కవితలు

పాపం! పసివాళ్లు!!

పాపం! పసివాళ్లు!!

లగడపాటి భాస్కర్‌

తెలుగు తల్లి

తెలుగు తల్లి

- డా।। నాగభైరవ ఆదినారాయణ

సంక్రాంతి లక్ష్మి

సంక్రాంతి లక్ష్మి

అద్దంకి రామప్రియ

పొందడం కోసమే..!

పొందడం కోసమే..!

కల్వలపల్లి బాలసుబ్రహ్మణ్యం

పావురాళ్లకు కెవ్వు కేకలు

పావురాళ్లకు కెవ్వు కేకలు

కోటం చంద్రశేఖర్‌

నిరసన గేయం

నిరసన గేయం

ఉలుకూ లేదు పలుకూ లేదు ఒక మౌనాన్ని ముందేసుకుని ఆకాశం మునుపటిలా ఉంది జాడలేని మేఘాల వైపు చూస్తూ జాలిగా భూమి వైపు చూస్తోంది ఎదురు చూసిన కళ్లు ఎరుపెక్కాయి యేరువాకకు వెళ్లిన కాళ్లు చతికిలపడ్డాయి పడిలేస్తూ పచార్లు చేస్తూ అప్పుల కేకలు చెవుల్లో మారుమోగుతూ నమ్మినమట్టి మరణశాసనం లిఖిస్తూ కుదేలై కూర్చున్నచోటే ఒరిగిపోతూ నిస్సహాయుడై కదిలిపోతూ ఒంటరి యుద్ధంలో ఓడిపోతూ కాలగర్భంలో కర్షకుడు కలిసిపోతుంటాడు చినుకులు  చిరుఆశల్ని మోసుకొస్తూ రావాలి పచ్చని పైరులతో పల్లెలు పగలబడి నవ్వాలి ఊరూ.. యేరూ.. ఉషస్సై మెరవాలి నదులూ, నాగళ్లూ మా ఇలవేల్పై ఉండిపోవాలి ఉరితాళ్లు కాస్త మా గోవులకు మూకుతాళ్లుగా మారాలి చరిత్రలేని శ్రమజీవికి నవచరిత్రని లిఖించాలి
ఏటిగట్టున

ఏటిగట్టున

ఏటిగట్టున కూర్చున్నాను కోటి ఊసులు వింటూ ఈ ఏరు నా కన్నతల్లి మమతానురాగాల పాలవెల్లి ఊయలూగే శైశవంలో ఉలిక్కిపడి గుక్కపడితే చేలో ఉన్న తల్లి చెంగున చెంతకు  చేరేలోగా గలగలల లల్లాయి పాడి సుఖనిద్రపుచ్చింది జోల కాదది విమల గాంధర్వడోల మాతృహృదయానంద పారవశ్య హేల ఉరకలేసే బాల్యంలో కుప్పించి దూకి కాళ్లుతాటిస్తే ఉప్పొంగిన ప్రేమై ఉవ్వెత్తున పైకి లేచి అలల చేతులతో ఆశీర్వదించింది. ఈ యేటి నీళ్లలో చేపలై మునకలేసి సంబరపడిపోయారు సూరీడూ, చంద్రుడూ అరకదున్నే ప్రాయంలో మెరికనై వొళ్లువంచి తూములు కట్టి తనువును తోడేస్తే స్తన్యమిచ్చిన తల్లై సస్యాన్ని సజీవం  చేసింది పిండారబోసిన వెన్నెల్లో నిండార మెరిసిన ఏటి తరగలు మట్టిమనుషుల వెట్టిబతుకుల్లో వెలిగించిన మతాబా దివ్వెలు రెక్కలొచ్చి నే రేవుదాటుతూంటే అక్కరగా ఆవలిగట్టు చేర్చి బుంగమూతి పెట్టింది సుళ్లు తిరిగే దుఃఖాన్ని స్తబ్ధతలో దాచిపెట్టి సాగనంపింది నాగరికత నేర్పిన ఏరు నేడు నిరాదరణకు గురైన తల్లిలా నిర్వేదంగా ఉంది ధన మదాంధులైన మానవాధములు  కొందరు దురాక్రమణ చేసి దోచుకుంటూంటే బొమికల ఇసుక రేణువులు మిగుల్చుకొని బిక్కుబిక్కుమంటోంది జీవవైవిధ్యం జాతర చేసిన చోట  శూన్య నైరాశ్యం తాండవిస్తూంటే అశ్రుపూరిత నయనాలతో ఎండిపోయిన ఏటి గుండెను తడిమాను మూగబోయిన ఇసుకరేణువుల్లో మెల్లగా ఏదో ప్రతిస్పందన! ఏదో సంచలనం!
అక్షర సమృద్ధి

