కవితలు

క‌న‌బ‌డుట లేదు

క‌న‌బ‌డుట లేదు

కోడం పవన్‌కుమార్‌

కళాక్షేత్రం కథా కమామిషు

కళాక్షేత్రం కథా కమామిషు

కక్కునూరి శ్రీహరి

మోహనం

మోహనం

దాసరాజు రామారావు

అంత‌స్సంగీత స్ర‌వంతి

అంత‌స్సంగీత స్ర‌వంతి

మల్లారెడ్డి మురళీమోహన్‌

కాలం తూనీగ

కాలం తూనీగ

పరమాత్మ

దేశభాషలందు తెలుగు లెస్స

దేశభాషలందు తెలుగు లెస్స

వేదరాశిలోని వేవేల మంత్రాలు నన్నయార్య కృతుల నాదఝరులు తిక్కనయ్య పలుకు తీరైన అర్థాలు  శంభుదాసు పల్లె సంబరాలు శ్రీనాథు వెలిగించు శివరాత్రి దీపాలు     భాస్కరాది కవుల భావసిరులు నన్నియ చోళమన్మథ విలాసమ్ములు     శివలెంక గణముల చిత్రగతులు భక్తపోతన చిందుమందార మధువులు     జక్కన్న శిల్పాల చక్కదనము అనమయ్య శృంగార ఆధ్యాత్మ గేయాలు     నరసింహు కొండకు నడచునుడులు రామయ్య పాదాల రాశియౌ మొల్లలు     తిమ్మక్క విజయుని తెలుగుపెండ్లి ఎక్కుపెట్టిన సత్య ఈ క్షణాంబకములు     ద్విపద రామాయణ దివ్య కథలు గోవత్సమాలించు గోమాత సుద్దులు     పాంచాలి అరచేత పట్టుకురులు  వైదర్భి నిషధేశు వచన చాతురిమంబు     కణ్వ కన్నియచిల్కు కన్నెవలపు ఉత్తుంగ శీతాద్రి ఊర్ధ్వాంగ స్వర్గంగ     కటకమ్ములకు జారు కలికిహొయలు భుజగాంగనవలె బుసకొట్టు సత్యను    అనునయించెడు కృష్ణహాసరుచులు నీలకంఠుని సిగనీడలో కూర్చున్న    శశిరేఖ చల్లెడి చలువకళలు సామజాహులు రేగి శర్వులింగముపైన    అతిభక్తితో చేయు అర్చనములు నవ్వుబుగ్గల పాప పువ్వుతేనియలుగ్గు    ఆరగించగనూపు అలలడోల పొదరింటి పాన్పులో పూబోడి మగనిపై   తారాడిచూపు శృంగారహేల గగనలక్ష్మి కమరు ఘనమణి హారాల   చయమును మెరపించు జలదమాల పాండురంగ విభుని పదపీఠి కొలువులో   దినదినము చరించు తెలుగుబాల ఇంతసుందరమును ఇంత వైదగ్థ్యము ఇంతనేర్పు సరళమింత కూర్పు వేరు భాషలందు వీక్షింప సాధ్యమే దేశభాషలందు తెలుగులెస్స.
సిలువ పలుకులు

సిలువ పలుకులు

లోకపు పాపముబాపను లోకేశుడు ఏసురాజు లోకుల కొరకై లోకమునందున సమిధై లోకంబును వదలివెళ్లె లోకోన్నతుడై తండ్రీ వీరికి తెలియదు గాండ్రించియు వీరు జేయుకార్యములేవో తండ్రీ మీరే వారిని తండ్రిగ రక్షింపుమనియెదాతగు క్రీస్తూ నీవు నాతొ గూడ నిజముగ పరదైసు నందు ఉందువనెను నమ్మకముగ ప్రక్కనున్నవాని ప్రార్థన వినియును ఏసునాథుడనియె ఎక్కి ‘‘సిలువ’’ తల్లిని జూచిన తనయుడు కొల్లగ దుఃఖంబుతోడ కుదురుగ తనతో మెల్లగ బలికెను, తల్లీ యిల్లిదిగో, నేను నీకు యిష్టపు సుతుడన్‌ దేవా వదలితివెందుకు నీవూ నా చేయిననుచు, నిజముగ వ్యథతో పావన పుత్రుడు క్రీస్తూ దేవుని అడుగంగసాగె దీనత తోడన్‌ దాహము, దాహంబనుచును దేహపు ధర్మంబుతోడ దేవుని సుతుడూ ఆహుతి ముందుగ అడిగెను బాహాటముగానె సిలువ బంధమునందున్‌ సామాప్తమైన దనియెను సమయంబాసన్నమైన సంగతి నెరిగీ కమనీయ దైవ పుత్రుడు అమలంబగు ప్రేమతోడ, ఆర్ద్రతతోడన్‌ నాదు ఆత్మను మీకిస్తిననుచు యేసు తండ్రితోడుల్‌ చెప్పియు తలను దించి ప్రాణమిడచెను సిలువపై పావనుండు చీకటులు క్రమ్మె లోకాన, చింత ప్రబలె తిరిగియు మూడవరోజున నరరూపాధారియైన నజరేయుండూ ధరపై లేచియు కనబడె పరమానందంబునొంద ప్రజలందరునూ
జీవన నేస్తాలు

జీవన నేస్తాలు

పాతమూటలో నూతన జరీవస్త్రాలు దాచుకున్నట్టు మనసు పొరలలో జ్ఞాపకాలెన్నో ప్రోది చేసుకున్నాను ఒక శుభోదయాన బడిలో తొలిరోజు సహ విద్యార్థులతో పంచుకున్న పప్పూ బెల్లాలు దాచుకుని తిన్న తాయిలాల తియ్యదనాలు నా మనోఫలకంపై తొలి ముద్రవేసిన జ్ఞాపకబీజాలు బడిలో ఆఖరిగంట మోగగానే మట్టి పలక చంకన బిగించి వడివడిగా ఇంటికి పరుగుతీసిన నా ఆత్రమూ అమ్మ నా రాకకోసం మండువాలో ఎదురు చూసిన వైనమూ గోరుముద్దలు తిని నిద్రపోయినప్పుడు సంజీవనీ పర్వతంలాంటి అమ్మవొడిచ్చిన రక్షణా ఆజన్మాంతం చిరస్మరణీయం అసుర సంధ్యవేళ సూర్యాస్తమయాన్ని సృష్టికర్త స్వరూపాన్ని గూటికి చేరుకుంటున్న పసిడిపిట్టల్ని కనుచూపుమేర తిలకిస్తూ హరితవర్ణ ప్రకృతిని ఆకృతిగా హృదయవేదికపై చిత్రిస్తూ నాన్నతో కలిసి ఊరంతా షికారు చేస్తూ తిన్న పీచుమిఠాయి మాధుర్యం ఈ నాటికీ జిహ్వకు రుచులద్దుతున్న కమ్మదనం పన్నెండుమైళ్ల దూరాన్ని మిత్రబృందమంతా పోటీలుపడి అర్ధగంటలో అవలీలగా అధిరోహించి మిడిబడికి చేరిన ఆనాటి సైకిలు ప్రయాణం నేటికీ నిత్యనూతనం ఇంటి ముఖంపట్టిన మార్గమధ్యంలో ఆడుకున్న కోతికొమ్మచ్చులు బంగారు ఇసుకతిన్నెలపై అశ్వ సవారీ ఆటలు తోటమాలి కన్నుగప్పి తిన్న చెరకుముక్కల తియ్యదనాలు తిరిగిరాని బాల్యానికి గుర్తుగా మిగిలిన మధుర జ్ఞాపికలు భుక్తికి భవిష్యత్తుకి ఆలోచనలెరుగని ప్రాయమది నిర్మల మనస్సుతో నిశ్చలభక్తితో వేణుగోపాలస్వామిని దర్శించుకుని మనసులో పుస్తకాల పుటల్లో అక్షరాల్లో  సాక్షాత్తూ సరస్వతీదేవిని కొలువుంచమని ప్రార్థించి కమ్మని బావినీరు చేదుకుని కడుపునిండా సేవించిన ఆనాటి ఉజ్వల భక్తిలో వెర్రి కోరికలు లేవు ఆశలు నెరవేరని నిరాశలు లేవు ఒక పారవశ్యపు చిరునవ్వుతో కళాశాల ప్రపంచంలో అడుగిడి  అమృత భావాలతో లిఖించుకున్న అనుభవాల అనుభూతులు కాలం చెట్టుకి మళ్లీ మళ్లీ విరబూసే వసంతాలు రంగు రంగుల పూలుపూస్తున్న కాలమది అయినా కాలం అక్కడే అలా ఆగిపోలేదు పట్టభద్రుణ్నై నిరుద్యోగిగా మనలేక చిరుద్యోగిగా మొదలుపెట్టిన జీవనయుద్ధం నేటికీ ముగింపులేని ప్రారంభం నెర్రెలు విచ్చిన నేలపై అమృతధారలు కురిసినట్టు నా జీవిత ప్రాంగణంలో అడుగిడి శతకోటి సమస్యలను పారద్రోలి జీవన మాధుర్యాన్ని పంచిన అర్ధాంగి చిరునవ్వులు ఈనాటికీ నన్ను ఆహ్లాదపరిచే జ్ఞాపక వింజామరలు అప్పటికి జీవితం ఓ కొలిక్కి వచ్చి మా నిశ్చల సరోవరం కలువలతో నిండి మా లోకమంతా విస్తరించిన చిరుపాదాల సవ్వడి నేటికీ గుండెలపై పారాడే జ్ఞాపకాల ఒరవడి పిల్లలు పెరిగి పెద్దవారై మా ప్రపంచాన్ని చిన్నది చేసి రెక్కలొచ్చిన వలస పక్షుల్లా దివిసీమలకెగిరిపోయినప్పుడు మా ఆశల సౌధం కుప్పకూలటమూ జ్ఞాపకమే జ్ఞాపకాలను తవ్వుకోవడం నాతత్వమే అనుకోండి మేఘదొంతర్లలాంటి జ్ఞాపకాలే నా జీవన నేస్తాలనుకోండి నదీపాయలాంటి ఆ స్పర్శకే నా మేను మేరువవుతుంది ఆ ఆత్మీయ పలకరింపుకే జీవితం పరిమళిస్తుంది.
మనిషి ఎంత మంచివాడో

