గెలుపు అమ్మదే!

  • 291 Views
  • 0Likes

    చెళ్లపిళ్ల శ్యామల

  • విజయనగరం
  • 9949831146

అంపశయ్యపై
భీష్ముడిలా ఉన్నా
నీ కెంత ఆశ!
మోడైన కాలం ఎప్పటికైనా
మమతల్నే చిగురిస్తుందని!
నీ పొత్తిళ్లలో పెరిగిన
అనుబంధం
నీ మమకారాన్నే వెక్కిరిస్తూ
నీ ఉనికినే మరచి
కొత్తబాట సాగినా
నీకెంత నమ్మకం!
వలసవెళ్లిన పక్షులు
తిరిగి నిన్నే చేరగలవని!
వాన చినుకు కోసం
ఆకాశం వైపు చూసే పైరులా
వదిలెళ్లిన బంధం కోసం
వెదుకులాడుతున్న
తల్లి చూపులా
ఎంత కాలం ఎదురు చూసావో నువ్వు!
కాలమే కలల్ని కరిగించగలదు
ఆశల్ని పండించనూ గలదు
నీ సంకల్ప బలమే
నీ ఆశను గెలిపించింది! 
నీ నమ్మకమే నీకు
పూర్వ వైభవాన్ని దక్కించింది!
నీ వారసుల్ని కమ్మిన
పాశ్చాత్య కాలుష్య మేఘం
కరిగిపోతోంది!
నేలంతా తెలుగుదనం నిండి
తల్లి ప్రేమకై తల్లడిల్లుతోందిపుడు!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తిలకం

తిలకం

ముకుందాపురం పెద్దన్న


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్


మౌనంగా ఒక నీ కోసం

మౌనంగా ఒక నీ కోసం

గ‌విడి శ్రీనివాస్‌