అచ్చం అచ్చు

  • 551 Views
  • 0Likes

    అన్నవరం దేవేందర్‌

  • కరీంనగర్‌
  • 9440763479

అచ్చం అచ్చుకొట్టినట్టే
అక్షరం అక్షరం ఉన్నది ఉన్నట్టు
నోట్లెకెల్లి ఊడి పడ్డట్టు
అసలు నకలుగా మారే మాయ

ఒకానొక్క ఒరిజినల్‌ పత్రం
కావల్సినన్ని కాయిదం పూలు పుష్పిస్తది
విద్యుత్‌ మంత్రంతో
రాలిపడుతున్న పూవులన్నీ ఏరుకోవడమే!

ఎట్ల కావాలనుకుంటే అట్లనే
ఉన్నది ఉన్నట్టూ రావచ్చు
ఆకారం పెద్దగా చిన్నగానూ చేయచ్చు
మీట నొక్కంగనే టక టకా
అచ్చు దిగి జారుతయి

కండ్లుమూసి తెరిచినంతలనే
అసలుకు సిసలు కనపడుతయి
భారమూ కాదు, బ్యారమూ లేదు
రూపాయి, రెండు రూపాయలే లెక్క

అచ్చం అచ్చు యంత్రాన్ని
ఏ మహానుభావుడు కనిపెట్టిండో
ఆయన ముఖ జిరాక్స్‌కొక నమస్కారం

కాలం పరుగులు తీసేందుకు
తనకు తానే వేగం సృష్టించుకుంటది
ఫొటోకాపియర్‌ ఒక మంత్రపుష్పం
అక్షరాలకు అచ్చం ప్రతిబింబం

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చిరునవ్వు

చిరునవ్వు

ఆచార్య కడారు వీరారెడ్డి


ప్రతిబింబం

ప్రతిబింబం

వారాల ఆనంద్


కన్నీటి ప్రశ్న

కన్నీటి ప్రశ్న

సుసర్ల శ్యామల


చెరువు...!

చెరువు...!

ఎ.కిశోర్‌బాబు


పాద ధూళి

పాద ధూళి

అందెశ్రీ