
వర్ణకేళి భలే ముద్దొస్తుంది
కొమ్మలోంచి రెమ్మల మీంచి
చిగురులాంటి సీతాకోకా...
సీతాకోక లాంటి చిగురూ...
ఈ రెండూ నిజమేనేమో
ఎండిన కొమ్మలు
ఎన్నెన్ని సీతాకోకల్ని చిగురించాయో
కనిపిస్తూ, వినిపిస్తూ, కంపిస్తూ...
ఈ సీతాకోకల ఇవాళ్టి ప్రయాణమెటో?
ఇంకా తేల్చుకోలేదేమో...

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చినుకులు

చినుకులు

బి.గోవర్ధనరావు


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


మనస్సులం!

మనస్సులం!

ఎ.కిశోర్‌బాబు


య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

చేబ్రోలు అరుణ


నాలో

నాలో

వినోద్‌ గోరంట్ల


స్వాగతం

స్వాగతం

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి