నల్లరేగడి రంగుల స్వప్నం

  • 1051 Views
  • 0Likes

    గ‌రిక‌పాటి మ‌ణీంద‌ర్‌

  • మామునూరు, ఖ‌మ్మం
  • 9948326270

ఎన్ని గ్రీష్మాలను మోశాను
చైత్రగీతం పాడటానికి.
ఎన్ని ఆషాఢాలు తాగాను
వానవిల్లు చూడటానికి 
నింగిదిగిన నెలవంకను 
వేటాడేవాడెవడో
వంగి వచ్చిన వానవిల్లును
చంకన పట్టుకెళ్లాడు.
ఎన్ని జాములు కనురెప్పల కొలికి నుంచి
వేకువగా జారలేదు
ఎన్ని కలలు ఎద వాకిలిలో
సీతాకోకల బృందంగా ఎగరలేదు..!
నాగలి నాకు నేర్పిన పాఠం
బతుకంతా పరోపకారం కోసం పాటుపడమని
మట్టి నాకు చెప్పిన వేదం
సహనం వినయ భూషణమని.
నేను సైనికుడను
ఆకలి పోరుపై అలుపెరగని
రణం సాగిస్తున్న వాడిని.
నేను సైరికుడను
నిత్యం దగా పడుతూ 
లోకాన్ని నిటారుగా 
నిలబెడుతున్న వాడను.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత