కవితలు

తెలుగుదనానికి బాపు

తెలుగుదనానికి బాపు

ఆచార్య గంగిసెట్టి లక్ష్మీనారాయణ

న్యూమరిక్కులు

న్యూమరిక్కులు

రమణ యశస్వి

ఇప్పుడు

ఇప్పుడు

సి.హెచ్‌.మధు

నేను

నేను

దండమూడి శ్రీచరణ్‌

మల్లెమొగ్గ

మల్లెమొగ్గ

జి.రామకృష్ణ

సంప్రోక్షణ

సంప్రోక్షణ

ఒంటరితనాన్ని ఓడించడం ఏకాంతాన్ని జయించడం ఎంత కష్టమో నువ్వు ఊరెళ్లాకే తెలిసింది- ఉదయం కళ్లు తెరవగానే నాలో ఉషోదయాన్ని నింపే నీ మోము చూడటం అలవాటయ్యాక  నువ్వు కనిపించని ఈ వారం రోజులు ఉదయించే సూర్యుణ్ని సైతం సముద్రంలో నిలువునా ముంచేయాలనిపించింది- ఏడురోజుల ఈ పడిగాపులు ఎండాకాలపు వడగాడ్పులై అమాంతం నన్ను దహించివేస్తున్నాయి- ఈ కొన్నిరోజుల ఎడబాటులో ఎన్నిసార్లు నే తడబడ్డానో నీపేరునే పలవరిస్తూ... నీపై దిగులు నాకే కాదు ఈ మధ్యే మొగ్గతొడిగి విచ్చుకున్న రెక్కలతో విర్రవీగుతున్న ఎర్రటి గులాబీకీ ఉన్నట్టుంది అందుకే రోజూ నీలాగే నీళ్లు పోస్తున్నా దిగులుగా నేలచూపులు చూస్తూనే ఉంది- నీ కరస్పర్శ లేని ఆ చిట్టి రోజా ఎన్ని రోజులని ఎదురు చూస్తుంది నాలాగే- నీ మాటల మాధుర్యాన్ని చరవాణి తరంగాలు చెవులకు చేరవేస్తున్నా నిశ్చేష్టుణ్ణి చేసే నీ రూపాన్ని చరవాణి తెరమీద నా నయనాలు ఎంత తిలకిస్తున్నా ప్రణయ రాగాన్ని పలికించే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నా మేను సోకే క్షణం కోసమే ఈ నిరీక్షణ అదే నా మదికి జరిగే నిజమైన సంప్రోక్షణ...!
పూలగుత్తి

