కవితలు

క‌న‌బ‌డుట లేదు

క‌న‌బ‌డుట లేదు

కోడం పవన్‌కుమార్‌

కళాక్షేత్రం కథా కమామిషు

కళాక్షేత్రం కథా కమామిషు

కక్కునూరి శ్రీహరి

మోహనం

మోహనం

దాసరాజు రామారావు

అంత‌స్సంగీత స్ర‌వంతి

అంత‌స్సంగీత స్ర‌వంతి

మల్లారెడ్డి మురళీమోహన్‌

కాలం తూనీగ

కాలం తూనీగ

పరమాత్మ

తెలుగు వెలుగు

తెలుగు వెలుగు

ఆవు పాలకన్న, అరిసె పాకము కన్న తీపి గారె కన్న, తేనె కన్న మధురమైన భాష మన మాతృభాషరా తెలుగు భాష చవిని తెలుప తరమె! అన్యభాష యెంత అవసరంబైనను మాతృభాష విలువ మరువరాదు అంతరించనీకు అమ్మ నేర్పిన భాష ఆయువున్న వరకు అవనిలోన! అన్యభాషలేమొ ఆత్మీయమాయెను సొంత భాష పలుక శోష కలిగె వనికి రంగులద్ద వాసంత మెట్లగు కోకిలమ్మ తీపి కూత లేక? తల్లి భాషనేమొ తక్కువని తలచి ఆంగ్ల మాధ్యమమును హత్తుకొనిరి అసలు చదువు కొరకు అనువైనదే భాష? మాతృభాష తప్ప మారు కలదె? కలలు కనెడివేళ, కష్టమొచ్చినపుడు తల్లి భాషలోనె తల్లడిల్లి మరచిపోదువేల మాతృభాషను నీవు పలుకరించినపుడు, పలుకునపుడు? గద్దెనెక్కి పిదప గతమంత మరచిరి తల్లిభాష అమలు తలచరైరి ఉత్తవాయె పూర్వ ఉత్తర్వులన్నియు తెలుగు భాష వెతను తీర్చుటెట్లు? సభలు నిర్వహించి సందేశములు యిచ్చి భాషనుద్ధరింప బాస సేసి ఆచరింప నిపుడు ఆలస్యమేలనో మాట నిలుప వలెను మాన్యులింక! ఉద్యమములు చేసి ఊళ్లన్ని కదలాలి మాతృభాష విలువ మదిని దలచి తెలుగు బతుకవలెను వెలుగులుబంచుచూ పాఠశాలలందు, పలుకులందు! తెలుగు నేర్చి నీవు తెలివినొందుటె కాక ఇంటియందు పలుకు మింపుగాను జనము మెచ్చు నిన్ను జనభాష పలుకగా మనసు తెలుపు భాష మాతృభాష!
జీవం కోల్పోయి..

జీవం కోల్పోయి..

అక్కడి అనుబంధాలు ఆత్మీయతా రాగాన్నే పలికేవి నిరంతర స్నేహ మాధుర్యం ఊరంతా పరిమళమయ్యేది ఏపుగా ఎదిగిన చెట్ల సమూహం ఊరంతా పచ్చని కాన్వాసుని పరిచేది శబ్ద, వాయు కాలుష్యాలు జంటగా అల్లంత దూరాన్నే ఉరిపోసుకునేవి మలినం లేని మనసుల నిండా వెన్నెల పూలు విరబూసేవి పొలాల ఎదిగిన పచ్చని పైర్లు బతుకులకు  భరోసా ఊసులు చెప్పేవి మనుషుల పలకరింపుల్లో మమకారం పొంగుకొచ్చేది పొలిమేర ఛాయల్ని తోసుకొని గ్రామంలో అడుగు పెట్టే పాదాలకి ఊరి కోనేటిలోని ఎర్ర కలువలు స్వాగత స్వరాలను ఆలపించేవి పశుపక్ష్యాదులు మనసార స్వేచ్ఛను ఆలింగనం చేసుకునేవి ఏడాదికోమారు గ్రామదేవత కొలువైన చోట సంబరాల దివిటీలు వెలిగేవి అప్పుడు పల్లె అంటే పచ్చదనాల తోట చలికాలంలో భోగి మంటల వెచ్చదనపు మూట సంక్రాంతి నాటి పిండివంటల గుబాళింపు ఆవు పేడతో అలికిన లోగిలిలో మెరిసే మేలిమి ముగ్గుల జాతర పల్లె అంటే కల్లా కపటం తెలియని అమ్మతనానికి నిలువెత్తు నిజరూపం మరిప్పుడు, పల్లె దారుల నిండా కనిపించని ముళ్ల కంపలు అభివృద్ధిని నెత్తిన మోస్తున్నట్లు పరిశ్రమల శిరస్సుల నుంచి పొంగుకొస్తున్న మృత్యుహరణాల పొగ ఒకరికొకరు కక్ష గట్టి నరుక్కొంటున్న రాజకీయ కుట్రల కత్తుల పొదలు వర్గాల సృష్టిలో విభేదాలను రగిల్చే ధనస్వామ్యపు ఎత్తుల పొత్తులు పల్లె ఇప్పుడు జీవం కోల్పోయి వ్యర్థాలను మోస్తున్న మురుగునీటి కాలువలాగ!
మనసులు విప్పుకున్న క్షణాల్లో...