అక్షర సమృద్ధి

జనని జన్మభూమి

జనని జన్మభూమి

ఒక నిర్భావనాయుత సందర్భం వేదనాభరిత క్షణంలో నేనేమన్నానంటే ‘రాను ఇక్కడే ఉంటాను’ వాళ్లు వెళ్లిపోయారు డాలర్‌ ప్రపంచంలోకి మెరుపు కలలతో ల్యాప్‌టాప్‌ని వెంటబెట్టుకొని నా కడుపుతీపి ప్రవాసం వెళ్లమని చెప్తుంది నన్ను కన్న మాతృభూమి తనను విడిచి వెళ్లొద్దని చెప్తుంది అక్కడికెళ్తే ఊరు గుర్తొస్తుంది ఇక్కడుంటే పిల్లలు గుర్తొస్తారు బంధాల మధ్య సతమతమౌతూ నేను పిల్లలంటారు, ఇండియా మీద దిగులు పెట్టుకోకు అమ్మా! కారు మీద, ఇంటి మీద జండా పెట్టుకుందాం ఇండియా ఎంబసీ కెళ్లి ఇండిపెండెన్స్‌ డే జరుపుకుందాం, జాతీయగీతం పాడుకుందాం, అని పిల్లలంటారు! ఇండియా అంటే జండా మాత్రమేనా? ఇండియా అంటే జాతీయగీతం మాత్రమేనా? ఇండియా అంటే ఇంకా చాలా ఉంది ఇండియా అంటే అన్ని మతాల, భాషల సంస్కృతుల సమ్మేళనం.  ఇండియా అంటేనే కలిసి బతకడం. ఇది అచ్చంగా నా ఇండియా. నా సొంతం. ఈ పలకరింపు, ఈ ఆప్యాయత మరో దేశం నేలమీద దొరుకుతుందా? పేదరికం కానరాని సంపన్న దేశం అది కార్లు తప్ప మనిషి జాడ లేని రోడ్లవి  పండగ సందడి తెలియని అపరచిత లోకం అది ఫీలింగ్‌ ఇవ్వని విలాస జీవనం అది ఓ వేకువ పొద్దు, పిల్లలకు ఫిల్టర్‌ కాఫీ ఇస్తూ, నేనన్నాను ‘వద్దులే, నాకిక్కడే బాగుంది’.
అమ్మ అక్షరాలు 

అమ్మ అక్షరాలు 

పల్లవి:     అక్షరాల సిరులు ఎన్నో అమ్మభాషలో     అత్మీయత అనురాగం అందించే మాతృప్రేమలో     అచ్చులోని అమృతం     హల్లులోని మానవత     కలబోసిన కావ్యమురా అమ్మరూపం     తెలుగుభాషకే అపురూపం...     ఆ సుందర రూపం            ।।అక్షరాల।। 1 చరణం:    అఆ...లను చనుబాలుగా     ఇఈ...లను తన స్పర్శగా     ఉఊ...లను ఉయ్యాల ఊపులుగా     నేర్పినట్టి ఆదిగురువు అమ్మేగా... (అఆ..)     అమ్మేగా సృష్టికి భాషసూత్రమూ     అమ్మేగా ఈ లోకపు ద్వారబంధమూ     అమ్మేగా.. అమ్మేగా.. అమ్మేగా...     నడుస్తున్న భాషలో నిత్యసత్యము     ఆ సరస్వతికే మరో రూపము        ।।అక్షరాల।। 2 చరణం:    బుడిబుడి నడకలనే పదాలుగా     ముద్దుముద్దు పలుకులనే పలుకుబడులుగా     తీపితీపి ముద్దలనే తనలోని వాక్యాలుగా     నేర్పినట్టి ఆదిగురువు అమ్మేగా... (బుడిబుడి..)     అమ్మేగా అక్షరాల బీజసూత్రమూ     అమ్మేగా అవనిలోని ప్రేమ తత్వమూ     అమ్మేగా... అమ్మేగా... అమ్మేగా...     మారుతున్న చరితకు తెలుగు హారము     ఆ సరస్వతికే మనో రూపము        ।।అక్షరాల।।
మాటతో మనిషి ప్రయాణం

మాటతో మనిషి ప్రయాణం

నోరున్న మనిషి శబ్దాలకు క్రమశిక్షణ నేర్పాడు - మాట పుట్టింది మాటకి రంగులద్దాడు భాషలు ఉద్భవించాయి మాటకి రూపమిచ్చాడు లిపి లిఖించబడింది మాటని పదును చేశాడు - మంత్రం జనించింది మాటకు సొబగులద్దాడు - పాట పురుడుపోసుకుంది మాటని వంకరగా పేర్చాడు - పుకారు పుట్టింది మాటని విషంలో ముంచాడు - వైషమ్యం పెరిగింది మాటని ఎరగా వేశాడు - విపణి వికసించింది మాటకి తేనె పూశాడు - వంచన తెలిసింది మాటని తక్కెడలో తూచాడు - అంతరాలేర్పడ్డాయి మాటని తూటాగా పేల్చాడు - యుద్ధం మొదలైంది మాట చివర ప్రశ్నల్ని నాటాడు - అన్వేషణ ఆరంభమైంది మాటని ఉరితీశాడు - పిడికిళ్లు మొలిచాయి మాటల్ని మచ్చిక చేసుకున్నాడు - సారస్వతం సహితమైంది మాటని నిశ్శబ్దంగా దాచుకుని మౌనంతో కప్పేశాడు - అనంతమైన ఆలోచనలతో అంతర్నేత్రం తెరుచుకుంది
ఎడ్లబండి

ఎడ్లబండి

ఎప్పుడైనా ఎక్కడైనా ఓ ఎడ్లబండి ఎదురైతే నా బాల్యం గుత్తులు గుత్తులుగా పూతకొస్తది నాన్న ముందు తొట్లో గడ్డిమెత్తపై కూర్చొని రాజకుమారుడిలా దర్జాలుపోయిన చిత్రపటం కళ్లెదుట నిలబడ్తది పగటీలి ఒకటిన్నరప్పుడు కడపర్తి దాటి నెల్లిబండ గుట్ట సాలుగ రాంగానే నేను అమ్మగర్భంలోంచి భూమ్మీదపడ్డ పెత్తరమాస కథ అమ్మమ్మోళ్ల ఎడ్లబండి పురాణం మనసుల మెదుల్తది ఇప్పుడు కార్లు కమాండర్‌ జీపులను చూసి కుటుంబాల ఆదాయాన్ని ఊహించినట్టే అప్పట్లో ఎడ్లు బండిని చూసి ఇండ్ల ఆందాన్‌ని అంతస్తుని గణించేటోళ్లు పెనిమిటికి ఎటువంటి అర్ధాంగి అవసరమో బండికితగ్గ ఎడ్లూ అంతే అవసరమనేది ఆ రోజుల్లో ఊర్ల ఫిలాసఫి పండుగల్లో పెళ్లిళ్లలో జాతర్లలో ఎడ్లబండ్లకు సెలబ్రిటీలకున్నంత డిమాండు ఉండేది మా ఎడ్లే లేపాక్షి బసవన్నకు తమ్ముండ్లని మా బండిది బాహుబలి గోత్రమని నిరూపించుకునే కాపిటల్‌ కాంటెస్ట్‌లో ఎడ్లను జవనాశ్వాల్లా అలంకరించేటోళ్లం బండ్లను చైత్ర రథాల్లా పుదించేవాళ్లం ఎడ్లూ బండ్లూ కేవలం విడివిడిగా ఇండ్లకే కాదు ఉమ్మడిగా ఊరుకే వీటో హోదా ఫలానా ఊరు నుంచి ఫలానా వాళ్ల పెండ్లికి ఎంతమంది చుట్టాలు వచ్చిండ్రనే చర్చ కంటే ఎన్ని బండ్లొచ్చినయన్నదే రచ్చబండ శిఖరాగ్ర సమావేశం కట్టెలకు బండి కమ్మలకు బండి రాయికి బండి రాశికి బండి చౌడుకు బండి దౌడుకు బండి మట్టికి బండి మంచినీళ్లకు బండి సరుకులకు బండి సాయానికి బండి కాన్పుకు బండి కాయకు బండి బాడుగకు బండి బాసండ్లకు బండి ఆడంబరానికి బండి ఆసుపత్రికి బండి ఎడ్లబండి లేకుంటే ఎల్లేదికాదు ఎనకట అది కిషన్రావు దొర బండైనా రామయ్యసేటు బండైనా మా బండైనా మరెవరి బండైనా మానుకోట టేకుచెట్లూ మా ఊరి తుమ్మచెట్లూ ఆలుమగలుగా మనుగూడిన బాంధవ్యం గాడెంలో పడి చకచకా ఉరికేది వడ్లశంకరయ్య కమ్మరి బోజయ్యల హస్తకళ బాటెమ్మటి కోనార్క్‌ టెంపుల్‌లా ఉట్టిపడేది కుండ కొలిచి ఎడ్లబండి కల్లంలో అంటగడితే ఆ బలమే వేరు రైతుకు ఎడ్లబండి నిండుభర్తితో ఇంటిముందాగితే ఆ బర్కతే వేరు పంటలకు నోముల కోటయ్య చెల్లెలి పెండ్లికి ముప్పై ఆరు బండ్లల్ల కురుమర్తికి పోయినప్పుడు ఊరు యుద్ధానికి వెళ్తున్నంత ఉత్సాహం పెండ్లికొడుకు గడ్డివామును ఎడ్లు పక్క కింద నెమరేసి తిరిగి వస్తుంటే గండికోట గెలిచినంత సంబురం ఆట పాటల మేళవింపు ఎడ్లబండి చేను చెమటల కౌగిలింత ఎడ్లబండి చరిత్ర చెప్పుకునే నిర్మాణాలకు శత్రువుల పన్నాగాలు పటాపంచలైన ఉదంతాలకు ప్రబల సాక్ష్యం ఎడ్లబండి కరవులపై దండయాత్రలో ఊరును విజేతగా మలచిన చిత్రాంగద ఎడ్లబండి నడక నాలుగు చక్రాలుగా సాగుతూ నాలుగు యుగాలను మంత్రసమ్మితంగా నడీపున మోసుకొచ్చి నాగరికతకు రహదారులు వేసిన మునివాహనం ఎడ్లబండి ఎడ్లబండి పార్టీలకూ ప్రభలకూ రంగుల సంతకం ఎడ్లబండి పెద్దగట్టు లింగమంతులుకూ ఊరి చింతల్ల పెద్దమ్మగుడికీ భక్తులు సమర్పించిన నిండు బోనం ఎడ్లబండి సబ్బండ వర్ణాలను ఒక తాటిమీదకు తెచ్చి మా ఊరును అస్సెంబ్లీకి పంపిన పెద్దసోషలిస్టు నన్నూ నా దేశాన్ని ఎవడైనా ఎక్కడైనా బుల్లక్‌ కార్ట్‌ నేషన్‌ అని వెక్కిరిస్తే వాడి బుల్‌ మార్కెట్‌ ముద్ద మొహంపైకి ఎవరెస్టు ఎత్తులేస్తది నా ఎడమ కాలు
మా నాయనమ్మ

