కవితలు

పాపం! పసివాళ్లు!!

పాపం! పసివాళ్లు!!

లగడపాటి భాస్కర్‌

తెలుగు తల్లి

తెలుగు తల్లి

- డా।। నాగభైరవ ఆదినారాయణ

సంక్రాంతి లక్ష్మి

సంక్రాంతి లక్ష్మి

అద్దంకి రామప్రియ

పొందడం కోసమే..!

పొందడం కోసమే..!

కల్వలపల్లి బాలసుబ్రహ్మణ్యం

పావురాళ్లకు కెవ్వు కేకలు

పావురాళ్లకు కెవ్వు కేకలు

కోటం చంద్రశేఖర్‌

అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అచ్చం అచ్చుకొట్టినట్టే అక్షరం అక్షరం ఉన్నది ఉన్నట్టు నోట్లెకెల్లి ఊడి పడ్డట్టు అసలు నకలుగా మారే మాయ ఒకానొక్క ఒరిజినల్‌ పత్రం కావల్సినన్ని కాయిదం పూలు పుష్పిస్తది విద్యుత్‌ మంత్రంతో రాలిపడుతున్న పూవులన్నీ ఏరుకోవడమే! ఎట్ల కావాలనుకుంటే అట్లనే ఉన్నది ఉన్నట్టూ రావచ్చు ఆకారం పెద్దగా చిన్నగానూ చేయచ్చు మీట నొక్కంగనే టక టకా అచ్చు దిగి జారుతయి కండ్లుమూసి తెరిచినంతలనే అసలుకు సిసలు కనపడుతయి భారమూ కాదు, బ్యారమూ లేదు రూపాయి, రెండు రూపాయలే లెక్క అచ్చం అచ్చు యంత్రాన్ని ఏ మహానుభావుడు కనిపెట్టిండో ఆయన ముఖ జిరాక్స్‌కొక నమస్కారం కాలం పరుగులు తీసేందుకు తనకు తానే వేగం సృష్టించుకుంటది ఫొటోకాపియర్‌ ఒక మంత్రపుష్పం అక్షరాలకు అచ్చం ప్రతిబింబం
విశ్వ ప్రేయసి

విశ్వ ప్రేయసి

ఆమె విశ్వప్రేయసి అనంత విభ్రమ సౌందర్య రాశి ఆకుల గలగలల నవ్వులతో, ఆటవెలదుల ఏటిపాయ నడుముతో, తోట మలుపుల వాలుకనుల చూపులతో తరు వధువులు మధుర లాలసల తరియించిన తీరుగా - మురిసి, మరపించిన లలన. కొమ్మల ఊయలలూగి చిరు రెమ్మల చేతులు చాచి, చిరుగాలుల వింజామరలు వీచి - చిత్రరథస్వామి చిత్రంగ చెలరేగు వేళ చైత్ర పత్ర ఛత్రమై ఛాయనొసగు చారులత నాలుగు చెరగులా నేల నగ్నంగా సిగ్గిల్లినపుడు కలతచెంది - తానే తానులకొద్దీ హరితాంబరమై పరచుకున్న నెలత. చిగురుటధరముల మధురిమలతో పొగరు పయ్యెదల పరువపు కొమ్మలతో మాను ఒంపులు మేని సొంపులైన మానిని కంటికింపవు కలికి ప్రకృతిపై కంటగింపవు కరకు వికృతులు కలికాలనాగులై కాలకూటం కక్కినా, చెలగాటమాడి చెట్టు, చేమల తొక్కినా చెలువంపు చెలియ చెలిమినే పంచుతుంది ఆమె సర్వ మానవ హితైషి శ్రేయమే ధ్యేయమైన విశ్వప్రేయసి  
రావె తటిల్లతా

రావె తటిల్లతా

రావె తటిల్లతా చినుకు రాలని ఎండిన నేల తల్లికిన్‌ నీవె కదా తుషార రజనీకర రేఖవు ప్రాణి కోటికిన్‌ జీవము నివ్వవే వెలుగు జిల్గుల బంగరు సోయగాలతో నీవరుదెంచినన్‌ పుడమి నిత్యవసంతము కాకపోవునే భావము చల్లగా పసిడి పంటలతో సిరులొల్కి పోవగా నీవె దిశాంచలాల కడు నేర్పుగ నర్తనమాడు వేళలన్‌ నీవగలున్‌ యొయారములు నిస్వనముల్‌గని రైతు బిడ్డలా శావహులై పొలమ్ములకు సాగిరి చంద్రుని చుట్టియున్నరే ఖావలయమ్ము సూచి పులకాంకితులై ‘‘అదె చందమామ తా కోవెల గట్టె వర్షమిక కొల్లల’’టంచును బల్కె పామరుల్‌ ఆ వచనమ్ములన్‌ మృషగ అక్కట సేతువె జాగుసేయనే లా వరణీయ జృంభిత విలాస రుచుల్‌ గగనాంతరమ్ములన్‌ ప్రోవులు ప్రోవులై చిలికిపోవగనిమ్ము ముఖాబ్జదీధితుల్‌ శ్రావణలక్ష్మికిన్‌ చినుకు సంపదలై తరళించి పోవగన్‌ తీవెలు సాగి స్వర్ణమయ దీప్తులు ధారుణియందు నింపుచున్‌ దేవతలెల్ల నిన్ను వినుతింపగ సుందర స్వర్ణరేఖలై పావన మేఘమాలికల పంక్తుల మాటున నాట్యమాడుచున్‌ నీవరుదెంచినన్‌ సిరులు నిండి వసుంధర పుల్కరింపదే ఆ వసుధా వికాస దరహాస విలాసము మానవాళికిన్‌ దీవెనయౌచు రంజిలగ దివ్య విరాజిత రాగహేలవై శ్రీవిలసిల్లగన్‌ గగన సీమల దాగుడు మూతలాడుచున్‌ వే వెలుగుల్‌ జ్వలింపుచును వెల్లువయై కురిసేటి వర్షపున్‌ జీవనధారకున్‌ సొగసు చేకురునట్లుగ ప్రేమమూర్తివై రా వొలికింపు నీ హొయలు రంజిత రాజిత నాట్యభంగిమల్‌ ఆ వినువీధులన్‌ పరచి అమృతధారలు చిల్కరింపుచున్‌ మా వగపంత తీరగను మాయగ చింతలు మంజులాంగివై రాలె తటిల్లతా! భువన రమ్య విరాజిత! వారుణీసుతా! నీవరుదెంచినన్‌ పుడమి నిత్య వసంతము కాకపోవునే
కాగితపు కిటికీ

కాగితపు కిటికీ

ఉషోదయాన్నే ఊరేగడానికి రాత్రే ముస్తాబవుతాను! కాఫీ, టీల ఘుమఘుమలు, కళ్లాపి జల్లుల మట్టి వాసనలు, విరిసీ విరియని వెలుగు పూలు, తెరచీ తెరవని వేచి ఉన్న కళ్లు, సుప్రభాతాన నను స్వాగతిస్తుంటే సైకిల్‌ మీంచి వాకిట్లోకి, సాదరంగా వచ్చిపడతాను! రాజకీయాల రంగుల్ని, రమణీయ ప్రపంచపు పొంగుల్ని ఆరంభశూరత్వాల హంగుల్ని, ఆశల నావలు నడిపే సరంగుల్ని ఆకలి కేకల హోరుల్ని, ఆరాటపు ఆవిరి పొగల్ని విజయ శిఖరాల వీర గాథల్ని, వినమ్ర సమాజ సేవా గంధాల్ని నాతోనే తీసుకొస్తాను, మీకోసమే ప్రదర్శిస్తాను సన్మానాలు, శాపనార్థాలు, వేడుకలు, వేదనలు విజ్ఞాన వినోదాలు, విపత్తుల విపరీతాలు ఎన్నో నాలో పక్కపక్కనే! నాకు లేదు మక్కువ, దేనిపైనా, ఎక్కువ, తక్కువ!! లోకపు పోకడచూపే కాగితపు కిటికీని లోగుట్లను బయటపెట్టే కాంతులీనే దివిటీని! అక్రమాలపై ఎక్కుపెట్టిన అక్షరాస్త్రాన్ని! ఆలోచనల నాట్లు మొలిచే పద క్షేత్రాన్ని! వేకువనే వెలుగులు చిమ్మే విశేషాల తారకని విశ్వమంతా తిరిగివచ్చే విపంచి గీతికని! రోజూ మీచేతుల్లో అలరారే మీ దినపత్రికని నా రాతలతో, మీ రాతల బాగుకోరే మీ అభిమాన పుత్రికని!!
మాట్లాడని మౌనాలు

మాట్లాడని మౌనాలు

మౌనం అర్ధాంగీకారం కాదిప్పుడు అది బద్దలవబోతున్న అగ్ని పర్వతం కావొచ్చు ఏ క్షణమైనా మాటలు లావాలా ఎగజిమ్మనూవచ్చు మౌనం ఉత్తమ సంభాషణకు ఉదాహరణ కాదిప్పుడు మాటల్ని తూటాల్లా పేల్చాల్సిన సమయం నోరు జారుతున్న వ్యక్తి నోరెళ్లబెట్టేవరకు వాడి మాటలు చేసిన గాయాలు మంటలై వాణ్ని మాడ్చేవరకు మాట్లాడుతూనే ఉండాలి దుర్మార్గపు లోకంలో మౌనం ఆభరణం కాదిప్పుడు గొంతు నరాలు తెగేలా మనమేంటో తెలిసేలా మనసుని మాటలుగా మార్చి వాడి మొహం మీద కుమ్మరించాలి మనల్ని వాడెవ్వడో అర్థం చేసుకుంటాడని మౌనంగా ఎదురుచూస్తూ కూచుంటే మన్వంతరాలు పట్టినా పట్టొచ్చు వాడి గుండెల్లోకి సూటిగా అర్థాన్ని గుచ్చేయాలి మౌనాలు మాట్లాడవిప్పుడు మంత్రం, తంత్రం, బ్రహ్మాస్త్రం అన్నీ సానబెట్టిన మాటలే నేడు.
గోరింటాకు

గోరింటాకు

ఆషాఢం వస్తే చాలు ఆకుపచ్చదనంతో పడతి ఒడి నిండుతుంది వానలు జోరుగ కురువక ముందే ఆడపిల్ల గౌనులో పచ్చనాకు పంటై ఇంటికొస్తుంది ఈ యాంత్రిక యుగంలోనూ రోలే ఆధిపత్యం వహిస్తుంది ఎరుపెక్కబోయే ఉద్యమానికై మహిళ సంఘటితమవుతుంది. దగ్గరితనాలూ దూరపుతనాలూ ఎరుకలోకి వచ్చి పంపిణీలు జరిగిపోతాయి తప్పటడుగుల పసిపాపల పాదాలపై సూర్యోదయమవుతుంది పిల్లవాడి భృకుటి మధ్యం అదృష్టాన్ని అంచనా వేయిస్తుంది. కాబోయే వాడెలాంటి వాడో పండిన చేతులు జోస్యం చెబుతాయి రాత్రంతా కలతనిద్రే అయినా అదేమి చిత్రమో  కళ్లకి బదులు చేతులు ఎరుపెక్కుతాయి అతని చేతివేళ్లను ఎంత దాచుకున్నా పండిన ఇంటిదాని చేతులు అపురూప దాంపత్య రహస్యాన్ని బట్టబయలు చేసేస్తాయి శ్రావణంలో కుంకుమవర్ణం పులుముకున్న పసుపు చేతులు మొలకెత్తిన శనగలతో సౌభాగ్య ప్రదాతలవుతాయి అధికారిణి అరచేతిలో పురివిప్పిన నెమళ్లు సాంకేతిక నిపుణ చేతులకు అల్లుకున్న పూలతీగలు ఆధునిక వస్త్రధారణలోనూ అరచేతిలో చందమామ ఏ చిత్రంలోనూ నిన్నెప్పుడూ మరువని బాపుబొమ్మ వంట పాత్రల్లో ఒదిగే చేతులు బిడియంతో దాగే చేతులు రెండిటి స్థానంలో పది పనులతో సతమతమయ్యే చేతులు ఆకాశమంత విస్తరింపబడి చైతన్యానికి ప్రతీకలవుతాయి ముత్తమ్మ నుండి మునిమనుమరాలి వరకూ కృష్ణశాస్త్రి పాటై నిలిచిన ఓ పచ్చనాకూ! ఈశ్వరుడు మెచ్చిన బిల్వదళం కన్నా ఇంతి మెప్పు పొందిన నువ్వెందులో తక్కువ ఏ శుభ వేళయినా ‘ఈద్‌’ మాసమయినా నీతోనే మొదలవుతుంది ఎరుపుల మెరుపులు మాత్రమేనా! ఇరుమతాల సంస్కృతుల మేళవింపునకు ఇంపైన సాక్ష్యం నీవు చెలులారా! రండి. ఆషాఢానికి ముందే రసాయనం లేని రంగుల పంటకై పచ్చదనాన్ని పూజిద్దాం.  
దగ్గరితనం దూరంగా

దగ్గరితనం దూరంగా

సూర్యుణ్ని తుంచి మంట కాగుదామన్నావు సాధ్యమా... అనుకున్నాను కానీ, నిను ప్రశ్నించలేదు. దోసిలి ఒగ్గి నది మొత్తం ఆపోశన పడదామన్నావు అసంభవం... అనుకున్నాను కానీ, నీతో అనలేదు. నిచ్చెన మీదుగా ఎగిరెళ్లి రోప్‌ట్రిక్‌ మాదిరి ఆకాశంలోకి అదృశ్యమవుదామన్నావు ఔరా... ఆశ్చర్యపోయాను. కానీ, అభావంగా ఉండిపోయాను. ఎందుకో, మరి  బంధం పుటుక్కుమని తెగి దగ్గరితనం దూరమైంది నన్నే మాయం చేసుకుని నన్నసలే లేవనుకున్నావు స్పష్టమైన దారి ఉందినాకేమీ వెలితి లేదనుకున్నాను. మాటలేమైనా శరాఘాతాలా మనసేమైనా అద్దమా పుచ్చిన పుల్లలా విరగడానికి. నీకూ నాకూ మధ్య  అంతరం... ఒక పొగ... ఒక గాలివాటు ఎటు ఊదితే అటు పోతుందనుకున్నాను. ఒక జ్ఞాపకం లేదా స్నేహం నాచుకట్టిన మెట్ల మీంచి పట్టు దొరక్కుండా జారిపోయిందనుకున్నాను కాలచక్రంలోని కాసిన్ని రోజుల్ని చెరిపేసుకున్నాను గుండె అలజడుల్ని అణచి సముదాయించుకున్నాను నిరపేక్షంగా- కంటకాల మధ్య పూలపుప్పొడిని దాయవచ్చనుకున్నాను మాటను వింగడించి పెడర్థాల సంద్రం చేసి కించిత్తు ఆనందపడేవాడెవడో నునుపైన కర్ర ముక్కను చిత్రిక పట్టి ఉంచాడు. మౌనం నా చిరునామా ఎవరెంత అసహనాల జడిలో మునిగినా- నాలోని చెమ్మ ఆరనీయను. * * *