మాతా! తవ వందనమ్‌!

  • 288 Views
  • 0Likes

    పాణ్యం దత్తశర్మ

  • హైదరాబాదు.
  • 9550214912

జయ భారతజననీ! హరిత సస్యశ్యామలావనీ!
హిమనగములు నీ శిరసున మంచుపూలు కురిపించగ
వింధ్యగిరులు నీదునడుము వడ్డాణముగా నమరగ
త్రివర్ణశోభ రెపరెపలను నీదగు కేతనమెగురగ
శిరసునెత్తి సగర్వముగ ఘటియింతుము మహితాంజలి!

సకల మతాదరణను నీ లౌకిక సంస్ఫూర్తి మెరయ
దళితుల హరిజన గిరిజన సంక్షేమమ్మది విరియగ
అల్ప సంఖ్యాకుల మనుగడ ఆనందమ్మున గడువగ
ప్రజాస్వామ్య పరిమళములు దశదిశలను వ్యాపించగ
జెండాయే మాకండగ నుండగ పండుగ మెండుగ

మన ఠీవికి నిబ్బరమునకెంతయు నాలంబనవై
వినువీధిని నర్తించెడు వికసిత సుమదీప్తివై
గుండెలు పొంగగ, పౌరులు జెండాగని దండములిడ
జాతి వ్యతిరేక శక్తుల గుండెలలోనొక దడదడ
భారత జయకేతనమా! విశ్వగౌరవమును గొనుమా!

నలుదిక్కుల నినుగాచెడు త్రివిధ దళంబులనెప్పుడు
మా గుండెలనిడుకొని ప్రేమయు గౌరవముపంచి
ఏదేశమునందుగనిన మనవారలె వెలుగొందగ
నీ జయకేతనమెప్పుడు గగనసీమ విహరింపగ
ఆర్యావర్తపు ఖ్యాతిని అవని యెల్ల చాటింతుము.

జననీ నీ మనమ్ము దిరిసెన కుసుమము, నిరతము
నీ సంతును గాచుకొనుచు నెంతయు కరుణను జూపుచు
ఎన్ని విపత్తులనైనను అధిగమించు ధైర్యమిచ్చి
ఘనకేతన చలనములను జాతికి ఆశీస్సునొసగి
మమ్ముల ధన్యులజేయుము, మాతా! తవ వందనమ్‌!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తిలకం

తిలకం

ముకుందాపురం పెద్దన్న


ఆవల

ఆవల

యామినీదేవి కోడే


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్