సంప్రోక్షణ

  • 830 Views
  • 0Likes

    తేళ్లపురి సుధీర్‌ కుమార్‌

  • కోయిలకుంట్ల, కర్నూలు జిల్లా
  • 9885632727

ఒంటరితనాన్ని ఓడించడం
ఏకాంతాన్ని జయించడం
ఎంత కష్టమో
నువ్వు ఊరెళ్లాకే తెలిసింది-
ఉదయం కళ్లు తెరవగానే
నాలో ఉషోదయాన్ని నింపే
నీ మోము చూడటం అలవాటయ్యాక 
నువ్వు కనిపించని ఈ వారం రోజులు
ఉదయించే సూర్యుణ్ని సైతం
సముద్రంలో నిలువునా ముంచేయాలనిపించింది-
ఏడురోజుల ఈ పడిగాపులు
ఎండాకాలపు వడగాడ్పులై
అమాంతం నన్ను దహించివేస్తున్నాయి-
ఈ కొన్నిరోజుల ఎడబాటులో
ఎన్నిసార్లు నే తడబడ్డానో
నీపేరునే పలవరిస్తూ...
నీపై దిగులు నాకే కాదు
ఈ మధ్యే మొగ్గతొడిగి
విచ్చుకున్న రెక్కలతో విర్రవీగుతున్న
ఎర్రటి గులాబీకీ ఉన్నట్టుంది
అందుకే
రోజూ నీలాగే నీళ్లు పోస్తున్నా
దిగులుగా నేలచూపులు చూస్తూనే ఉంది-
నీ కరస్పర్శ లేని ఆ చిట్టి రోజా
ఎన్ని రోజులని ఎదురు చూస్తుంది నాలాగే-
నీ మాటల మాధుర్యాన్ని
చరవాణి తరంగాలు చెవులకు చేరవేస్తున్నా
నిశ్చేష్టుణ్ణి చేసే నీ రూపాన్ని
చరవాణి తెరమీద
నా నయనాలు ఎంత తిలకిస్తున్నా
ప్రణయ రాగాన్ని పలికించే
నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు
నా మేను సోకే క్షణం కోసమే ఈ నిరీక్షణ
అదే నా మదికి జరిగే నిజమైన సంప్రోక్షణ...!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి


తెలుగు వెలుగు

తెలుగు వెలుగు

అలపర్తి వెంకట సుబ్బారావు


చిన్నమాట

చిన్నమాట

శారద ఆవాల


జీవన రాగం

జీవన రాగం

దార‌ల‌ విజయ కుమారి


గెలుపు దారి

గెలుపు దారి

- నూతలపాటి వెంకటరత్నశర్మ


ప్రశ్న

ప్రశ్న

అందెశ్రీ