పసిజాడ

  • 302 Views
  • 0Likes

    టి.వెంకటేష్

  • కర్నూలు
  • 9985325362

నిశిరేయి నిద్దుర గాయపడ్డప్పుడు
పసితలపు సలుపు కోతపెడుతుంది
అదృశ్యమైన అల్లరి జాడ గుర్తొచ్చి
దేహం చిగురుటాకై వణుకుతుంది
పటమైన పసితనం ఎదుట
జ్ఞాపకాలన్నీ పోగు చేసుకుని కుములుతుంది
కలడో, లేడో తెలియని గారాల కూనకై
వెతికిన దారుల్లో పదేపదే వెతుకుతూ
తనే తప్పిపోతుంది
ఏ దిక్కున పసిపలుకులు విన్నా
పున్నమి మొలకల తళుకులు కన్నా
మంచు నీడై పారాడుతుంది
గలగల ప్రవహిస్తోన్న రూపాల్లో
కనుమరుగైన రూపం కానరాక
ఆకు రాలిన అడవై చెమరుస్తుంది.

ఫొటోకు మాల... అన్న
నాలుగు పొడి మాటలకు
ఒక పలుచటి నమ్మకం
గాలిలో దీపమై రెపరెపలాడుతుంది
ఏ గోరువెచ్చని సమయానో
కలల రంగులపై వాలే పసి మొలక
పాలపిట్టై వాలుతాడని
గోధూళి వేళను
గోరింట నవ్వై వెలిగిస్తాడని
ఒక శ్వాస...
ఎదురు చూస్తూనే ఉంది గుమ్మమై

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నీవు

నీవు

చందలూరి నారాయణరావు


మహానది

మహానది

డా।। సి.భవానీ దేవి


కర్తవ్యం

కర్తవ్యం

పచ్చా పెంచలయ్య


కన్యాదానం

కన్యాదానం

ఐతా చంద్రయ్య


నల్లరేగడి రంగుల స్వప్నం

నల్లరేగడి రంగుల స్వప్నం

గ‌రిక‌పాటి మ‌ణీంద‌ర్‌


వసంత విహారం

వసంత విహారం

నందిరాజు శ్రీనివాస్‌