ఔను... ఆ శివుడే నా రోల్‌మోడల్‌

  • 1025 Views
  • 0Likes

    బి.రమాసుందరి

  • రామనగర్, ఒంగోలు
  • 9440568912
బి.రమాసుందరి

కన్రెప్పల్ని తడిపేసే కన్నీళ్లలోనూ
ఆనందాశ్రువులు అన్వేషించడం...
భరించరాని బాధల్లోనూ
సరదాలు వెతుక్కోవడం...
పెల్లుబికే విషాదాల్లోనూ
వెల్లువెత్తి వినోదించడం...
ఓవైపు గుండె జ్వలిస్తున్నా...
చూపులు వెలిగించుకోవడం...
మధ్యతరగతి మానవుడిని కదా!
అమావాస్యలోనూ
పున్నమి కోసం వెతుకులాట
పన్నెండు గంటల నీరవ నిశీధిలోనూ
ఉషస్సు కోసం వెంపర్లాట
వైఫల్యాలు వరిస్తున్నాయని...
విజయాల్ని పలవరించమా?
నైరాశ్యం కబళిస్తోందని
ఆశని శ్వాసించమా?
దారంతా ముళ్లుంటే ఏం?
పాదాలకు గాయాలైనా
పరుగాపని నైజం నాది!
నిర్దేశించుకున్న గమ్యం కోసం
అలుపెరుగని గమనం నాది!!!
వేదనల్తో సాహచర్యం చేస్తూ
‘నేడు’ నిన్నలో కలిసిపోతున్నా...
రేపటి తూర్పున ఉదయించే
అరుణారుణ కాంతి కోసం
ఒళ్లంతా కళ్లు చేసుకుని ఆశగా నిరీక్షిస్తున్నా!
ఔను... ఆ శివుడే నా రోల్‌మోడల్‌!
అచ్చం అతడిలా... గళంలో గరళం ఉన్నా...
అమృతాల నదిలో తలారా స్నానిస్తున్నా!

*    *    *

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


హేమంత ఋతుకాంతి

హేమంత ఋతుకాంతి

- నరసింహశర్మ మంత్రాల,


అమ్మ అక్షరాలు 

అమ్మ అక్షరాలు 

- డా।। ఎ.రవీంద్రబాబు


జీవన రుతువు

జీవన రుతువు

డా।। ఎన్‌.గోపి