పూలగుత్తి

భయంభయంగా నేలలో నుంచి పైకి వచ్చింది... చుట్టూ చూసింది... నవనవలాడుతూ, మిసమిసలాడే ఆకులతో మెరిసిపోతున్న మిగతా మొక్కలు... తనవైపు చూసుకుంది... ఈనెల్లాంటి ఆకులతో ఈసురోమంటున్నట్టు తాను... మొక్కలన్నీ అందమైన రంగుల్లో విరబూసిన పువ్వులతో వెలిగిపోతున్నాయి... బేలగా తనని చూసుకుంది... రంగుల హరివిల్లు మధ్యలో వెలిసిపోయిన మబ్బుతునకలా బిక్కుబిక్కుమంటూ... చిట్టిపూలతో తాను... అందంగా ఉన్న పూలనన్నిటినీ అందరూ మెచ్చుకుంటున్నారు... మురిసిపోతున్నారు... ఓ మూలకి ఉసూరుమంటూ ఉన్న తను ఎవరికి కనిపిస్తుంది... ఎప్పటికీ ఇలా ఒకరిచాటుగా ఒదిగిపోయి ఉండవలసిందేనా... పూలన్నీ అలంకారంగానో, దండలోనో అందంగా అమరిపోతున్నాయే... తను కూడా అలా ఇమిడిపోయే ప్రత్యేకత తనలో ఏమీ లేదా... తనువంతా వడలిపోయినట్టుగా అయింది. లేదు... నిరాశ తగదు... పూలన్నీ అపురూపమైనవే... తను కూడా ఎప్పటికీ పూస్తూనే ఉంటుంది తనదైన సొగసుతో... ఎవరో సుతారంగా సుతిమెత్తగా తన పూలని ఒకటొకటిగా కోసి పేర్చుతున్నారు... తన పూలన్నీ అందమైన పూలగుత్తిగా మారిపోయాయి... తమకి దొరికిన గుర్తింపుకి పూలన్నీ ఆనందంతో రెపరెపలాడాయి.  
అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అచ్చం అచ్చుకొట్టినట్టే అక్షరం అక్షరం ఉన్నది ఉన్నట్టు నోట్లెకెల్లి ఊడి పడ్డట్టు అసలు నకలుగా మారే మాయ ఒకానొక్క ఒరిజినల్‌ పత్రం కావల్సినన్ని కాయిదం పూలు పుష్పిస్తది విద్యుత్‌ మంత్రంతో రాలిపడుతున్న పూవులన్నీ ఏరుకోవడమే! ఎట్ల కావాలనుకుంటే అట్లనే ఉన్నది ఉన్నట్టూ రావచ్చు ఆకారం పెద్దగా చిన్నగానూ చేయచ్చు మీట నొక్కంగనే టక టకా అచ్చు దిగి జారుతయి కండ్లుమూసి తెరిచినంతలనే అసలుకు సిసలు కనపడుతయి భారమూ కాదు, బ్యారమూ లేదు రూపాయి, రెండు రూపాయలే లెక్క అచ్చం అచ్చు యంత్రాన్ని ఏ మహానుభావుడు కనిపెట్టిండో ఆయన ముఖ జిరాక్స్‌కొక నమస్కారం కాలం పరుగులు తీసేందుకు తనకు తానే వేగం సృష్టించుకుంటది ఫొటోకాపియర్‌ ఒక మంత్రపుష్పం అక్షరాలకు అచ్చం ప్రతిబింబం
విశ్వ ప్రేయసి

విశ్వ ప్రేయసి

ఆమె విశ్వప్రేయసి అనంత విభ్రమ సౌందర్య రాశి ఆకుల గలగలల నవ్వులతో, ఆటవెలదుల ఏటిపాయ నడుముతో, తోట మలుపుల వాలుకనుల చూపులతో తరు వధువులు మధుర లాలసల తరియించిన తీరుగా - మురిసి, మరపించిన లలన. కొమ్మల ఊయలలూగి చిరు రెమ్మల చేతులు చాచి, చిరుగాలుల వింజామరలు వీచి - చిత్రరథస్వామి చిత్రంగ చెలరేగు వేళ చైత్ర పత్ర ఛత్రమై ఛాయనొసగు చారులత నాలుగు చెరగులా నేల నగ్నంగా సిగ్గిల్లినపుడు కలతచెంది - తానే తానులకొద్దీ హరితాంబరమై పరచుకున్న నెలత. చిగురుటధరముల మధురిమలతో పొగరు పయ్యెదల పరువపు కొమ్మలతో మాను ఒంపులు మేని సొంపులైన మానిని కంటికింపవు కలికి ప్రకృతిపై కంటగింపవు కరకు వికృతులు కలికాలనాగులై కాలకూటం కక్కినా, చెలగాటమాడి చెట్టు, చేమల తొక్కినా చెలువంపు చెలియ చెలిమినే పంచుతుంది ఆమె సర్వ మానవ హితైషి శ్రేయమే ధ్యేయమైన విశ్వప్రేయసి  
రావె తటిల్లతా

రావె తటిల్లతా

రావె తటిల్లతా చినుకు రాలని ఎండిన నేల తల్లికిన్‌ నీవె కదా తుషార రజనీకర రేఖవు ప్రాణి కోటికిన్‌ జీవము నివ్వవే వెలుగు జిల్గుల బంగరు సోయగాలతో నీవరుదెంచినన్‌ పుడమి నిత్యవసంతము కాకపోవునే భావము చల్లగా పసిడి పంటలతో సిరులొల్కి పోవగా నీవె దిశాంచలాల కడు నేర్పుగ నర్తనమాడు వేళలన్‌ నీవగలున్‌ యొయారములు నిస్వనముల్‌గని రైతు బిడ్డలా శావహులై పొలమ్ములకు సాగిరి చంద్రుని చుట్టియున్నరే ఖావలయమ్ము సూచి పులకాంకితులై ‘‘అదె చందమామ తా కోవెల గట్టె వర్షమిక కొల్లల’’టంచును బల్కె పామరుల్‌ ఆ వచనమ్ములన్‌ మృషగ అక్కట సేతువె జాగుసేయనే లా వరణీయ జృంభిత విలాస రుచుల్‌ గగనాంతరమ్ములన్‌ ప్రోవులు ప్రోవులై చిలికిపోవగనిమ్ము ముఖాబ్జదీధితుల్‌ శ్రావణలక్ష్మికిన్‌ చినుకు సంపదలై తరళించి పోవగన్‌ తీవెలు సాగి స్వర్ణమయ దీప్తులు ధారుణియందు నింపుచున్‌ దేవతలెల్ల నిన్ను వినుతింపగ సుందర స్వర్ణరేఖలై పావన మేఘమాలికల పంక్తుల మాటున నాట్యమాడుచున్‌ నీవరుదెంచినన్‌ సిరులు నిండి వసుంధర పుల్కరింపదే ఆ వసుధా వికాస దరహాస విలాసము మానవాళికిన్‌ దీవెనయౌచు రంజిలగ దివ్య విరాజిత రాగహేలవై శ్రీవిలసిల్లగన్‌ గగన సీమల దాగుడు మూతలాడుచున్‌ వే వెలుగుల్‌ జ్వలింపుచును వెల్లువయై కురిసేటి వర్షపున్‌ జీవనధారకున్‌ సొగసు చేకురునట్లుగ ప్రేమమూర్తివై రా వొలికింపు నీ హొయలు రంజిత రాజిత నాట్యభంగిమల్‌ ఆ వినువీధులన్‌ పరచి అమృతధారలు చిల్కరింపుచున్‌ మా వగపంత తీరగను మాయగ చింతలు మంజులాంగివై రాలె తటిల్లతా! భువన రమ్య విరాజిత! వారుణీసుతా! నీవరుదెంచినన్‌ పుడమి నిత్య వసంతము కాకపోవునే
కాగితపు కిటికీ

కాగితపు కిటికీ

ఉషోదయాన్నే ఊరేగడానికి రాత్రే ముస్తాబవుతాను! కాఫీ, టీల ఘుమఘుమలు, కళ్లాపి జల్లుల మట్టి వాసనలు, విరిసీ విరియని వెలుగు పూలు, తెరచీ తెరవని వేచి ఉన్న కళ్లు, సుప్రభాతాన నను స్వాగతిస్తుంటే సైకిల్‌ మీంచి వాకిట్లోకి, సాదరంగా వచ్చిపడతాను! రాజకీయాల రంగుల్ని, రమణీయ ప్రపంచపు పొంగుల్ని ఆరంభశూరత్వాల హంగుల్ని, ఆశల నావలు నడిపే సరంగుల్ని ఆకలి కేకల హోరుల్ని, ఆరాటపు ఆవిరి పొగల్ని విజయ శిఖరాల వీర గాథల్ని, వినమ్ర సమాజ సేవా గంధాల్ని నాతోనే తీసుకొస్తాను, మీకోసమే ప్రదర్శిస్తాను సన్మానాలు, శాపనార్థాలు, వేడుకలు, వేదనలు విజ్ఞాన వినోదాలు, విపత్తుల విపరీతాలు ఎన్నో నాలో పక్కపక్కనే! నాకు లేదు మక్కువ, దేనిపైనా, ఎక్కువ, తక్కువ!! లోకపు పోకడచూపే కాగితపు కిటికీని లోగుట్లను బయటపెట్టే కాంతులీనే దివిటీని! అక్రమాలపై ఎక్కుపెట్టిన అక్షరాస్త్రాన్ని! ఆలోచనల నాట్లు మొలిచే పద క్షేత్రాన్ని! వేకువనే వెలుగులు చిమ్మే విశేషాల తారకని విశ్వమంతా తిరిగివచ్చే విపంచి గీతికని! రోజూ మీచేతుల్లో అలరారే మీ దినపత్రికని నా రాతలతో, మీ రాతల బాగుకోరే మీ అభిమాన పుత్రికని!!