పునరపి గీతం!

  • 1012 Views
  • 0Likes

    రాళ్లబండి శశిశ్రీ

  • హైదరాబాదు
  • 7032288256

మాట మర్మం
చేష్ట మర్మం
మనో వాచం
అగోచరం -
అర్థం కాని వ్యాకరణం!
మనిషికీ మనిషికీ
మధ్య దూరం
ఒక స్థిరరాశి-
ఎడారి కోయిలపాట
నిరంతరంగా ఆలపిస్తున్న
శివరంజనిగీతి!
ఆరు రిపుల ముట్టడిని
ఎదుర్కోవడానికి
ఓ వేదాంతవాక్యం-
పూరింపబడని ఖాళీలతో
అలముకున్న శూన్యావరణం!
భావనలన్నీ నీరసించి
ఉత్సుకతలన్నీ ఆవిరై,
తప్పక ఈదాల్సిన
శోక సముద్రం-
కాలంతో కలహించలేని అచేతనం!
నిలువరించలేని ఆలోచనలు
ఫలితం తేల్చని అన్వేషణలు
గమన గమకాలలో
ఆవిష్కరించే నాదం-
అదే జీవన గీతం!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


కలవరం

కలవరం

మౌనశ్రీ మల్లిక్


పొగమంచు

పొగమంచు

విరాగి


రుణానుబంధం

రుణానుబంధం

చెంగల్వల కామేశ్వరి


కొన ఊపిరిలోనైనా

కొన ఊపిరిలోనైనా

డాక్టర్‌ సి.నారాయణరెడ్డి


వరదాయిని దివ్య శుభాంగీ

వరదాయిని దివ్య శుభాంగీ

పుల్లాభట్ల నాగశాంతి స్వరూప


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి