స్నేహ సాంత్వన

  • 338 Views
  • 0Likes

    స్వర్ణ శైలజ

  • విశాఖపట్టణం.
  • 8500632936

చీకటి ఉషోదయాల
కలువ కవనాలు పూయిస్తూ
వేకువని మింగేసిన చీకటి నైరాశ్యాలలో
వెన్నెల పుప్పొడి జల్లుతూ
సిరినగవుల అలలమీద
చందనశీతల సమీరం...
అదో ఆనందాభిషేకం.

చెదరిన కలలగూడు
ఇసుక సమాధుల కింద నిస్సత్తువ నిశ్శబ్దమైనవేళ
గాలి అలలమీద ఆ శ్వాస
ప్రాణ దీప్తం.
కడలిని మింగిన కన్నీటి బొట్లు
సునామీలా చుట్టుముట్టే వేళ
ఆ పదాక్షరాలు సాంత్వన కలశం.
కలువ లోగిలిలో ఓ ప్రత్యూషం
కమలోదయంలో ఓ ప్రదోషం
అదో అంతెరుగని అతిశయానందం.

వెతల కతల తుషారాల మీద
మరంద మనోజ్ఞ మందాకినిలా
రాలిపడిన గతాలమీద
గెలుపు పిలుపులా
నా మనోధైర్యంలా
చెరగని చిరునవ్వులా
నడిచే పాదాలకి తానే సందేశంలా
నన్ను నాలో నింపుతూ
నా చుట్టూ నీ స్నేహం...

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి గూట్లో...

మట్టి గూట్లో...

రాజశేఖరుని శ్రీశివలక్ష్మి


నీవు

నీవు

చందలూరి నారాయణరావు


మహానది

మహానది

డా।। సి.భవానీ దేవి


కర్తవ్యం

కర్తవ్యం

పచ్చా పెంచలయ్య


కన్యాదానం

కన్యాదానం

ఐతా చంద్రయ్య


నల్లరేగడి రంగుల స్వప్నం

నల్లరేగడి రంగుల స్వప్నం

గ‌రిక‌పాటి మ‌ణీంద‌ర్‌