మనసులు విప్పుకున్న క్షణాల్లో...

ఇద్దరు- మనసులు విప్పుకున్న క్షణాల్లో.. రెండు పూవుల పరిమళం- కానరాని గాలి అలలపై.. చెట్టాపట్టాలేసుకుని వాహ్యాళికి వెళ్లినట్టు! ఇద్దరు- మనసులు విప్పుకున్న క్షణాల్లో.. పసిబిడ్డ ముఖంలోని భావాలంత తేటగా.. అడుగు సైతం కనిపించే రెండు సెలయేళ్లు ఒక్కటిగా సంగమించినట్టు! ఇద్దరు- మనసులు విప్పుకున్న క్షణాల్లో.. ‘దేవుడి’కి సైతం పట్టరాని రెండు మెరుపులు.. తమను తాము ఒక్కటిగా పేనుకుని, పెనవేసుకున్నట్టు! ఇద్దరు- మనసులు విప్పుకున్న క్షణాల్లో.. ఎందుకో, ఎన్నడో, ఎలాగో విచ్ఛిన్నమైన విశ్వం.. రెండు ఏకాకితనాలై, వేగివేగి, వెతికి వెతికి.. పునరేకీకృతమైనట్టు! పుట్టుక పరమార్థం పరిపూర్ణమైనట్టు!
వరదాయిని దివ్య శుభాంగీ

వరదాయిని దివ్య శుభాంగీ

పల్లవి అరుణ కిరణతుల చరణ కమలములె కరుణ నెలవులని నమ్మి     ।।2।। శిరమునుంచితిని సుమ్మి.         వరదాయిని! దివ్య శుభాంగీ శివమోదిని! భవ్య లతాంగీ    ।।2।। చరణం 1  నయన చలనములె భువన భవలయలు నడుమ నటనమది మాది    ।।2।। కడమ ఘటనమది నీది         వరదాయిని! దివ్య శుభాంగీ శివమోదిని! భవ్య లతాంగీ    ।।2।। చరణం 2  ధవళ గిరి పతిని సరస వచనముల సరియు జేయునది నీవే     ।।2।। మురియు జేయునది నీవే         వరదాయిని దివ్య శుభాంగీ శివమోదిని భవ్య లతాంగీ    ।।2।। చరణం 3  హరు మెలంకువకు హరి తలంపునకు విధి విలాసమునకీవే        ।।2।। అధికారిణివై యున్నావే వరదాయిని దివ్య శుభాంగీ శివమోదిని భవ్య లతాంగీ    ।।2।। చరణం 3 కమలలోచనుని అనుఁగు చెల్లెలా కనగలేము నీ లీల        ।।2।। భవుని యింటి యిల్లాలా వరదాయిని దివ్య శుభాంగీ శివమోదిని భవ్య లతాంగీ    ।।2।। చరణం 4 తెలియకబ్బినది తెలివికబ్బినది పద కవిత్వముగ మార్చి    ।।2।।  పాటవోలె చేకూర్చి అందింతునమా! ప్రేమార చేకొందువమా! మనసార ।।2।।    ।।అరుణ।।
రాదనుకున్న వాన