మనిషి ఎంత మంచివాడో

వేదవదనుడయిన నెదురీదలేని కాలవాహిని కెరటాల వాలులోన మట్టిలో పుట్టి, మట్టిలో గిట్టు మనిషి ఎంత మంచివాడో చెప్పనెవరితరము? దేశము, సంప్రదాయములు, దేహము రంగులు, వేషభాషలున్‌ రాశుల వేరు వేరయి పరస్పర ధిక్కృతి రీతి తోచినన్‌ శైశవమాది జీవిత దశావిభవంబులు, మోదవేదనా క్రోశ శతాది భావనలకున్‌ తలి వేరొకటే వసుంధరన్‌. ఇందలి మూలసూత్రము గ్రహించి తపించి మహామనీషియై అందని ఎత్తుచేరి వసుధైక కుటుంబ పదంబులంబరం బందు ప్రతిధ్వనింపగ స్వరార్చన చేయుట లోక శాంతికెం దెందున చూచినన్‌ మనిషికే ధర చెల్లు నుదార మూర్తికిన్‌. మనిషే మత్తిలి, నెత్తురున్‌ మరగి, దుర్మార్గాలలో వండి వా ర్చిన దైత్యాత్మక భావనల్‌ మతపిశాచీ భూత బేతాళ డా కినులై భూతలమెల్ల సంకటములన్‌ గీలించి లంకింపవ చ్చని నర్తించు జిహాద్నినాదములతో నాత్మాహుతి జ్వాలలన్‌ వరదలో కొంపలంటించువాడు మనిషె వరదుడై వచ్చి ఆర్పెడు వాడు వాడె క్షణములో ప్రాణములు తీయు ఘనుడు వాడె కడగి ప్రాణము పోయు వైద్యుడును వాడె తాలిమికే జయంబనుచు ధర్మము వీడని వాడు, రాజకీ యాలకు మిత్ర శాత్రవ పదార్థము నిత్యము కాదటంచు ద్వం ద్వాల కధీనుడై ప్రవచనాల్‌ కురియించెడువాడు నొక్కటే పోలికతోచు పైపయిన, బుద్ధులు మాత్రము వేరువేరయా! పుట్టుటయందునన్‌ సుజనపూర్ణసమాజ సమత్వమందునన్‌ గిట్టుటయందునన్‌ మతము గీరల గారలు లేవు, మధ్యలో కట్టెకు పుట్టిపేరిన నిగారపు మచ్చలు రాచపుండు చూ పెట్టెడు దుర్నిమిత్తములు భీకర భగ్నచితాగ్ని భిత్తముల్‌ చెడ్డయన్నది లేనట్టి గడ్డ మీద కొంచెమైన విలువరాదు మంచికనుచు మొదటి దానికి తలవంచి మొక్కువాడు మనిషి, ఎంచగా వాడెంత మంచివాడొ! ఈతనువెల్ల దేశమునకేను సమర్పణసేసియుంటి, నీ  నా తన భేదముల్‌ కలుగునా కలనైన నటంచు స్వోదరా ఖాతము నింపగా ప్రజల కాసులు మింగుట ఎంత కష్టమో సేతువు శీతశైలమును స్విస్సున దాచెడు వాడు చెప్పడో! మనుషుల అంతరంగమున మాధవుడుండును హస్తకల్పుడై అనునది నిక్కమే అయిన అబ్బురమే పరమాత్ముడే యతం డనుట? ధరాతలాన నసురారి అహంతయు హంతకుండునౌ! తనరగ తవ్వితీయవలె తట్టెడు బుట్టెడు ధర్మసూక్ష్మముల్‌. గుప్పెడు మందితో చెలగి గొప్పలు గుప్పుచు రాక్షసోద్ధతిన్‌ చెప్పుటకే మనుష్యులన చెల్లిన ఘాతుక పాతకాంధసుల్‌ ముప్పుగ దాపురించునెడ ముఖ్య సమాఖ్యలు నోటుమాటకే మప్పితమైనచో పుడమి మంచితనంబది యెల్ల భస్మమౌ!  
నాన్న రుణం

నాన్న రుణం

ఆయన భుజాల మీదకెక్కినపుడు ఆకాశం నా అరచేతికి అందేది అమ్మ నుంచి వేరు పడిన తర్వాత  నేను అతికించుకున్న అపురూప బంధం నా కోసం ఎన్ని కలలు కన్నాడో కాని, నా కలలన్నీ ఆయనే నిజం చేశాడు ఒక పసిగుడ్డుకు లోకాన్ని చూపించి తొలి గురువై బతుకు పాఠాలు నేర్పించాడు అతని వేలు పట్టుకుని నడుస్తుంటే ప్రపంచాన్ని జయించినంతటి గొప్ప అనుభూతి నేనేది అడుగుతానో... కోరుకుంటానో నా కంటి చూపులను అడిగి తన శక్తిని పిడికిళ్లలోనే దాచేసి మరీ  నా అరచేతిలో సమస్తం నింపేవాడు నా లేత పాదాలతో తన దేహాన్ని స్పర్శింపజేసుకున్న సంతోషాన్ని చూడలేదు కాని, తెలిసీ తెలియక నేననే మాటలు తాకిన తన గుండె వేదన చూశాను. ఎప్పటి రుణం అప్పుడే తీర్చుకునే వరం దేవుడు నిజంగా నాకిచ్చి ఉంటే బిడ్డగా తనకొక జన్మనిచ్చి ఆ చిరుపాదాలతో సంతోషంగా గాయపడేవాణ్ని.
నాలో

నాలో

రేపటి కోసం భయపడి గుండె అల్మరాలో నిర్జీవంగా పడి బయటకి రావాల్న వద్దా అన్న ఆలోచన దగ్గరే కొట్టుకుంటున్న వాడిని బయటికి లాగిచూడు ఆత్మవిశ్వాసం అంటే ఏంటో అర్థం అవుతుంది!! నెల చివర కట్టాల్సిన ఇఎమ్‌ఐలకు కట్టుబడి గుండె లోతుల్లో అణచివేయబడ్డ ఆలోచనలని ఒక్కసారి బయటికి తీసి చూడు నువ్వేంటో నీకు పరిచయమవుతుంది!! ఆలోచనల వెనకాల ఉన్న అనుభవాలని కాదు నరనరాల్లో అంతర్లీనమైన నీ కలని అడుగు నువ్వు చూసేది కాదు నువ్వు వెతికేది కనపడుతుంది!! ప్రపంచంతో మాట్లాడే నిన్ను కాదు నీతో మాట్లాడే నిన్ను అడుగు నువ్వు వెతికే సమాధానాన్ని కాదు నువ్వు అడగాల్సిన ప్రశ్నను పరిచయం చేస్తుంది!! నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పే నీ కష్టాల మూటలని కాదు నువ్వు ఎక్కడికి వెళ్లాలో చెప్పే నీ ఆశయాల మాటలను విను బంగారు భవిష్యత్తు ఎంత అందంగా ఉంటుందో వినిపిస్తుంది!! నువ్వు పడుతున్న కష్టాలని చెదిరిన నీ జ్ఞాపకాలని కాదు నువ్వు చేరుకోవాల్సిన సముద్ర తీరాన్ని అడుగు గమనం ఎంత హాయిగా ఉంటుందో అర్థమవుతుంది!! నీ గుండెకైన గాయాలని కాదు నీ గుండె కన్న కలలని స్మరించు నువ్వు కలలు కన్న గమ్యం ఎంత గొప్పగా ఉంటుందో రుజువవుతుంది!
గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

ఆడమనిషికి ఆడదే శత్తురువంట!! నేనంటే మా వదినెమ్మకి కడుప్మంట!! ఒగరి ఆనందము ఇంగొగరి కంట్లో కొరివి కారమంట!! ఆ ‘‘మారి’’ మా ఇంట్లో అడుగు పెడుతూనే... కుర్రదూడల జతలో ఎగురుకొంట, దుముక్కొంట వంకల్లో, సేనుల్లో వయ్యారంగా ఆడుకొంట కాలము గడుపుతావుంటే ఆవు పడ్డకి ముక్కుతాడు బిగదీసి గూటానికి కట్టేసినట్ల, నడుముకు గుదిబండ తగిలించి మూల్లో కుదేసినట్ల- నన్ను ఇంట్నుండి కదలకుండ కట్టుదిట్టం సేశ!! ఏం జేస్తాం??!! గాచారం బాగలేనపుడు గమ్మనుండల్లని - అంగలారుస్తావుంటె; ఆ పొద్దు మట్ట మద్యాన్నము- శక్కదువ్వాని సేతికి తీసుకోని ‘‘ముద్ద ఆరిపోతుంది. తట్లో ఏసుకోని గతుకు! పక్కింటి పాపక్క తావ పేన్లు కుక్కిచ్చుకోనొస్తా’’ అని సరసర్న బయటికెళ్లిపాయ వదినె. తట్టలోకి ముద్దయితే ఏసుకొంటిగానీ - తినబుద్ది కాలేదు! జతగాళ్లతో కలిసి గుంపుగా కూకోని ఒగర్దొగరు గుంజుకోని, రుసిగా ఉండేవి నంజుకోని నగుకొంట, నగిచ్చుకొంట- తిండి తినిందంతా నెనపుకొచ్చె! ‘‘నా కొగదానికి మాత్రమే గురుతుకొస్తే ఏం లాబము? ఎదుటోళ్లకి గూడా ఉండల్ల గదా!!’’ అని నిట్టూరుస్తావుంటే వామిలో మేకపిల్లలు బెదిరినట్లాయ!! ‘‘దొంగ గొడ్లు దూరినట్లుండాయి’’ - అని దొడ్డివాకిలి సరుక్కున తీస్తిని గదా..!! నా కండ్లని నేనే నమ్మబుద్ది కాలేదు! ఆకాశంలో నల్లగా అడ్డమొచ్చిన మబ్బు గోడల్ని దాటుకోని, ‘ఎలుగుల శందమామ’ కలువపూల దగ్గరికి  దడుం నదుమికినట్ల నాకి నాలుగడుగుల దూరంలో నా కలల జతగాడు!! కండ్లనిండా ఆకలి సూపుల కత్తులు నూరు కొంట ఆబగా లగెత్తుకొచ్చిన అడవిదున్న మాదిరీ..!! వాన్ని సూస్తూనే నాకి కాళ్లూసేతులూ ఆడ్లేదు. పున్నమి రాతిరి ఒళ్లంతా యిరగబూసిన మందారం సెట్టు సలిగాలికి కదివేకి శాతగాక  రెమ్మలన్నీ బిగుసుకొని నిలబడినట్లయి, వాని దూకుడుకు బెదిరి ‘అదికాదిదికాదు’ అనే  నా నోటిని వాన్నోటితోనే మెత్తగా మూసిపెట్టి మోపుగట్టెన తీపి సెరకు ననలకట్ట లెక్కన నన్ను గడ్డివామి యనక్కి ఎదురుకు పాయ!! ‘ఇక్కడొద్దు, అక్కడొద్దు’ అని పీకులాడ్తా ఉన్నట్లే - ఎవరో గడ్డిలో దాసిపెట్టిన మామిడి కాయలు బాగా పండబారినట్లుండివి ‘తపతపా’ అని మా ఇద్దరి మద్యాకి సిక్కి పికిలిపాయ!! యచ్చగా ఉండు నా ఒంటికి సల్లగా ఉండే కాయలు తగిలి నరాలు జివ్వుజివ్వున ఆనందరాగం మీటె!! సుక్కలు సుక్కల తీపికాయల రసం నా రెండు పెదాల మీదికి జార్తావుంటే? దప్పికతో ఎండిన నా నోట్లో ఎవరో తడిని బంగారు దారల మాదిరీ పిండినట్లాయ! మా ఒళ్లు - ఒగదాని కొకటి మెత్తుకోని మాగిన పండ్ల గుబాళింపుల్తో నిండిపాయ!!
ఒక సాయం కాలం

