కవితలు

మా బడి

మా బడి

గరిమెళ్ళ నాగేశ్వరరావు

భూమాతకో ప్రేమ ముద్దు

భూమాతకో ప్రేమ ముద్దు

డా।। చిట్యాల రవీందర్‌

వర్షానికి ప్రేమలేఖ

వర్షానికి ప్రేమలేఖ

వెంకటేష్‌ పువ్వాడ

నిరుద్యోగి

నిరుద్యోగి

యస్‌.సూర్యనారాయణ

తెలుగుదనానికి బాపు

తెలుగుదనానికి బాపు

ఆచార్య గంగిసెట్టి లక్ష్మీనారాయణ

న్యూమరిక్కులు

న్యూమరిక్కులు

రమణ యశస్వి

ఒక నువ్వూ ఒక నేనూ

ఒక నువ్వూ ఒక నేనూ

ప్రశంస

ప్రశంస

పెదవుల నుంచి వెలువడే  చిన్న ప్రశంస.. నువ్వనుకున్నంత చిన్నదేం కాదు ఎదుటి వారి మనసుల్లో మతాబులు  వెలిగిస్తుంది గుండెల్లో గులాబీలు  పూయిస్తుంది భారం తీరిన నల్లమబ్బు  తేటబడినట్టు  న్యూనత బరువు తగ్గి వదనం  వికసిస్తుంది చేతకాదనీ చేవలేదనీ చేయలేమనీ చిన్నబోయే చేతుల్లో చేతలు చేసి చూపే సత్తువనిస్తుంది.. ఒక్కసారి మెచ్చుకుని చూడు వారి కళ్లల్లో కాంతి నీ గుండెల్లో నిండకపోతే ఇరు మనసుల్లో శాంతి నింపకపోతే.. అప్పుడడుగు.. తీరాన్ని తాకాలని ఆశగా ఉరికే అల  వెనక్కి విరుచుకుపడినా ఆశను  చంపుకోనట్లు గెలుపు తలుపు తడదామని మళ్లీ మళ్లీ చేసే వారి బలహీన ప్రయత్నాలను... ఒక్కసారి మెచ్చుకుని చూడు నిట్టూర్పుల నిశ్వాసాన్ని  వెనక్కి నెట్టి ఉత్సాహమే ఉచ్ఛ్వాసంగా  ప్రయత్నపు అల సునామీయై దాటిన బాటల్లో  ఓటమి బావుటాల్ని ఎలా తుడిచిపెడుతుందో  రెండు కళ్లూ విప్పార్చి చూడు ఆ సంబరంలో వారి కృతజ్ఞత నులివెచ్చగా నీ హృది గదిని తడమకపోతే.. తడపకపోతే.. అప్పుడడుగు. అవమానంతో వంగిన వెన్ను నిటారుగా చేయగల ప్రశంస అనుమానంతో వణికే వేళ్లకు ఊతమివ్వగల ప్రశంస అభిమానంతో చితికే చూపునకు చింతను తీర్చే ప్రశంస ఒకే ఒక్క ప్రశంస... మనసారా ఇచ్చి చూడు నీకది చిన్నదే కావచ్చు కానీ చిన్నబోయే మనసుల్లో అది చిరుదీపమై వెలుగుతుంది. ఆ కాంతి వారిని గెలుపుబాటలో  నడిపిస్తుంది. అందుకే చిన్నపనినైనా సరే మంచి పని అయితే ఒక్కసారి మెచ్చుకుని చూడు అదెంత బాగుంటుందో వారితో పాటూ నువ్వూ తెలుసు కునే అవకాశం పొంది చూడు.  
కన్యాదానం