రాదనుకున్న వాన

పొలంలో నిలబడి దిగాలుగా ఎండ తలపైకెత్తి నడినెత్తిన మిగిలున్న ఒక్కగానొక్క ఆశగా ఆకాశం వైపు చూస్తుంటిని భూమిలో కుమ్మరించిన విత్తనాల అరిగోసను తలచుకుంటూ- మబ్బులకావల గల మహాసముద్రాల్ని పాపపుణ్యాలకు అతీతంగా వచ్చి ఒక సాలేటి చినుకుల్ని దుక్కిపై కురిసిపొమ్మని ప్రాధేయపడితిని నెమరువేయడానికి దుమ్ము తప్ప ఇంకేంలేదని ఏడుస్తున్న ఎడ్ల పంటి కింద ఎడారిని చూస్తూ- ఒకప్పుడు గట్టు మీది చెట్ల పైన్నే పక్షులతోపాటు ప్రాణవాయువుగా కాపురం చేసిన వాన బాయి గడ్డ వెనకాలే పోతరాజు గుండు పక్క గుడి కట్టుకున్న వాన- ఒకప్పుడు పొద్దుకోసారి ఉన్నూరికి ఇచ్చినబిడ్డలా చేలవైపునకు గలగలా తొంగి చూసిన వాన పాలకుతి లేసినప్పుడల్లా తల్లి రొమ్మును చేరిపోయే ఆవుదూడలా అవనికి సాగిలపడిన వాన- ఒకప్పుడు వాగుల ముఖాన జలకళనద్ది మహేంద్ర చాపమే మనోరథమై చెరువు మత్తడి దుంకిన వాన మోట దారుల మీంచి గంగ అలుగెల్లి పొలమంతా కంషపిల్లల నీటిసొర్గమైన వాన- ఒకప్పుడు నా గొర్రె గుంపు ఎన్నుమీదనే వెచ్చని జలదరింపై ముసముసా వణికిన వాన ఏరువాక సంబురాలకు ఏరుకు నడక నేర్పించి రైతును కూతేసి రాగాలు తీసిన వాన నరుని వికారాలపై తీవ్రంగా అలిగింది మనిషి అకృత్యాలకు పూర్తిగా అదృశ్యమైంది- కప్ప కాముడు వరదపాశం జడకోలాటమూ వరుణభజనా శ్రావణ బోనం అఖండ జ్యోతి కరిగించలేవు మేఘాల గుండెను ఇక రాదనుకున్న వాన రాజ్యమేలేది ముదాం కరువే కంకాళాలేనని నెల్లాళ్లు నారుమడితో కలిసి దుఃఖాన్ని దిగమింగిన అరకిడిసిన నోట్లెకు మెతుకెట్లరా నరసింహా గొడ్లకు మేతెట్లరా పరమశివా బ్రహ్మదేవుడిట్ల రాసె నా నొసట గీతలను లెక్కించుకుంటూ బాట పట్టిన ఏదిక్కో తెల్వదు- కొండ నమ్మకస్తురాలు గొప్ప వరదాయిని కాస్త ఆల్శెం అయినా జీడికంటి మూల మిలమిలా మెరిసింది కుండపోతను వర్షించింది ఆనందానికి అన్నిగేట్లు తీస్తూ నిండిన నందికొండను ప్రసాదించింది- కర్షకులారా! ఇప్పుడు వరి నాట్లు సరే మన సాగులో రోజుకో మల్క మళ్లీ రావాల్సిన వానలకై పెరగాల్సిన సుందరవనాల కోసం ఆకుపచ్చ కోండ్ర వేద్దాం తలకో పది వృక్షాలై నేలతల్లికి ప్రణమిల్లుదాం.
అకాలం

అకాలం

ఎక్కడినుంచి ఉరుకులు పరుగులతో దొర్లుతూ వచ్చాయి నల్లమేఘాలు ఎక్కడిదీ ముసురు పూలమాలిక మతి భ్రమించిన మత్తేభాలు అవిరైన ఎందరి కన్నీళ్లను అదిమిపెట్టి పొంగే సముద్రాలు ఎప్పటికప్పుడు ఉబికి వస్తున్న ఉద్విగ్న సమయాలను పిడికిట ఒడిసిపట్టుకున్న జలపాతాలు కదులుతున్నట్టే అనిపిస్తుంది చీమంతైనా కదలిక ఉండదు కరుగుతున్నట్టే ఒక విభ్రమ కాస్తంతైనా ద్రవీభవించదు పెదవులు వెక్కిరించే తుంపరగా ఉండీ ఉండీ ఒక చిరుజల్లు ఉన్నట్టుండి ఆకాశగంగ జారిపడినట్టు ఎడతెరిపిలేని కుండపోత అకాలం ఏదోనాటికి సకాలం అవక మానదు కదా ఇదేం వింత! ఇక్కడా అంతే కదా లక్షలాది మందిలో ఒక గుప్పెడు మాత్రమే అణచిపెట్టిన పైరుపంటల మీద అవమానపు నిప్పుల వాన కురిపిస్తారు భరించే అవని హృదయం మీదకు సునామీలను ఉసిగొల్పుతారు రేపంటే మాదేనంటూ నేటి జీవితాలపై దౌర్జన్యం ప్రకటిస్తారు. అధికారాలనెక్కి విజయ శంఖం పూరిస్తారు  ఎంత అనకొండ లాటి దర్పమైనా ఏదో ఒక రోజున విగత జీవిగా పడి ఉండక తప్పదు ఎంత బక్కపలచని జీవికైనా ఎక్కడి నుండో వెయ్యి ఏనుగుల బలం ఉబికి రాదూ
ప్రేమంటే...???