ఒక సాయం కాలం

శిశిరంలో ఒక సాయంత్రం చెట్ల నీడల్లో అంతులేని తాత్వికత పక్షులగూళ్లల్లో చింతలేని సాత్వికత ఏటి గలగలల్లో ఎంచలేని మార్మికత అనుకోకుండానే  అనుభూతుల ఉపరితలం మీద అందమైన గులాబీ మొగ్గ తొడుగుతుంది అలవాటుగానే నీతో అడుగులు కలుపుతాను ప్రేమమయమైన చిరుగాలి తోడు వస్తానంటుంది భావమయమైన హృదయకలం నెమలికుంచెలా నిన్ను అన్ని కళ్లతో పలకరిస్తూ ఉంటుంది నీలిమేఘాల తళుకుల్లో అంతులేని తడి పలకరింపులు రాలిపోతున్న ఆకుల గలగలల్లో అవ్యాజమైన ప్రేమ చిలకరింపులు చిగురుల స్వాగతింపుల్లో అనుభవాల రంగరింపులు నిశ్శబ్ద క్షణాల గుసగుసల్లో ఎవరెవరో నడుస్తూ పరిగెత్తుతూ పడిపోతూ, లేచి ఒగరుస్తూ సమయాన్ని ఇంతకంటే గొప్పగా గడపలేమంటూ నిర్లక్ష్యపు నసనసలు బాధపడుతూ భగ్నపడుతూ సొంతంకాని శరీరాలంటారు కనిపించని ఆత్మలమంటారు అంతులేని ఆవేదనంటారు పొంతనలేని మాటలు వింటూంటాను ఈ రుసరుసల్లో నిన్ను మాత్రం అదే ధ్యానంతో అంతే ఆరాధనతో జీవితపు పుటల్లో మరో పుటని ఆసక్తిగా, ఆలోచనగా ఆత్రంగా, ఆప్యాయంగా రాసుకుంటూనే ఉంటాను ఖాళీని నింపుకుంటూనే ఉంటాను
    1234...............................................52
  • Next