మా వూరి చెరువు

  • 1001 Views
  • 0Likes

    చాడా లలితాదేవి

  • విశ్రాంత అధ్యాపకురాలు,
  • కామారెడ్డి
  • 9848868071
చాడా లలితాదేవి

కరవు తీర్చు కన్నతల్లి మావూరు చెరువు
కనుల విందుజేయు మాపల్లెతల్లి ‘మురువు’
శీతల తరంగాలు విరిసే సవ్వడులు
మదిని తాకి మురిసే మౌనగీతికలు ॥క॥
ఈదులాడు చిన్నారుల ఒడిని చేర్చి లాలించు
వల విసిరిన జాలరుల కోర్కెల మన్నించు
తామరలతో వికసించి మనసుల మురిపించు
ప్రాణుల దప్పికను తీర్చి, దయతో లాలించు
నమ్ముకొన్న వారి యెదనింపెడి ‘గంగమ్మ’
ఆనంద డోలికలనోలలాడించెడి కొమ్మ ॥క॥
వూరిని చుట్టుకొన్న మరకతాల చెరగులు
పసిడి పూల జాతరలు - జానపదుల ఆటలు
ఉత్సవ మూర్తులకు చక్రతీర్థస్నానాలు
కాపరుల - సద్దుల - రుచుల సుద్దులకు
అందమైన వేదిక - అపురూప భూమిక
పల్లీయుల ప్రేమ విరుల సంధానమాలిక ॥క॥
గత కాలపు వైభవాల మౌనసాక్షులు
జలాశయాలెపుడు జనుల జీవరక్షలు
ఈ సోయికి కావాలి మొక్కవోని దీక్షలు
ఇది కలిగిన వారే పాలనా దక్షులు
వారికేసి ఆర్తితో ఎదురుచూచు జనులతో
నిండిన మాపల్లెగుండె పొంగి పొరలుతున్నది
పరవశించి హాయిగా పాడుకుంటున్నది
గుండె గదుల దరువులకు చిందులు వేస్తున్నది ॥క॥

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చినుకులు

చినుకులు

బి.గోవర్ధనరావు


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


మనస్సులం!

మనస్సులం!

ఎ.కిశోర్‌బాబు


య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

చేబ్రోలు అరుణ


నాలో

నాలో

వినోద్‌ గోరంట్ల


స్వాగతం

స్వాగతం

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి