కాగితపు కిటికీ

  • 1035 Views
  • 0Likes

    దేవులపల్లి దుర్గాప్రసాద్‌

  • విశాఖపట్నం
  • 9701096699

ఉషోదయాన్నే ఊరేగడానికి రాత్రే ముస్తాబవుతాను!
కాఫీ, టీల ఘుమఘుమలు,
కళ్లాపి జల్లుల మట్టి వాసనలు,
విరిసీ విరియని వెలుగు పూలు,
తెరచీ తెరవని వేచి ఉన్న కళ్లు,
సుప్రభాతాన నను స్వాగతిస్తుంటే
సైకిల్‌ మీంచి వాకిట్లోకి, సాదరంగా వచ్చిపడతాను!

రాజకీయాల రంగుల్ని, రమణీయ ప్రపంచపు పొంగుల్ని
ఆరంభశూరత్వాల హంగుల్ని, ఆశల నావలు నడిపే సరంగుల్ని
ఆకలి కేకల హోరుల్ని, ఆరాటపు ఆవిరి పొగల్ని
విజయ శిఖరాల వీర గాథల్ని, వినమ్ర సమాజ సేవా గంధాల్ని
నాతోనే తీసుకొస్తాను, మీకోసమే ప్రదర్శిస్తాను
సన్మానాలు, శాపనార్థాలు, వేడుకలు, వేదనలు
విజ్ఞాన వినోదాలు, విపత్తుల విపరీతాలు
ఎన్నో నాలో పక్కపక్కనే!
నాకు లేదు మక్కువ, దేనిపైనా, ఎక్కువ, తక్కువ!!

లోకపు పోకడచూపే కాగితపు కిటికీని
లోగుట్లను బయటపెట్టే కాంతులీనే దివిటీని!
అక్రమాలపై ఎక్కుపెట్టిన అక్షరాస్త్రాన్ని!
ఆలోచనల నాట్లు మొలిచే పద క్షేత్రాన్ని!
వేకువనే వెలుగులు చిమ్మే విశేషాల తారకని
విశ్వమంతా తిరిగివచ్చే విపంచి గీతికని!
రోజూ మీచేతుల్లో అలరారే మీ దినపత్రికని
నా రాతలతో, మీ రాతల బాగుకోరే మీ అభిమాన పుత్రికని!!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి


తెలుగు వెలుగు

తెలుగు వెలుగు

అలపర్తి వెంకట సుబ్బారావు


చిన్నమాట

చిన్నమాట

శారద ఆవాల


గెలుపు దారి

గెలుపు దారి

- నూతలపాటి వెంకటరత్నశర్మ


ప్రశ్న

ప్రశ్న

అందెశ్రీ


ఆవిష్కారం

ఆవిష్కారం

- ఈతకోట సుబ్బారావు