ప్రేమంటే...???

ప్రేమ... తొలి మొలకలా జీవితాన్ని చీల్చుకుని తను పెరిగిందెప్పుడో తెలీదు కానీ ప్రకృతి అణువణువునా ప్రేమ వ్యాపించాలని చెప్పిన చిన్నతనం గుర్తొస్తోందిప్పుడు.. తొలిసారి నాగలి చాలు భూమిని చీల్చుతూ వెళ్తున్నప్పుడు, ఆ నాగేటి చాలు నేలపై ప్రేమ గుర్తు ఆ పగలంతా నక్షత్రాల్ల విత్తులు రాలుతూ నల్ల రేగడి భూమి వాటిని గుట్టుగా దాచుకున్నపుడు  అదే ప్రేమేమోనన్న సందేహాలు గుర్తు వర్షం పడ్డ రాత్రి గడిచి ఉదయానికల్లా మొలకలైనప్పుడు స్నేహం తొలి రంగు అనుకున్న గుర్తు కందిచేల లేత పచ్చదనం  జొన్నచేల గాఢపు గరుకుదనం వేరుశెనగ విత్తుల గుంభనం మినుము పంట మూగతనం అరటి గెలల బోళాతనం చిక్కుడు పాదుల కలుపుగోలుతనం ప్రేమకెన్ని ఛాయా చిత్రాలో... గన్నేరు పూలని తెంపే వేళల్లో నాసికని ముద్దాడే గాఢపు నాటుదనం ఎర్రమందారం ఉదయాన్నే నవ్వితే రెండు జడలకూ కొండంత చల్లదనం వెన్నెల్లో ధగధగా మెరిసిన సన్నజాజులు పూమాలల అల్లికలు నేర్పిన తొలి గురువు నేలని తవ్వి విత్తులు నాటి నీరు పోసి ఆకు ఆకుగా పువ్వు విత్తుగా తోటమాలిగా తొలిపాఠం చిట్టి చేమంతులు పాదులో వెన్నెల్లో కూడా నవ్వే చిట్టి నక్షత్రాలు మట్టి ప్రేమనంతా గుప్పుమనిపించే ఎర్ర గులాబీలు కళ్లల్లో పెట్టుకుని కాపాడుకున్న గుల్‌ మొహర్‌ ఒకటా రెండా ప్రేమకెన్ని సుగంధాల చిరునామాలో పాదు పాదుకూ సరసరా నీరు పారుతుంటే పిచ్చుకల స్నానాల కేరింతల్లో ఎంతటి ప్రేమ.. పూవు పూవు నుంచీ తేనె తాగుతూ తుర్రుమనే పిట్ట ముక్కు వంపునకు సాయంకాలపు రావిచెట్టు ఇల్లయిన పిట్టల కువ కువలకూ ఎన్నెన్ని ఊసులు పంచే ప్రేమో.. పరుగులెత్తే నీటిని పీల్చుకునే మట్టి సుగంధం ముందు ఏ డియోడరెంట్‌ పోటీకి నిలుస్తుందో చెప్పగలవా.. వెన్నెల్లో లిల్లీ పువ్వుల నవ్వులు  ఏ లుంబినీ పార్కు ఇవ్వగలదు కంచెలా వ్యాపించే కాస్మస్‌ పువ్వుల హొయలు ఏ డిజైనరూ సృష్టించడు పెకలించిన వేరునంటిన తడి మట్టి సుగంధం ఇప్పటికీ గుండె నిండా ప్రేమై శ్వాసిస్తోందీ మనిషి మారొచ్చేమో కానీ మట్టి మారదు అందుకే చెబుతున్నా ప్రేమంటే.. ప్రకృతిలా మైమరిచి నవ్వే మట్టి సుగంధమే!
    1234.............................................50
  • Next