ఆవల

  • 1392 Views
  • 0Likes

    యామినీదేవి కోడే

  • గ‌న్న‌వ‌రం, కృష్ణాజిల్లా
  • 9492806520

నిజాన్ని ఒప్పుకోని అహమొకటి
అబద్ధపు రంగు పులిమేందుకు
ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది 
మాయ కమ్ముకున్న పొరలు కొన్ని
నిజాల్ని చూడటానికి సిద్ధం కావు 

కల్పనలూ, ఊహలూ, వాస్తవాలను దాచేసి
పేకమేడలై కూలిపోకుండా
బలమైన పునాదులు వేసుకుంటూంటే...
నిజం నిశ్చలంగా, నిశబ్దంగా, నిర్లిప్తంగా మారిపోయి
మనస్సాక్షి వైపుగా చూస్తుంది

చలనం లేని రాయిగా
గుండెని మార్చేసుకున్న నేనూ నువ్వూ కూడా...
నిజం వైపు దృష్టి సారించకుండా ఉంటాం 

నేను బొమ్మని చూస్తే నువ్వు బొరుసుని...
నేను బొరుసుని చూస్తే నువ్వు బొమ్మని...
నాణేనికి ఏదో ఒకవైపు మాత్రమే చూస్తూంటాం 
నాణేనికి ఇంకోవైపు చూడకుండానే
ఊహల్ని వాస్తవానికి అద్దుతూ
పూసింది అంటే కాసింది అనే సహజ
సమాజ ప్రవాహంలో పడి 
కొట్టుకుపోతూ ఉంటే ఎలా?
కారణమేదైనా, సంగతి ఏదున్నా
వేలెత్తి చూపే ముందు కాస్త ఆలోచించి
రెండోవైపు చూసొద్దాం రండి
ఇకనైనా... నిజానికి ఊహలు అద్దని 
ఆ మరోవైపుకి వెళ్లొద్దాం రండి....!!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత