‘కన్నెతల్లి’

  • 350 Views
  • 0Likes

    వి.మంగతాయారు

  • మధిర, ఖమ్మం
  • 9949278483

మండుటెండల్లో
మల్లెలు పూసినట్లు
మండే నా గుండెల్లో 
మమత విరిసింది...
నా కన్నీటి తడిలో
కరుణ కురిసింది!!
ఎందుకో తెలుసా?
ఓ కిరాతకుడి 
దురాగతానికి బలియైన
ఈ శరీరంలో
ఓ ప్రాణి జీవం పోసుకుంటుందని
తెలిసినందుకు...
స్త్రీకి మాతృత్వం 
వరమో - శాపమో
తెలియని స్థితి!
మాతృత్వం స్త్రీత్వానికి
పరిపూర్ణతను సంతరించినా
సమాజానికి సమాధానం
చెప్పలేని పరిస్థితి!!
ఇష్టం లేకున్నా తల్లినవడం
సృష్టి చేసిన తప్పు
నాకెందుకు శిక్ష?
అని సమాజాన్ని ప్రశ్నిస్తే
సమాధానం లేదు
ప్రశ్నకు ప్రశ్నే సమాధానం...
తండ్రి లేకుండా బిడ్డ ఉండడు
తండ్రి తప్పుకుంటే
తల్లిదా తప్పు?
ఎవరేమనుకున్నా నా బిడ్డకు
మాతృప్రేమను
పరిపూర్ణంగా చవి చూపిస్తా!
మాతృత్వపు మహోన్నతిని చాటిస్తా!!
‘‘క్షణకాల భోగం తండ్రి
యుగకాల యోగం తల్లి’’

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి గూట్లో...

మట్టి గూట్లో...

రాజశేఖరుని శ్రీశివలక్ష్మి


నీవు

నీవు

చందలూరి నారాయణరావు


మహానది

మహానది

డా।। సి.భవానీ దేవి


కర్తవ్యం

కర్తవ్యం

పచ్చా పెంచలయ్య


కన్యాదానం

కన్యాదానం

ఐతా చంద్రయ్య


నల్లరేగడి రంగుల స్వప్నం

నల్లరేగడి రంగుల స్వప్నం

గ‌రిక‌పాటి మ‌ణీంద‌ర్‌