వసంతాగమనము

  • 356 Views
  • 0Likes

    ఆర్‌.వి.చలపతి

  • వెల్లూరు, తమిళనాడు
  • 8754185630

‘కూకూ’యనుచు సాగు కోకిలారావమ్మె
  మంగళాతూర్యమై మారుమ్రోగ,
క్రొత్తగా చిగురించు గున్నమామిడి కొమ్మ
  పచ్చివాసనల ధూపములు వేయ,
పరిమళ భరితమే ప్రత్యూష పవనమ్ము
  మదికి హాయిని గూర్చి ముదము తెలుప,
కొంగ్రొత్త యందాల కొసరు సిగ్గులతోడ
  తలలూచి విరులు నృత్యమ్ములాడ,

కనుల కాంతుల నింపి యుగాది వేళ
స్వాగతము బల్కె వనలక్ష్మి సాదరముగ!
సకల శుభముల దోడ్కొని సాగి రమ్ము!
జయము జయమిదె నీకు వసంతపురుష!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తిలకం

తిలకం

ముకుందాపురం పెద్దన్న


ఆవల

ఆవల

యామినీదేవి కోడే


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్