కన్యాదానం

పద్దెనిమిదేళ్లు ఆపై ముద్దుల గారాలపట్టి ముగ్ధ తనయ, వా క్శుద్ధిన విద్యలు నేర్వగ బుద్ధిగ కల్యాణ ఘడియ, పొలుపుగ వచ్చెన్‌ బుద్ధిమంతుడు వరుడని బోధపడగ కన్యకామణి మనసంత కమ్మనాయె వలపు తలుపులు తెరిచియు పిలిచినంత పెళ్లి పందిరి వేదికై కళ్లు కలిసె సుమంగళం, సుఖాసనం, సుశోభితం, విరాజితం. సమాంతరం, సుహాసితం సుజాత సిగ్గు బుగ్గలే ప్రమాణమందు అగ్ని జ్వాల ప్రజ్వరిల్లె సాక్షిగా అమాంతమొక్కటైన రెండు ఆశయాల సంగమం నాదస్వరములు మ్రోగెను వేదమ్ముల మంత్ర మహిమ వెతలను బాపెన్‌ మోదమ్ముగ సూత్రధారణ వేద ప్రమాణముగ జరిగె వేడుక తోడన్‌ వధువు కన్నవారల ఎద బాధ తీపి అన్నదమ్ముల గుండెల అలజడాయె బంధు మిత్రుల హృది సింధు మంథనమ్ము అప్పగింతల సమయాన ఆత్మఘోష బోసి నవ్వులు విరబూసిన వేళలో       నేలన పారాడ నేర్పినాము అమ్మ-నాన్న మరియు అత్త-మామలటంచు       చిన్నారి మాటలాడించినాము బుడిబుడి నడకలు వడిగ ఉండొద్దని వేలుబట్టి అడుగు లేయసాగె పట్టంచు జాకెట్టు, పావడాలను వేసి       ముక్కుకు పెట్టాము ముక్కుపుల్ల. పాఠశాల విద్యలు నేర్చి పల్లవించె పెద్ద కాలేజికంపాము పిల్లనపుడు వంటపనులన్ని నేర్పించ ఇంటిలోన పసిడి బొమ్మగా పెరిగింది మిసిమిసొగసు ముసిముసి నవ్వులన్ని విరమోముకు ముత్యపు కాంతులద్దగా రుసరుసలాడు వాలుజడ రోషముతో పరువాలు చిందగా మిసమిసలాడు సొంపులవి మీనములాయెను కంటి చూపులే గుసగుసలాడు గుండెలను గుమ్ముగ దాచెను వోణిసోయగాల్‌ అనుచు వధువు కరములనువుగా చేపట్టి వరుని చేతికిచ్చె పరువు, గుండె గంగ-యమున నదుల సంగమమైపోయె కడుపులోని పొంగు కనులకొచ్చె నరముల స్వరఝరి నందున వరుసగ కరుణారసమ్ము వంకలు దిరిగెన్‌ తరుణి తల నిమిరి ఆత్మలు దరువుగ దీవించి వరుని బతిమాలిరిగా పోయిరావమ్మ పోయిరా! హాయిగాను పుట్టినింటి పరువు నిల్పు మెట్టినింట భార్య భర్తల బంధము భారతాన సూర్యచంద్రులు మెచ్చిరి సురలతోడ
నది నా కవిత

నది నా కవిత

ఏయే మేఘాల వాహనాల్లోంచి ఎన్నెన్ని చినుకుల మూటల్ని దించి తన భుజాన వేసుకుని ఈ నది సాగిందో... ఎన్ని తడారిన దాహపు దారులెంట ఎన్నెన్ని దప్పిక తీర్చే తీయని సెలయేటి పాటల్ని ఈ నది ప్రవహింపచేసిందో... ఎన్ని ఎడారి ఇసుక గొంతుల్లోంచి ఎన్నెన్ని తేట నీటి ఊటల్ని ఒయాసిస్సులై నీలినీలిగా ఉబికించిందో.... ఒట్టి చేతులతో ఎండిన నదిని తోడితే చాలు మట్టి ఇసుక చెలమల్లోంచి చల్లని నీరు ఊరి ఎన్ని ఎండిన దోసిళ్లని నింపిందో.... వంతెన వడ్డాణాల నడుమ ఈ నది ఎన్నెన్ని ఒంపులు తిరుగుతూ ఒయ్యారాల నడుమై నడకసాగించిందో... ఎన్ని పంటల కురుల్ని అలవోకగా వెన్నెల్లో కొబ్బరి ఆకులపై ఆరబోసిందో... ఎన్ని పూలతోటల్ని సీతాకోక చిలుకలతో విరబూయింపచేసిందో.... కదిలే నీటి బుడగలపై ఎన్నెన్ని ఇంద్రధనుస్సుల రంగుల్ని పొదువుకుని మెరిసిందో.... కాలువ గట్లను ఒరుసుకుంటూ ఎన్నెన్ని మొక్కల్ని నాట్లు వేయించిందో... చేలలోని చెట్లని కలుసుకుంటూ పుట్టెడు బుట్టల ఫలాలతో ఎన్నెన్ని తోబుట్టువుల ఒడులని నింపిందో.... ఎన్నెన్ని రాగాల గొంతుల్ని తడిపి మరెన్నెన్ని గుండెల్ని సరాగాలతో పరవశింపచేసిందో.... దోసిలి చాస్తే చాలు! జలంతో సలక్షణమైన అక్షయపాత్రయింది నేలని కౌగిలిస్తే చాలు! ఆకుపచ్చని ధరిత్రయింది నదీ కవీ ఒక్కరే! కదలడమూ కదిలించడమన్నది వారి జీవిత రహదారే! అందుకే! నది నా కవితగా పరుగులుతీస్తోంది నా కవిత జీవనదిగా నాడూ నేడూ ఏనాడూ ప్రవహిస్తూనే ఉంటుంది
జేజేలు

