వ్యథార్థము

  • 1340 Views
  • 2Likes

    - వల్లూరు దాలినాయుడు,

  • బొద్దూరు, శ్రీకాకుళం జిల్లా
  • 9440344601

నేను పేదరాలినని ఎవరన్నారూ???
నా బిడ్డడు అమెరికాలో
లచ్చలెన్నో
కూడబెట్టి లచ్చనంగ ఇల్లుగట్టి
లచ్చిమంటి కోడలితో చల్లగా
ఉండబట్టి
నాకిక్కడ గంజికేమో కరవన్నది 
లేకుండా
కాసులేమో పంపుతుండు
పనిమనిషికి లక్షలెందుకు
మీ అమ్మని తెమ్మని
కోడలేమొ పోరుబెడితే పాసుపోర్టు
చేసిండు
అమెరికా చూపిస్తననీ అక్కడకు
తీసుకెల్లి
అంటులన్ని తోమించి, గుడ్డలన్ని
ఉతికించి
వంటనాతో చేయించి, పనిమనిసిని
మానిపిస్తె
నెలకు రెండు లచ్చలు నా కొడుకుకు
మిగిలాయని
నాకొడుకే బాగుపడితే అంతకన్న
నాకేమని
ఇంకేటి కావాలని సంబరపడిపోయాను
అంతలోనె అంతులేని రోగమేదొ
వచ్చిందని
టెస్టులేవొ చేసినారు
లచ్చలవుతాయన్నారు
ఏ పనికీ పనికిరాక దీనిపని 
మాకేటని
దిక్కులేనిదానిమల్లె ఇక్కడ
వదిలేశారు
వృద్ధులను కదిలిస్తే అంతులేని
గాథలెన్నో....

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


హేమంత ఋతుకాంతి

హేమంత ఋతుకాంతి

- నరసింహశర్మ మంత్రాల,


అమ్మ అక్షరాలు 

అమ్మ అక్షరాలు 

- డా।। ఎ.రవీంద్రబాబు


జీవన రుతువు

జీవన రుతువు

డా।। ఎన్‌.గోపి