కవితలు

క‌న‌బ‌డుట లేదు

క‌న‌బ‌డుట లేదు

కోడం పవన్‌కుమార్‌

కళాక్షేత్రం కథా కమామిషు

కళాక్షేత్రం కథా కమామిషు

కక్కునూరి శ్రీహరి

మోహనం

మోహనం

దాసరాజు రామారావు

అంత‌స్సంగీత స్ర‌వంతి

అంత‌స్సంగీత స్ర‌వంతి

మల్లారెడ్డి మురళీమోహన్‌

కాలం తూనీగ

కాలం తూనీగ

పరమాత్మ

ఊహల వాన...

ఊహల వాన...

అప్పుడప్పుడు ఇల్లు... ఇరుకైపోతే బాగుండు కదూ! అందరం ఒకచోట చేరి ఊసులు పంచుకోవచ్చు. ప్రపంచం నిశ్శబ్దమైపోతే బాగుండు కదూ! హృదయాంతరాళంలో భావం వినిపించుకోవచ్చు. యంత్రాలు స్తంభించిపోతే బాగుంటుంది కదూ! మనలోని మనిషిని మేల్కొల్పవచ్చు. మానవతా విలువల్ని పెంచుకోవచ్చు. ఆకాశం అంధకారం అయిపోతే  బాగుంటుంది కదూ! నక్షత్రాలను లెక్కపెట్టే అమాయక ఆనంద రోజుల్ని మళ్లీ నెమరేసుకోవచ్చు ఓడిపోతే బాగుంటుంది కదూ! ఓటమిలో కూడా మలుపుందని ఓటమి గెలుపునకు పునాదని తెలుసుకోవచ్చు అప్పుడప్పుడూ నువ్వు నేనూ చెరోవైపు ఆలోచిస్తే  బాగుంటుంది కదూ! కొత్తగాలితో మన మెదళ్ల బూజును దులిపేసుకోవచ్చు. పక్షులన్నీ గూటికి చేరుకుంటే బాగుంటుంది కదూ! మళ్లీ గూడు కళకళలాడుతుంది,  సంతోషాన్ని ఇక్కడే చూసుకోవచ్చు. రైతే రాజైపోతే బాగుంటుంది కదూ! అందరి కడుపు నిండిపోతుంది. ఆకలనే పదాన్ని నిఘంటువు నుంచి తీసివేయవచ్చు. ఈ సమాజాన్నీ పునాదులను, విలువల్ని కలిపి పునర్నిర్మించుకుంటే బాగుంటుందికదూ! విదేశీ వ్యామోహాల జాడ్యాల నుంచి బయటపడవచ్చు. ఊహలన్నీ సీతాకోకచిలుకలై  మనమీద వాలిపోతే ఎంత బాగుంటుందోకదూ! లోకమంతా... నందనవనమై... మనమేమో వాటితో పూలవానలో తడిసిపోతాము. అంతకుమించి ఆనందం ఈ ప్రపంచంలో  ఉండదని రుజువు చేయవచ్చు కదూ!
రాత్రి కురిసిన వర్షం

రాత్రి కురిసిన వర్షం

రాత్రి కురిసిన వర్షానికి, అవని హిమవశ్శీతల తుషార శ్వేతధారల్లో అభ్యంగన స్నానమాడి, కురులుముడిచి, హరితవస్త్రం, చుట్టుకున్నట్లుంది. సిరులు పండించే సస్యశ్యామల క్షేత్రంగా గగనమందించిన ప్రియరాగాన్ని ప్రేమతో సాంతం అనుభూతిస్తున్నట్లుగా ఉంది. భాషకందని, భావగర్భిత ముగ్ధై హరితపల్లవి, అంకురానికై వేచి, మౌనమై తియ్యని అనుభూతుల ఆనందం తలబోసుకున్నట్లుంది. పరవశాన పవళించిన ధాత్రి చరాచర ప్రాణకోటి జగత్తుకు క్షీరధారలందించి, ధన్యతపొందినట్లుంది. చల్లగా, మెత్తగా, అమ్మ మనసులా ఒడిచాచి వాత్సల్యంతో, క్షమా, సహనాలతో అక్కున చేర్చుకునే తల్లిలా ఉంది. మట్టి పరిమళాలను మనసారా ఆఘ్రాణించిన వర్షం తనకు తాను త్యాగమై ధాత్రిలో ఏకమై తదాత్మ్యం పొందినట్లుంది.
ఆత్మ విమర్శ

ఆత్మ విమర్శ

చాన్నాళ్లైంది కదూ... ఆ పుస్తకపు పుటలు తిరగేసి.. అసలు తెరవనేలేదా..! నిన్ను నువ్వు ప్రత్యేక ముద్ర వేసిన వస్త్రాలతోనో పట్టు పీతాంబరాలతోనో కప్పేసుకుంటూ నువ్వు కాని నువ్వవుతూ అదే నువ్వని నీకు నువ్వు నచ్చచెప్పుకుంటున్నావు! నిన్ను నువ్వు తెలుసుకునేందుకు మాయతోనూ అహంకారంతోనూ కప్పిన శరీరపు పొరలను తొలగిస్తూ వెళ్లి... నీకు నువ్వే అయిన నీలోకి ఓసారి తొంగి చూడు... అక్కడ నీ తప్పొప్పులను తూకం వేసేందుకని ఓ తక్కెడ తయారుగా ఉంటుంది! నువ్వనుకుంటుంటావు నేను ఏ మాత్రం బురదంటని తామరనని... ఏమో ఆ చివర కొంచెం బురదంటి ఉండవచ్చు... మరో చివర చీడపట్టి ఉండవచ్చు... ఇకనైనా నువ్వు బాకీ పడిన భావాలను వెలిబుచ్చేందుకు... పొరపొచ్చాలు లేకుండా కొన్ని ధన్యవాదపు పుష్పగుచ్ఛాలను,  కొన్ని క్షమాపణల గులాబీలను నీ హృదయపు సంచీలో వేసుకో... ఎక్కడ ఏది అవసరమో గ్రహిస్తూ... ఒక్కోటీ ఇస్తూ నిన్ను నువ్వు తేలిక చేసుకో....! అప్పుడు నీ మనసు విహంగమై నింగి అంచులను తాకుతుంది! అప్పుడప్పుడూ నీ ఆత్మను పలకరించడం  గుర్తుంచుకో మరి!
షరతులు వర్తిస్తాయి...

షరతులు వర్తిస్తాయి...

ఎపిసోడ్‌ అయిపోయింది టీ.వీ.ని పొడిబట్టతో శుభ్రంగా తుడవండి అది కన్నీళ్లతో తడిసిపోయింది. నాయకుడు మాట్లాడేశాడు సభనుంచి జనం వెనుదిరిగారు మైక్‌ చెవుల్లోని దూది తీసేయండి. సినిమా మొదలైంది ప్రేక్షకుల జవసత్వాలు ఉడిగిపోతున్నాయి రీళ్లన్నీ వారసత్వాల కంపుకొడుతున్నాయి. రోడ్లు వాహనాలను ఈనుతున్నాయి వాహనాలు ఇంధనాన్ని తాగుతున్నాయి పెట్రోలు పంపులకు సెలైన్‌ ఎక్కించండి. మాటలతో పాటు స్మార్ట్‌ పనులు ఎక్కువైనాయి అయ్యో! దానికి రేడియేషన్‌ తలనొప్పి ఎక్కువవుతోంది మొబైల్‌ ఫోన్‌కెవరైనా జండుబామ్‌ పట్టించండి. కోరుకోవడం ఆగిపోయింది అర్చనాభిషేకాలు పూర్తయ్యాయి దేవుణ్ని శుభ్రంగా కడగండి సాఫ్ట్‌వేర్‌ నేర్చుకొని మనిషి హార్డ్‌వేర్‌ అయ్యాడు హార్ట్‌ను వేరుచేసుకొని హార్ట్‌లేనివాడయ్యాడు కంప్యూటర్‌కి మానవత్వమనే ఓ.యస్‌.ను లోడ్‌చేయండి వేసవిలో ఏసీల తలలు మాడిపోతున్నాయి మనల్ని చల్లబరిచే పనిలో చచ్చుబడ్డాయి విసనకర్రతో విసరండి అవి సేదతీరుతాయి నదుల్లో నీరెండిపోయి కన్నీరు మిగిలింది పవర్‌గ్రిడ్లు గుడ్లు తేలేస్తున్నాయి పవర్‌ ప్లాంట్లకు ఇన్వర్టర్లు బిగించండి! రాజకీయాల్లో నెంబర్‌వన్‌ కోసం పోటీ ఎక్కువైంది డాబు, దర్పô, కత్తులు, బాంబులవే కుర్చీలు నెంబర్‌వన్‌ అధికారపు కుర్చీలు లక్షకొనండి వస్తు వినియోగం పెరిగింది మనిషి కోరికల చిట్టా విచ్చుకుంది ఆఫీసు బల్లల కింద నోట్ల కట్టలు ఉంచండి స్నేహం, ఆత్మీయతలు చెట్టెక్కాయి విక్రమార్కుడు బేతాళుడిచ్చిన లంచాన్ని మెక్కాడు డబ్బులే జీవితమవడంతో కథ సాగటంలేదు బాబ్బాబు! మనిషిని కాస్త వదలిపెట్టండి. 
వెన్నెల పాట

వెన్నెల పాట

సాకీ: సలసల్లని సందెకాడ తెలతెల్లని సందమామ మెలిమెల్లిగ తొంగిజూసి సనసన్నగ నవ్వుతుండాదె... ఎన్నేలమ్మా ఎన్నేలమ్మా, ఎన్నెల సందమామదిగోనమ్మా ఎన్నెల సందమామదిగోనమ్మా, ఎంతసక్కగుండాదో సూడోయమ్మా సందమామ... అరెరే సందమామ సందమామ కురిపిస్తే ఎండివానా సలసల్లగ కురిసిందే కొండపైనా                ।।సందమామ।। మల్లేలమ్మా మల్లేలమ్మా, మల్లెలపూల సెట్టదిగోనమ్మా మల్లెలపూల సెట్టదిగోనమ్మా, ఎన్నిపూలు పూసినాయొ సూడోయమ్మా మల్లెసెట్టు... అరెరే మల్లెసెట్టు మల్లెసెట్టు కురిపిస్తే పూలవానా గడ్డిపూలు మురిసిపాయె లోనలోనా            ।।మల్లెపూలు।। కోనేరమ్మా కోనేరమ్మా, కోనేట్లో కలవపూలవిగోనమ్మా కోనేట్లో కలవపూలవిగోనమ్మా, ఎంత పెద్దగుండాయొ సూడోయమ్మా కలవపూలు... అరెరే కలవపూలు కలవపూలు ఆడతాంటె నీల్లపైన పిల్లగాలి పరవశిచ్చె శానశానా                ।।కలవపూలు।। కిష్టప్పమ్మో కిష్టప్పమ్మో, ఏటిగట్టునుండాడు అదిగోనమ్మో ఏటిగట్టునుండాడు అదిగోనమ్మో, ఎంతసక్కగుండాడు సూడోయమ్మో కిష్టప్పకు... అరెరే కిష్టప్పకు కిష్టప్పకు నెత్తిమీద నెమిలీక రారమ్మని పిలస్తాండాదదిగోనమ్మో            ।।కిష్టప్పకు।। పిల్లంగట్టెమ్మో, పిల్లంగట్టెమ్మో, కిష్టప్పకు పెదవులపై పిల్లంగట్టెమ్మో కిష్టప్పకు పెదువులపై పిల్లంగట్టెమ్మో, పాటలెన్నో పాడతాందదిగో ఇనరమ్మో పిల్లంగట్టి... అరెరే పిల్లంగట్టి పిల్లంగట్టి పాడతాంటే ఎన్నెట్లోనా ఆటలెన్నో ఆడదాము కదలండమ్మో         ।।ఎన్నేలమ్మా ఎన్నేలమ్మా।।     (పిల్లంగట్టి- పిల్లనగ్రోవి)
నువ్వెవరూ!

నువ్వెవరూ!

చిరుజల్లే తాకకుండా హరివిల్లే గొడుగుచేసి తారల్నే తోడుపంపే నువ్వెవరూ! కనురెప్పే నువ్వు నాకు కనుపాపే నేను నీకు కనుదోయి చూడలేదు నువ్వెవరూ! నేలమ్మ పిలిచిందా ఎప్పుడైనా వానని పువ్వమ్మ కోరిందా రమ్మంటూ చంద్రుని కోకిలమ్మ అడిగిందని వచ్చిందా ఆమని స్వార్థం అంటూ ఏమాత్రం లేని బంధం స్నేహమని శ్వాసై నా ఎద లయలో ధ్యాసై తను నామదిలో ఆశై నా కల గదిలో నిలిచే జ్ఞాపకమా..! కడలి అలలెగసి పడి వడిగా తను పరిగెడును తీరం దరిచేరగనే భారం అనురాగం కెరటిమంటినా పరుగులెందుకు మెరుపువానలో నా నడకలెందుకు నీ రూపం చూసే భాగ్యం నాకు ఎప్పుడో..! గాలై నా వేణువులో రాగం నువ్వు పలికింప స్వరమై సుమ అనురాగం నామది పాడేను... నడిచే ప్రతి దారులలో ధైర్యం  తన ఉనికి నాలో మధురం  ఆ తలపులలో తడిసే మమతలలో నీటి కలువలా ఎదురు చూపులెందుకు? ఏటి నీటిలా ఈ అలికిడెందుకు? నీ రూపం చూసే భాగ్యం నాకు ఎప్పుడో..!
ఇంద్రియ జ్ఞానం

ఇంద్రియ జ్ఞానం

పాపం నడుమ కన్నుదేమున్నది రిమోట్‌సిగ్నల్‌కు ఛానల్‌ మారే తెరే కదా! చూపుల్లో కరుణనొలికించినా లోచనాలు ఆలోచనల్లో ఈదినా నిప్పులు పోసుకున్నా కత్తులు మొలిపించినా అంతా ఆదేశాలకు దృశ్య రూపమే కదా! గొంతుదీ మూగవేదనే మాట పదిలంగా ఉండాలని తెలుసు పెగిలి గుండెల్ని పగలదీస్తున్నా పెదవులు అధీనంలో లేని బతుకు వెనకకు రానిది కాలమే కాదు  మాట కూడా మాట శాంతి సందేశాలనిస్తుంది అణ్వస్త్రాలకు అడుగులూ నేర్పుతుంది మాట పడటమంటే దెబ్బ మీద దెబ్బ మాటకు గొంతు తుపాకీ గొట్టం ట్రిగ్గర్‌ మాత్రం మెదడు హస్తగతం చేయి సైతం ఓ కీలుబొమ్మే చేతి నిండా కరచాలనంతో హృదయ పుష్పం విప్పారినా తలమీద చల్లని స్పర్శతో వెన్నెల జల్లులు కురిపించినా భుజం తట్టి బరువు దింపి జారిన ధైర్యాన్ని గుండెల్లోకి తెచ్చినా ఒకరి కోపానికి తాను పరికరమై సాటి మనిషిని తోసేసినా చొక్కా పట్టినా చెంపను చరిచినా చేయిది సుశిక్షిత సైనిక పాత్రనే ఇంద్రియాలన్నీ ఇంగిత జ్ఞానకోవిదులే మంచే చేయాలనుకుంటాయి మనిషి చేష్టలకు మదన పడతాయి. కానీ యజమాని అజ్ఞాన కబోది! తన అసహనానికీ¨ అవగుణానికీ వాటి నిగ్రహాన్ని కొల్లగొడుతున్నాడు.
గ‌ల్లా పెట్టె

గ‌ల్లా పెట్టె

వ్యయాన్ని అదుపు చేసి చేసే పొదుపును అదను చూసి మదుపు చేసే మధురిమ తీరే వేరు చిరుప్రాయంలో నేననుకునేవాణ్ని నేనో ‘చిరు అంబానీ’ నవుతానని తాతయ్య ప్రేమతో ఇచ్చిన రూపాయి బిళ్లలూ... నాన్న చిరునవ్వుతో చేతిలో ఉంచిన అయిదూ పది నోట్లూ...  బతిమాలగా అమ్మ ఇచ్చిన రూపాయిలూ దాచుకొని గుప్తంగా నా ఆశల్ని అందులో బంధించుకొని పండిన పంటకోసమై రైతు ఎదురు చూస్తున్నట్టు చూస్తుండేవాణ్ని నా డబ్బులు చాలా అవ్వాలనీ పది... వంద... వెయ్యి అలా  గాల్లోనే, గల్లా డబ్బులు రెట్టింపులవుతుండేవి దాని బరువు చూసి ఆనందిస్తుండేవాణ్ని ఎప్పుడో నాన్న జబ్బు పడినప్పుడు ఇంకా గభాల్న అవసరమొచ్చినప్పుడు ‘ఢాం’మ్మని మట్టి గల్లాపెట్టె పగిలేది నా ఆశల మంజూషని విరగ్గొట్టి
    1234..........................................47
  • Next