మా నాయనమ్మ

బద్దలయ్యే తలపోటుకి మిరియాలపొడి పట్టేసేది ఎడతెగని రొంపకి శొంఠికాఫీ తాగించేది కుళ్లిపోయిన కడుపుమందానికి  నేలవేము కషాయం గొంతులో పోసేది కామెర్లకి కసిందపసరు కలికమేసేది కవుకు దెబ్బల పక్కటెముకలకి అంకుడుపాలద్ది కట్టుకట్టేది ఒక్కముక్కలో చెప్పాలంటే డాక్టర్‌ ముఖమెరగని మాఊరి జొరానికి మందుబిళ్ల మా నాయనమ్మ సన్నికల్లు రాయిలాంటి శరీరం మణికట్టు మొదలు మోచేతిదాకా గాజులు చెంపల నిండా గిరజాలూ నుదిటి మీద ఇచ్చరూపాయంత బొట్టుతో అచ్చం గుడిలోని అమ్మోరమ్మలా ఉండేది ఇంకా చెప్పాలంటే రైకేసుకోడం తెలియని పసిపిల్ల మా నాయనమ్మ చేతుల్తో ఊరి పురిటిమాయలు తీసి దబ్బపండులాంటి బిడ్డని చేతుల్లో పెట్టేక అప్పటిదాక గూడుకట్టుకున్న  దిగులు మేఘం ఆవిరయ్యాక ఆనందం కళ్లల్లో సుళ్లై తిరిగినప్పుడు దేవతలా కనిపించి తెల్లారేపాటికి మళ్లీ ఊరి చివరికి నెట్టబడ్డ ఉలిపికట్టె మా నాయనమ్మ మరోమాట చెప్పాలంటే మాయ  మర్మాలెరగని మంత్రసాని మా నాయనమ్మ ఊరిజనంలో సగమ్మంది మా నాయనమ్మ చేతుల్లో పుట్టినోళ్లే ఊరి జబ్బులు మొత్తం మా నాయనమ్మ చేతిసలవ్వల్ల తగ్గినవే ఊరికష్టాల్లో అన్నీ మా నాయనమ్మ నీళ్లుజల్లిన  చీపురుకట్టతో తరమబడ్డవే చిన్నప్పుడు నాతో ఆడుకున్నప్పుడు మామూలుగా అనిపించిన నాయనమ్మ ఇన్నాళ్లకు గుర్తుకొచ్చి అనిపిస్తుంది నిజంగా మా ఊరి మదర్‌ థెరీసా  మా నాయనమ్మ