ఆదినాదము నుండె...

  • 290 Views
  • 0Likes

    గొడవర్తి శ్రీనివాసు

  • పెదపళ్ల, తూ.గో.జిల్లా
  • 9963556696
గొడవర్తి శ్రీనివాసు

ఆదినాదము నుండె తెలుగంకురించింది
ఆంధ్రభాషగ అవనినవతరించింది.
వేదకాలములోనె తెలుగు వెలుగులీనింది,
దమ్మపదములతోడ తరగలెత్తింది
మా తెలుగుభాషకు సాటేది?
మా తెలుగుపాటకు దీటేది?
గోదావరి గమన గాంభీర్యమందుకుని,
కృష్ణా తరంగాల కమ్మదనమలముకుని,
నన్నయ్య కలములో నవరసాలొలికించి,
నన్నెచోడుడి ఇంట సొగసులే కురిపించి,
మంజీర నాదమై, పోతన పద్యమై,
తియ్యని రాగాల త్యాగయ్య గానమై
తరగలెత్తింది..తెలుగు తారంగమాడింది.
మా తెలుగుభాషకు సాటేది?
మా తెలుగుపాటకు దీటేది?
హొసూరు సీమలో హొయలొలికి, హొయలొలికి,
కోలారునాడులో పసిడివన్నెలు చిలికి,
తంజూరు, బళ్ళారి, బస్తరు, బరంపూరు...
హిందు సంద్రము నుండి గంగ గట్టువరకు
యుక్తి చూపింది..తెలుగు తన శక్తి చాటింది.. 
మా తెలుగుభాషకు సాటేది?
మా తెలుగుపాటకు దీటేది?
బ్రహ్మదేశమునందు, మలయ ద్వీపములోన,
రంగులద్దింది, తెలుగు హంగు చూపింది.
అమెరికా ఖండాన, ఆఫ్రికా దేశాన,
ప్రజ్ఞతో, ప్రతిభతో, తనదైన పటిమతో
వేణికలు పారించి, వెల్లువలు కురిపించి,
తనసాటి భాషొకటి ఇలను లేదంటూ,
విశ్వంభరాన్నంత వినుతి కెక్కింది.
ఆదినాదము నుండె తెలుగంకురించింది,
ఆంధ్రభాషగా అవనినవతరించింది.
వేదకాలములోనె తెలుగు వెలుగులీనింది,
దమ్మపదములతోడ తరగలెత్తింది
మా తెలుగుభాషకు సాటేది?
మా తెలుగుపాటకు దీటేది?

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తిలకం

తిలకం

ముకుందాపురం పెద్దన్న


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్


మౌనంగా ఒక నీ కోసం

మౌనంగా ఒక నీ కోసం

గ‌విడి శ్రీనివాస్‌