అవ్యక్త భావం

  • 950 Views
  • 0Likes

    హంసగీతి

  • హైదరాబాదు
  • 9866955756

చెప్పలేని ఆరాటమో ఆశ్చర్యమో
అంతు తెలియని వెలితో వేదనో
మనసంతా పరచుకుంటే
విరుచుకుపడే రెప్పలు
కదలికలు లేక ఆగిపోయిన తరుణంలో...
కనుల వాకిట సిగ్గుల ముగ్గులేసిన
మదిభావనల వర్ణాలు వెలవెలబోయాయి...
మౌనసంఘర్షణ దిగులు మేఘమై
కురిసేందుకు చెక్కిలివనాలను
అనుమతి అడుగుతోందేమో...
రెప్పల కురులు చప్పున తడిశాయేమో
కాటుక మల్లెలను కనుకొలనులోనే
జారవిడుస్తున్నాయి నిశ్శబ్దంగా...
తడారిపోయిన పెదవులు
ఎండిన పూలరేకుల్లా విడివడ్డాయి...
లిపి లేని భాష్యమేదో
పెదవుల తాళపత్ర గ్రంథాలపై...
అర్థం కాని గీతలేవో అధరాలపై
మౌన సంతకాలు చేస్తుంటే...
అవ్యక్త భావం అర్థం చేసుకోమంటోంది...!!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి


తెలుగు వెలుగు

తెలుగు వెలుగు

అలపర్తి వెంకట సుబ్బారావు


చిన్నమాట

చిన్నమాట

శారద ఆవాల


జీవన రాగం

జీవన రాగం

దార‌ల‌ విజయ కుమారి


గెలుపు దారి

గెలుపు దారి

- నూతలపాటి వెంకటరత్నశర్మ


ప్రశ్న

ప్రశ్న

అందెశ్రీ