తను - నేను

  • 1818 Views
  • 2Likes

    గరిగె రాజేశ్‌

  • హైదరాబాదు
  • 9493971126

తన నవ్వుని గాలి అలలమీద
నా మనసు తీరంలోకి పంపిస్తూ
నా ఎదురుగానే కూర్చుంటుంది ఓ ఆకాశమై
నా చూపుల చేతులతో
తన కన్నుల కాగితాలపై ప్రేమలేఖ రాస్తూ
కళ్లముందే కదలాడుతుంటాను ఓ సాగరమై

తనకి నాకు మధ్య కొన్ని అడుగుల దూరమున్నా
తన పెదాలపైన నా పేరెప్పుడూ
చందమామై విరబూస్తూనే ఉంటుంది
తనకి నాకు మధ్య కొన్ని మౌనాలున్నా
నా ఆలోచనల్లో తన రూపమెప్పుడూ
పడవై సాగుతూనే ఉంటుంది

తన పలకరింపులో ఓ ఉదయాన్ని మోసుకొచ్చి
హృదయానికి జతచేసి జలపాతమై మురిసిపోతుంది
నా ప్రేమలో ఓ పూలవనాన్ని కోసుకొచ్చి
తన కొప్పులో అలంకరించి ఓ చినుకునై సంబరపడిపోతాను

అబద్ధపు అద్దాల మేడలో జీవించడం
తనకి, నాకు నచ్చదు
స్వార్థపు బాటలో నడవడం
తనకి, నాకు ఇష్టముండదు

అందుకే మా మనసుల్ని నగ్నంగా 
ఒకరి ముందు ఒకరం ఆవిష్కరించుకుంటాం
ఒకరి కలల్ని ఒకరి కళ్లలోకి
ప్రేమగా అనువాదం చేసుకుంటాం
నేను తన అడుగులు వెతికే తీరం తను నా జీవితమంతా వ్యాపించిన మమకారం.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత