సౌందర్యలహరి

  • 914 Views
  • 0Likes

    వి.మంగతాయారు

  • మధిర, ఖమ్మం
  • 9949278483

అదొక విశ్వకళావేదిక!
అందొక అందాల అభిసారిక!!
తటిల్లతలా ఓ మెరపు మెరిసింది
ప్రణవనాదం ప్రణయ నాదమైంది...
శ్రుతిలయల కనుగుణంగా
పాదమంజీరాలు ఘల్లుమన్నాయి
మువ్వల సవ్వడితోపాటు
గాజులు గలగలమన్నాయి
సన్నని ఉంగరాల వేళ్లు
ముద్దుగా ముద్రలు పడ్డాయి...
గోదారికి రాదారిలా
నుదుటిపై
పాపిటబిళ్ల పారాడింది
నల్లని కురులలో ఒకేసారి
సూర్యచంద్రులు
తళుక్కుమన్నారు...
విల్లులా వంగిన
కనుబొమల మధ్య
ఎర్రని కుంకుమ
త్రినేత్రంలా మెరిసింది
నీలి మబ్బుల్లాంటి
కాటుక కళ్లు
కాంతులీనాయి...
ముత్యాల ముక్కెర
ముక్కుపై
మురిపెంగా మురిసింది
మదనుని బాణంలాంటి
అధరాలపై చిరునవ్వు
అందంగా విరిసింది...
చెవుల లోలాకులు
వూయల లూగుతుంటే
చెంపసరాలు చెవిలో దూరి
సుస్వరాలు వినిపిస్తున్నాయి...
యవ్వనాన్ని బిగించిన రవిక
కనిపించీ కనిపించక
కవ్విస్తోంది...
ఎద పయ్యెదపై నగలు
నాట్యం చేస్తున్నాయి...
వజ్రాల వడ్డాణం
నడుము నాజూకుతనానికి
పరీక్షగా నిలిచింది
జబ్బలపై అరవంకీలు
నిబ్బరంగా నిలిచాయి
అందంగా అమిరాయి...
మనసును దోచే మల్లెలు
కవ్వించే కనకాంబరాలు
పూరాణులు గులాబీలు
తళుకుమనే జడబిళ్లలు
వూగాడే జడకుచ్చులు
మొదలు నుంచీ చివరి వరకూ
నాగుపాములాంటి జడకు
నాజూకుగా అమిరాయి...
ఆమె కదిలే ప్రతి కదలికా
వయ్యారాల వరూధిని అవుతోంది
మనసు వశం తప్పి
పరవశమైపోతోంది...
ఓ బ్రహ్మా!...
అలంకారానికి అనువుగా
ఆడదాన్ని సృజించావు
ప్రకృతి సోయగాన్నంతా
ఆమెలో నింపావు
ఆనందించి ఆరాధించే
భాగ్యాన్ని ప్రసాదించావు
విధాతా!... నీకిదే
మా వందనం!...

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చినుకులు

చినుకులు

బి.గోవర్ధనరావు


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


మనస్సులం!

మనస్సులం!

ఎ.కిశోర్‌బాబు


య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

చేబ్రోలు అరుణ


నాలో

నాలో

వినోద్‌ గోరంట్ల


స్వాగతం

స్వాగతం

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి