విశ్వ ప్రేయసి

  • 898 Views
  • 0Likes

    బలభద్రపాత్రుని ఉదయశంకర్‌

  • గుడ్లవల్లేరు, కృష్ణా జిల్లా
  • 9494536524

ఆమె విశ్వప్రేయసి
అనంత విభ్రమ సౌందర్య రాశి
ఆకుల గలగలల నవ్వులతో,
ఆటవెలదుల ఏటిపాయ నడుముతో,
తోట మలుపుల వాలుకనుల చూపులతో
తరు వధువులు మధుర లాలసల
తరియించిన తీరుగా -
మురిసి, మరపించిన లలన.
కొమ్మల ఊయలలూగి
చిరు రెమ్మల చేతులు చాచి,
చిరుగాలుల వింజామరలు వీచి -
చిత్రరథస్వామి చిత్రంగ చెలరేగు వేళ
చైత్ర పత్ర ఛత్రమై ఛాయనొసగు చారులత
నాలుగు చెరగులా నేల నగ్నంగా సిగ్గిల్లినపుడు
కలతచెంది - తానే తానులకొద్దీ
హరితాంబరమై పరచుకున్న నెలత.
చిగురుటధరముల మధురిమలతో
పొగరు పయ్యెదల పరువపు కొమ్మలతో
మాను ఒంపులు మేని సొంపులైన మానిని
కంటికింపవు కలికి ప్రకృతిపై
కంటగింపవు కరకు వికృతులు
కలికాలనాగులై కాలకూటం కక్కినా,
చెలగాటమాడి చెట్టు, చేమల తొక్కినా
చెలువంపు చెలియ చెలిమినే పంచుతుంది
ఆమె సర్వ మానవ హితైషి
శ్రేయమే ధ్యేయమైన విశ్వప్రేయసి

 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి


తెలుగు వెలుగు

తెలుగు వెలుగు

అలపర్తి వెంకట సుబ్బారావు


చిన్నమాట

చిన్నమాట

శారద ఆవాల


గెలుపు దారి

గెలుపు దారి

- నూతలపాటి వెంకటరత్నశర్మ


ప్రశ్న

ప్రశ్న

అందెశ్రీ


ఆవిష్కారం

ఆవిష్కారం

- ఈతకోట సుబ్బారావు