తాజావార్త

  • 826 Views
  • 0Likes

    సి ఎస్‌ రాంబాబు

  • సికింద్రాబాదు
  • 9490401005

జ్ఞాపకాల దుప్పటిలో నలిగిన హృదయం
ఉదయపు వెచ్చదనాన్ని అన్వేషిస్తోంది
అరుణకాంతుల ఆకాశం
వేకువ తెరతీస్తుంటే
మాఘమాసపు గాలిపొర
తెరలుతెరలుగా చుట్టేస్తూ
మనసుకొలిమిని ముట్టిస్తోంది
అస్థిమితంగా శిశిరం
బొట్లుబొట్లుగా ఆకురాలే కాలాన్ని
బొట్టుగా ధరిస్తోంది
పారేయేరులా ఉదయం
పరుగుకు సిద్ధమవుతూ నగరం
రాత్రివదిలిన చీకటిబూజును వదిలిస్తూ
రోజును తాజాదనంతో వెలిగించాలని తహతహలాడుతున్నాయి
ఇదేకదా ఇప్పటి తాజావార్త అంటూ

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


అమ్మలున్నారు కానీ..

అమ్మలున్నారు కానీ..

శైలేష్‌ నిమ్మగడ్డ


వయసెరుగని మనసు!

వయసెరుగని మనసు!

డా॥ దిలావర్‌


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


ఓయ్‌... నిన్నే...

ఓయ్‌... నిన్నే...

కళ్యాణదుర్గం స్వర్ణలత