వేణువు

  • 632 Views
  • 0Likes

    జుజ్జూరి వేణుగోపాల్‌

  • పుట్లగట్లగూడెం, పశ్చిమగోదావరి
  • 9912395420
జుజ్జూరి వేణుగోపాల్‌

వెదురు నుంచి వినబడుతున్న వేణుగానం
మూసుకుపోయిన మనిషి హృదయంలాంటి
బిగుసుకున్న గది తలుపులు తెరిచాను
వేణువు లేదు, నిలువెల్లా గాయాలైనా నొప్పించని నిర్మల సంగీతం తప్ప

ఇంకా పెద్దగా వినబడుతున్న మురళీరవం...

విత్తన సుషుప్తి, చెట్టు చైతన్యం
నీటిపూల వ్యాకోచం, నక్షత్రాల సంకోచం
వెలివాడ పాకచూరు, చలువ గదులు
పూల పరిమళం, కుళ్లిన కళేబరం
మరుభూమి రావణ కాష్ఠం, రాముని గర్భగుడి
నాగలి చాలు లోతు, బాయిలర్‌ గొట్టం ఎత్తు
నెర్రెల ఉపవాసం, నది అడుగు నల్లరేగడి
నీరవం రవళించే సంధ్య వేళ, రెండు సంధ్యల నడుమ
అసంపూర్ణ జీవన కావ్యం, అఖండ దీపాలు
దుఃఖం నవ్వుతున్నది, మౌనం మాటాడుతున్నది
అన్నిటా, అంతటా అభౌతిక స్వరం చెవినబడుతుంది.
కళ్లు మూసుకుని చూపుడు వేళ్లతో చెవులు మూసుకుంటే
అంతఃస్సూత్రమైన అద్వైతంలా వేణువు కనబడింది.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


జ‌ల క‌ల‌

జ‌ల క‌ల‌

సాక హరీష్‌


తేట తెలుగు

తేట తెలుగు

విద్వాన్ గొల్లాపిన్ని నాగ‌రాజ‌శాస్త్రి


పునరపి గీతం!

పునరపి గీతం!

రాళ్లబండి శశిశ్రీ


కాలమవడమంటే

కాలమవడమంటే

జి.రామకృష్ణ


వసంతశోభ

వసంతశోభ

స్వర్ణలతానాయుడు


నీ నీడలో....

నీ నీడలో....

డా॥ దిలావర్‌,