జేజేలు

కంటి కలువల్లో కారుణ్యపు తేమని పలుకు పారిజాతాల్లో పెల్లుబికే ప్రేమని స్నేహపు చేమంతుల పలకరింపుని బంధుప్రీతి బంతిపూల అలరింపుని మోమున మెరిసే సన్నజాజుల సొంపుని మమతన విరిసే మల్లెల గుబాళింపుని మందహాసాన మందారాల చల్లదనాన్ని మనసున నంది వర్ధనాల తెల్లదనాన్ని చేతల్లో వెల్లివిరిసే పున్నాగల ఆత్మీయతని చిరు చెలిమికే చలించే కనకాంబరాల కోమలతని గుండెల్లో అనురాగపు గులాబీల సొగసుని సేవల్లో ఆప్యాయతా సంపెంగల సువాసనని తనువంతా తామరల మృదుత్వాన్ని తలపుల నిండా తంగేడుల సాధుత్వాన్ని గొంతున గన్నేరుల విషాదాన్ని కడుపున వేపపూల వెతల కషాయాన్ని ధరించే మాన్య మానవికి... భరించే మహిళా మూర్తికి... చెయ్యండి ప్రణామాలు! పలకండి జేజేలు!
సంప్రోక్షణ

సంప్రోక్షణ

ఒంటరితనాన్ని ఓడించడం ఏకాంతాన్ని జయించడం ఎంత కష్టమో నువ్వు ఊరెళ్లాకే తెలిసింది- ఉదయం కళ్లు తెరవగానే నాలో ఉషోదయాన్ని నింపే నీ మోము చూడటం అలవాటయ్యాక  నువ్వు కనిపించని ఈ వారం రోజులు ఉదయించే సూర్యుణ్ని సైతం సముద్రంలో నిలువునా ముంచేయాలనిపించింది- ఏడురోజుల ఈ పడిగాపులు ఎండాకాలపు వడగాడ్పులై అమాంతం నన్ను దహించివేస్తున్నాయి- ఈ కొన్నిరోజుల ఎడబాటులో ఎన్నిసార్లు నే తడబడ్డానో నీపేరునే పలవరిస్తూ... నీపై దిగులు నాకే కాదు ఈ మధ్యే మొగ్గతొడిగి విచ్చుకున్న రెక్కలతో విర్రవీగుతున్న ఎర్రటి గులాబీకీ ఉన్నట్టుంది అందుకే రోజూ నీలాగే నీళ్లు పోస్తున్నా దిగులుగా నేలచూపులు చూస్తూనే ఉంది- నీ కరస్పర్శ లేని ఆ చిట్టి రోజా ఎన్ని రోజులని ఎదురు చూస్తుంది నాలాగే- నీ మాటల మాధుర్యాన్ని చరవాణి తరంగాలు చెవులకు చేరవేస్తున్నా నిశ్చేష్టుణ్ణి చేసే నీ రూపాన్ని చరవాణి తెరమీద నా నయనాలు ఎంత తిలకిస్తున్నా ప్రణయ రాగాన్ని పలికించే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నా మేను సోకే క్షణం కోసమే ఈ నిరీక్షణ అదే నా మదికి జరిగే నిజమైన సంప్రోక్షణ...!
పూలగుత్తి

పూలగుత్తి

భయంభయంగా నేలలో నుంచి పైకి వచ్చింది... చుట్టూ చూసింది... నవనవలాడుతూ, మిసమిసలాడే ఆకులతో మెరిసిపోతున్న మిగతా మొక్కలు... తనవైపు చూసుకుంది... ఈనెల్లాంటి ఆకులతో ఈసురోమంటున్నట్టు తాను... మొక్కలన్నీ అందమైన రంగుల్లో విరబూసిన పువ్వులతో వెలిగిపోతున్నాయి... బేలగా తనని చూసుకుంది... రంగుల హరివిల్లు మధ్యలో వెలిసిపోయిన మబ్బుతునకలా బిక్కుబిక్కుమంటూ... చిట్టిపూలతో తాను... అందంగా ఉన్న పూలనన్నిటినీ అందరూ మెచ్చుకుంటున్నారు... మురిసిపోతున్నారు... ఓ మూలకి ఉసూరుమంటూ ఉన్న తను ఎవరికి కనిపిస్తుంది... ఎప్పటికీ ఇలా ఒకరిచాటుగా ఒదిగిపోయి ఉండవలసిందేనా... పూలన్నీ అలంకారంగానో, దండలోనో అందంగా అమరిపోతున్నాయే... తను కూడా అలా ఇమిడిపోయే ప్రత్యేకత తనలో ఏమీ లేదా... తనువంతా వడలిపోయినట్టుగా అయింది. లేదు... నిరాశ తగదు... పూలన్నీ అపురూపమైనవే... తను కూడా ఎప్పటికీ పూస్తూనే ఉంటుంది తనదైన సొగసుతో... ఎవరో సుతారంగా సుతిమెత్తగా తన పూలని ఒకటొకటిగా కోసి పేర్చుతున్నారు... తన పూలన్నీ అందమైన పూలగుత్తిగా మారిపోయాయి... తమకి దొరికిన గుర్తింపుకి పూలన్నీ ఆనందంతో రెపరెపలాడాయి.