వేకువ సూర్యుడు

  • 99 Views
  • 0Likes

    రఘుపాత్రుని శ్రీనివాసరావు

  • అరసవల్లి
  • 9491810283

అర్ధరాత్రి దాటిందంటే
వాడి కర్తవ్యం మొదలైనట్టే..
పచ్చి నిద్రలోంచి బతుకును కలవరిస్తూ వాడు లేస్తాడు..
ఉదయించే సూర్యుడి కంటే ముందే..
మత్తు మొహాల్ని అక్షరాల నీటి చుక్కలతో కడిగేందుకు..
నిన్నటి చరిత్రతో
వార్చిన వంటకాన్ని పంచేందుకు..
రాత్రంతా అక్షర శ్రామికులు గుచ్చిన..
వార్తల మాలలను మోసుకొని..
పాదాలకు చక్రాలను అతికించుకొని పరుగులు తీస్తాడు..
లోకం నిద్ర లేవక ముందే ముగ్గులో ముద్దబంతిలా పాదముద్ర వేసుకొని..
ప్రతి ఇంటి ముందు
అక్షర గుచ్ఛాన్ని గుచ్చి పోతాడు..
వణికించే చలి అయినా,
భోరున కురిసే వానే అయినా..
వాడి బాధ్యతకు అడ్డు కానే కావు..
కర్తవ్య దీక్షలో పురస్కారం
ఇవ్వాలంటే వాడే ముందు వరసలో
ఉంటాడు.. నెలకోసారి పున్నమి
చంద్రుడు కనబడ్డట్టు.. పేపర్‌ బిల్‌
కోసమే వస్తాడు.. ఈలోగా
మలయమారుతంలా వచ్చిపోతాడే
తప్ప కంటికి కనబడడు.. 
వాడు శ్రమజీవి..
శ్రమకు తగ్గ ఫలం లేని అల్పజీవి.
వాడు బతుకులో వెలుగులేని
వేకువ సూర్యుడు..

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


హేమంత ఋతుకాంతి

హేమంత ఋతుకాంతి

- నరసింహశర్మ మంత్రాల,


అమ్మ అక్షరాలు 

అమ్మ అక్షరాలు 

- డా।। ఎ.రవీంద్రబాబు


మురళీగానం

మురళీగానం

సుధీంద్ర‌భార్గ‌వ‌