ధన్యజీవి

  • 809 Views
  • 21Likes

    ఎస్‌.ముర్తుజా

  • మాంగోడ‌, పాల‌క్క‌డ్ జిల్లా, కేర‌ళ‌
  • 9985543523

ఔరా కేరళ!
ప్రకృతి అందాల పలుసోయగాల కళ
ఎటు చూసినా పచ్చదనాల ప్రోవే
కానరాదెక్కడా చెట్టులేని తావే
ఏపుగా వృక్షాలు
తోపులై పొదరిళ్లు
దూకుతూ తుళ్లుతూ సెలయేళ్లు
అబ్బో! చాలవు నిజంగ రెండు కళ్లు!
ఏ వైపు చూసిన దర్శనమిస్తోందిచ్చట
ఒకప్పటి మన నల్లమల ముచ్చట
చెట్లను నరుక్కుంటూ ఎదిగామని
జబ్బలు చరచుకుంటున్నాం మనం
పీల్చేగాలి కూడ విషమయం
చెట్లను పొదువుకుంటూ
ఫలాలు అందుకుంటున్నారిక్కడి జనం
స్వచ్ఛమైన గాలులతో పాటు
జాజి జాపత్రి లవంగాలిక్కడ ఘనం
కలికానిక్కూడ ఈ వాతావరణం
మనమక్కడ కనం
పిలిస్తే పలికే వర్షాలిక్కడ
మొహం చాటేసి చాలా కాలమైందక్కడ
చెట్లయి ఒదుగుతూ
చీమలై మెలుగుతూ
పొదరిళ్లలా వెలుగుతూ
కంటికి రెప్పల్లా
ప్రకృతిని కాపాడుకున్నారిక్కడ వీళ్లు
చెట్లను నరుకుతూ
చేమల చెణుకుతూ
పొదరిళ్లను కెలుకుతూ కుళ్లగిస్తూ
బంగారు గుడ్డు బాతుల్ని పొట్టన పెట్టుకున్నట్టు
పొడుచుకున్నాం అతి దారుణంగా మనం
మనవైన కళ్లు
ప్రకృతితో సహజీవనానికి
నిలువెత్తు నిదర్శనం వీరు
ప్రకృతి హననానికి ప్రత్యక్షసాక్ష్యం మన తీరు
అందుకే అన్నీ తారుమారు
తేనె జిగురు వెదురు వైద్యం
సర్వం అందిస్తున్నాయి
తమను రక్షించిన వారికి వారి తరానికి
పలు వరాలై భాసిస్తున్నాయి
ఇక్కడి వనాలు
కరకు కుఠారాల కడతేరి
క్రూర కర్కోట దారుణ హననాల పొరుమారి
రెక్కలు తెగిన పక్షుల్లా
వక్కలై ముక్కలై మిగిలి పడి ఉన్న సుందర శిల్పాల్లా
విలపిస్తున్నాయి
శాపాలై పాపాలై తాపాల్ని ఘోషిస్తున్నాయి
అక్కడ మన వనాలు
ఇప్పటికైనా కలిగేనా స్పృహ
అర్థమయ్యేనా ఒకనాటి మన పెద్దల తహతహ
పొల్లు కాదు సుమా
‘వృక్షో రక్షతి రక్షితః’
చెట్టులా ఎదగాలని
చెట్టల్లే ఒదగాలని
చెట్టై మిగలాలని
కోరుకునే వాడే
ధన్యజీవి జన్మతః

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


జ‌ల క‌ల‌

జ‌ల క‌ల‌

సాక హరీష్‌


తేట తెలుగు

తేట తెలుగు

విద్వాన్ గొల్లాపిన్ని నాగ‌రాజ‌శాస్త్రి


పునరపి గీతం!

పునరపి గీతం!

రాళ్లబండి శశిశ్రీ


కాలమవడమంటే

కాలమవడమంటే

జి.రామకృష్ణ


వసంతశోభ

వసంతశోభ

స్వర్ణలతానాయుడు


నీ నీడలో....

నీ నీడలో....

డా॥ దిలావర్‌,