పూలగుత్తి

  • 865 Views
  • 0Likes

    లక్ష్మీరామారావు వెదురుమూడి

  • హైదరాబాదు, lakshmiramaraov@gmail.com

భయంభయంగా నేలలో నుంచి పైకి వచ్చింది...
చుట్టూ చూసింది...
నవనవలాడుతూ, మిసమిసలాడే ఆకులతో మెరిసిపోతున్న మిగతా మొక్కలు...
తనవైపు చూసుకుంది... ఈనెల్లాంటి ఆకులతో ఈసురోమంటున్నట్టు తాను...
మొక్కలన్నీ అందమైన రంగుల్లో విరబూసిన పువ్వులతో వెలిగిపోతున్నాయి...
బేలగా తనని చూసుకుంది...
రంగుల హరివిల్లు మధ్యలో వెలిసిపోయిన మబ్బుతునకలా బిక్కుబిక్కుమంటూ... చిట్టిపూలతో తాను...
అందంగా ఉన్న పూలనన్నిటినీ అందరూ
మెచ్చుకుంటున్నారు... మురిసిపోతున్నారు...
ఓ మూలకి ఉసూరుమంటూ ఉన్న తను ఎవరికి కనిపిస్తుంది...
ఎప్పటికీ ఇలా ఒకరిచాటుగా ఒదిగిపోయి ఉండవలసిందేనా...
పూలన్నీ అలంకారంగానో, దండలోనో అందంగా అమరిపోతున్నాయే...
తను కూడా అలా ఇమిడిపోయే ప్రత్యేకత తనలో ఏమీ లేదా...
తనువంతా వడలిపోయినట్టుగా అయింది.
లేదు... నిరాశ తగదు...
పూలన్నీ అపురూపమైనవే... తను కూడా ఎప్పటికీ పూస్తూనే ఉంటుంది తనదైన సొగసుతో...
ఎవరో సుతారంగా సుతిమెత్తగా తన పూలని ఒకటొకటిగా కోసి పేర్చుతున్నారు...
తన పూలన్నీ అందమైన పూలగుత్తిగా మారిపోయాయి...
తమకి దొరికిన గుర్తింపుకి పూలన్నీ ఆనందంతో రెపరెపలాడాయి.

 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి


తెలుగు వెలుగు

తెలుగు వెలుగు

అలపర్తి వెంకట సుబ్బారావు


చిన్నమాట

చిన్నమాట

శారద ఆవాల


జీవన రాగం

జీవన రాగం

దార‌ల‌ విజయ కుమారి


గెలుపు దారి

గెలుపు దారి

- నూతలపాటి వెంకటరత్నశర్మ


ప్రశ్న

ప్రశ్న

అందెశ్రీ