కవితలు

పాపం! పసివాళ్లు!!

పాపం! పసివాళ్లు!!

లగడపాటి భాస్కర్‌

తెలుగు తల్లి

తెలుగు తల్లి

- డా।। నాగభైరవ ఆదినారాయణ

సంక్రాంతి లక్ష్మి

సంక్రాంతి లక్ష్మి

అద్దంకి రామప్రియ

పొందడం కోసమే..!

పొందడం కోసమే..!

కల్వలపల్లి బాలసుబ్రహ్మణ్యం

పావురాళ్లకు కెవ్వు కేకలు

పావురాళ్లకు కెవ్వు కేకలు

కోటం చంద్రశేఖర్‌

సౌందర్యలహరి

సౌందర్యలహరి

అదొక విశ్వకళావేదిక! అందొక అందాల అభిసారిక!! తటిల్లతలా ఓ మెరపు మెరిసింది ప్రణవనాదం ప్రణయ నాదమైంది... శ్రుతిలయల కనుగుణంగా పాదమంజీరాలు ఘల్లుమన్నాయి మువ్వల సవ్వడితోపాటు గాజులు గలగలమన్నాయి సన్నని ఉంగరాల వేళ్లు ముద్దుగా ముద్రలు పడ్డాయి... గోదారికి రాదారిలా నుదుటిపై పాపిటబిళ్ల పారాడింది నల్లని కురులలో ఒకేసారి సూర్యచంద్రులు తళుక్కుమన్నారు... విల్లులా వంగిన కనుబొమల మధ్య ఎర్రని కుంకుమ త్రినేత్రంలా మెరిసింది నీలి మబ్బుల్లాంటి కాటుక కళ్లు కాంతులీనాయి... ముత్యాల ముక్కెర ముక్కుపై మురిపెంగా మురిసింది మదనుని బాణంలాంటి అధరాలపై చిరునవ్వు అందంగా విరిసింది... చెవుల లోలాకులు వూయల లూగుతుంటే చెంపసరాలు చెవిలో దూరి సుస్వరాలు వినిపిస్తున్నాయి... యవ్వనాన్ని బిగించిన రవిక కనిపించీ కనిపించక కవ్విస్తోంది... ఎద పయ్యెదపై నగలు నాట్యం చేస్తున్నాయి... వజ్రాల వడ్డాణం నడుము నాజూకుతనానికి పరీక్షగా నిలిచింది జబ్బలపై అరవంకీలు నిబ్బరంగా నిలిచాయి అందంగా అమిరాయి... మనసును దోచే మల్లెలు కవ్వించే కనకాంబరాలు పూరాణులు గులాబీలు తళుకుమనే జడబిళ్లలు వూగాడే జడకుచ్చులు మొదలు నుంచీ చివరి వరకూ నాగుపాములాంటి జడకు నాజూకుగా అమిరాయి... ఆమె కదిలే ప్రతి కదలికా వయ్యారాల వరూధిని అవుతోంది మనసు వశం తప్పి పరవశమైపోతోంది... ఓ బ్రహ్మా!... అలంకారానికి అనువుగా ఆడదాన్ని సృజించావు ప్రకృతి సోయగాన్నంతా ఆమెలో నింపావు ఆనందించి ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించావు విధాతా!... నీకిదే మా వందనం!...
సీతాకోక చిలుక

సీతాకోక చిలుక

ఎంత బావుందో రాగరహిత ప్రపంచాన్ని రంగురంగుల మయం చేస్తుంది రెక్కలపై చుక్కల ప్రేమలేఖ ఏ చెలి ఎద చెంతకు చేరుస్తుందో ఏ చిత్రకారుడు ఈ రెక్కల కాన్వాసుపై వేలవేల బొమ్మలు వేశాడో తెగ మెచ్చుకోవాలని ఉంది ఏదో ఉండలా కొమ్మకు వేలాడుతూ ఆపై ఒళ్లంతా రోమాలు అదేదోలా అనిపించే చిన్నారి సీతాకోకా... నిన్ను చూశాకే తెలిసింది నీ రూపంలో ఉన్న నన్ను నేనే ఆరాధిస్తున్నానని ఒంటి మీద పొలుసులు సొగసైన రెక్కలవుతాయి ఏదో తెలీని ఇంకేదో రసం వాటి మీద బొమ్మలు, గీతలు గీస్తే వర్ణకేళి భలే ముద్దొస్తుంది కొమ్మలోంచి రెమ్మల మీంచి చిగురులాంటి సీతాకోకా... సీతాకోక లాంటి చిగురూ... ఈ రెండూ నిజమేనేమో ఎండిన కొమ్మలు ఎన్నెన్ని సీతాకోకల్ని చిగురించాయో కనిపిస్తూ, వినిపిస్తూ, కంపిస్తూ... ఈ సీతాకోకల ఇవాళ్టి ప్రయాణమెటో? ఇంకా తేల్చుకోలేదేమో...
వికృతం

వికృతం

జై తెలుగు తల్లి

జై తెలుగు తల్లి

ప॥ జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి     జగమంత వ్యాపించు జయ కల్పవల్లి చ॥ ఏడేడు లోకాలు ఏలేటి ఏడు కొండల సామికి     జోల పాడింది నా తెలుగు తల్లి      అనాదిగా కూస్తున్నా అలసట ఎరుగని      కోయిలమ్మ నా తెలుగు తల్లి      కోడి కూత జాములో కొత్త కొత్త పాటకై      వేచిచూస్తున్నది నా తెలుగు తల్లి      జాను తెనుగు పదాల్లో పల్లెపడుచు గుండెల్లో      గూడు కట్టుకున్నది నా తెలుగు తల్లి చ॥ పాలపిట్ట అంతరంగం కృష్ణా గోదావరి      తుంగా తరంగం నా తెలుగు తల్లి      అమ్మపాలు విషమని ఎంగిలి పాలకై      అర్రులు చాస్తుంటే కుమిలి ఏడుస్తున్నది నా తెలుగు తల్లి      నాడు పూల పానుపు, నేడు ముళ్ల పందిరి,      రానున్న కాలం తలుచుకుంటున్నది నా తెలుగు తల్లి      తెనుగు తనము పోయింది      పరభాషా పోకడలు గతులు తప్పగా      నా తెలుగు తల్లికి ముప్పు తప్పదా?
స్వచ్ఛ భారతం

స్వచ్ఛ భారతం

ఒక్క అడుగు.. మరొక్క అడుగు వేయాలిప్పుడు పరిశుభ్ర భారత నిర్మాణానికి పరిమళ భరిత మానవతా సౌందర్య సాధనకి శుభ్రత ఒట్టి నినాదం కాదు అదొక విధానం మంచి కోసం మనిషి చేసే నిరంతర శ్రమదానం దేశానికైనా.. దేహానికైనా.. స్వచ్ఛత సజీవ చైతన్య పతాకం చీకటిని వెలుగుతో తుడిచినట్టు దుఃఖాన్ని చిరునవ్వు పెట్టి కడిగినట్టు శుభ్రత పావన జీవనానికో మార్గం కావాలి మదిలో అయినా.. గదిలో అయినా.. చేరే చెత్త ఎప్పుడూ చెడునే చేస్తుంది కర్తవ్యం కార్యాలయంలో నిద్రపోతే దేశపటం చుట్టూ సాలెగూళ్లు అల్లుకుంటాయ్‌ బల్లులు తిరిగే బల్లల కింద అరచేతుల్లో అవినీతి ముళ్లడొంకలు మొలుచుకొస్తాయ్‌ దుమ్ము పట్టిన గోడగడియారపు ముఖంలా వివర్ణమవుతోందిప్పుడు భూగోళం మహాత్ముడి కళ్లద్దాల వెనకనుంచి చూస్తూ శుభ్రం చేసుకోవాలి నైతికాన్నీ.. భౌతికాన్నీ చిన్ని బుగ్గలమీద కన్నీటి చారికల వెనక కలతలనీ నెత్తురోడే గాయాలు చెప్పే రక్త చారిత్రక కథలనీ డబ్బు చుట్టూ తిరిగి మురిగిపోతోన్న మనిషి మదికంటిన మకిలినీ చెత్తనీ.. చెదారాన్నీ.. పురుగునీ.. పుట్రనీ.. కీచకులనీ.. వంచకులనీ లోపలా బయటా... ఉండ చుట్టిన కాగితాల గుట్టలతో పాటు బండబారిన గుండెల మొండి దుర్మార్గాలనీ.. దుమ్ము దులిపేయాలి.. చిమ్మి పారేయాలి.... చెత్తబుట్టల్లోకి.. చరిత్ర మారుమూలల్లోకి!!
ఆ బాల్యం... నాకిప్పుడు కావాలి

ఆ బాల్యం... నాకిప్పుడు కావాలి

తుమ్మెద రెక్కల రంగుల్ని బుగ్గల నిండా పులుముకొని గుమ్మడిపూల అందాల్ని కన్నుల్లో నింపుకొని అమ్మకొంగున దోబూచులాడే కమ్మనైన.. ఆ బాల్యం కావాలి నాకిప్పుడు..! గున్న మావికొమ్మ ఉయ్యాల చిన్న మనసుల చిలిపికయ్యాల పున్నాగపూల పోటీల పున్నమి వెన్నెల పూచిన తంగేళ్ల తుళ్లింతల.. ఆ బాల్యం కావాలి నాకిప్పుడు..! పెళ్లీ పేరంటం.. పండగ పబ్బాల్లో బంతీ చేమంతి పూలజడ వూపుల్లో పరికిణీ పట్టుకొని పరుగులుపెట్టే పరదాలు, పగ్గాలు దరిచేరని సరదాల.. ఆ బాల్యం కావాలి నాకిప్పుడు..! కళ్లాపి చల్లిన పచ్చని వాకిట రంగుల రంగవల్లుల నడుమ కొలువైన గొబ్బెమ్మల చుట్టూరా చేరి కోరికలు తీర్చమని కోలాటమాడే కేరింతల.. ఆ బాల్యం కావాలి నాకిప్పుడు..! పాడిపంటలు, పిండివంటలు.. భోగిమంటలు, కొత్తజంటలు.. హరిదాసు పాటలు, గంగిరెద్దుల ఆటలు జానపదాల జీవనరాగాల.. గారాల.. ఆ బాల్యం కావాలి నాకిప్పుడు..! అరచేత పండిన గోరింటాకు అందమైన మొగుడొస్తాడని ఆటపట్టించే నేస్తాల అల్లరికి సిగ్గుల మొగ్గై ముడుచుకుపోయే ముచ్చటైన.. ఆ బాల్యం కావాలి నాకిప్పుడు..!!!
ప్రశ్న

ప్రశ్న

ఎవడురా... వాడెవడురా ప్రణవ వీణలు మీటినోడు ఎవడు ఎవడాడెవడురా గుండె తీగలు తెంపినోడు ఎండమావుల రాలిపడిన చినుకు పండు వెన్నెలా గండుకోయిల గానమధురిమ పానవట్టమేగా ఇల      ఎచట నుంచి రాకమనదీ      వెళ్లునది మన మెచటికో      కల్లగాదిది ఎల్లజగతికి      ఉల్లమున ఉదయించు ప్రశ్న      ప్రాణి జీవనయానమంతా      చావు పుటుకల సమరమేగా      ఉండగోరిన ఎంతకాలం      ఉండు పదిలంగుండునా? కణం నుంచి మనలపెంచి కనికరమె లేకుండ తుంచి ఆడుకొనుటకు జీవకోటితో హక్కు ఇచ్చినదెవడురా దిక్కులను వెలిగించునాత్మ దీపమారిన చందమేనా! అంధకారమె లోకమంతా అల్ల నా చైతన్యమెంత      పంచభూతాలేకమైతే      ప్రాణికాకృతి కలిగెరా      ప్రకృతి పొత్తిళ్లలో అది      ప్రపంచమ్మై వెలిగెరా      కంచె చేను మేసినా      చందాన పంచన మిగిలెనా      సత్తు చిత్తుల విశ్వతత్వం      నిఖిలమై తా నిండి ఉన్నది
ఆ మెదళ్లకు ఆకలెక్కువ

ఆ మెదళ్లకు ఆకలెక్కువ

పేగులు ఎండిన పొట్టలతో చిరిగిన చొక్కాలతో విజ్ఞాన విందుకు వెళుతున్నారు. కూలి ఉంటేనే కూడు వలసపోతేనే ఉపాధి ఆస్తిపాస్తులు లేకున్నా ఆత్మవిశ్వాసం మెండు చెప్పులు లేకపోయినా చెమట పట్టే నడకైనా బడివైపే అడుగు పడుతోంది ఎదగాలనే ఆకాంక్ష నడిపిస్తోంది కరెంటు పోతే కొవ్వొత్తి కొనలేరు భవిష్యత్తుపై ఆశ దీపం బుడ్డీని దేదీప్యం చేస్తోంది కుక్కిమంచమే కుర్చీ కటిక నేలే పాన్పు చదువు కోసం సర్దుబాట్లెన్నో... భవిష్యత్తు బాటలో చీకటివెలుగులు అమ్మానాన్నా వలస వెళ్తే అవ్వాతాత తోడుగా వూరి జనం నీడగా చదువుసాగింది నిరంతరంగా ఆకలిని జయించి విజయాన్ని లిఖించి ఆదర్శమయ్యారు ఎందరికో పేదింట్లో ప్రతిభాకుసుమాలు