కవితలు

క‌న‌బ‌డుట లేదు

క‌న‌బ‌డుట లేదు

కోడం పవన్‌కుమార్‌

కళాక్షేత్రం కథా కమామిషు

కళాక్షేత్రం కథా కమామిషు

కక్కునూరి శ్రీహరి

మోహనం

మోహనం

దాసరాజు రామారావు

అంత‌స్సంగీత స్ర‌వంతి

అంత‌స్సంగీత స్ర‌వంతి

మల్లారెడ్డి మురళీమోహన్‌

కాలం తూనీగ

కాలం తూనీగ

పరమాత్మ

నాన్న లేడు

నాన్న లేడు

పాదాలు ముందుకు కాదు వెనక్కు కదులుతున్నాయి బాల్యం ఒక జ్ఞాపకం....! కళ్లను దారివెంట పరచిన క్షణాలు ఇంకా అలానే ఉన్నాయి ఎక్కడో ఒక శబ్దం.... అన్నీ అయిపోయినట్టే ఉంటుంది అప్పుడే మొదలైనట్టూ ఉంటుంది పదే పదే కలవరించినా ఎవ్వరూ రారు అదేపనిగా కళ్లు తడిచిపోతున్నా తుడిచే చేతులు లేవు అప్పుడు నాన్న ఒక కథానాయకుడు నడిచే నాటకం... కదిలే పద్యం నాన్నలు అందంగా ఉంటారా.....?? వేలు పట్టుకుని నడిపించిన నాన్న వేరే వేషం వేసుకున్నాడు వెలుగుతున్న దీపం రెపరెపలు ఆకాశంలో మెరుపుల విరుపులు నాన్న ఒక ఆట... నాన్న ఒక బాధ్యత అమ్మలు ఎప్పుడూ నాన్న పక్షమే...!! నాన్న రాసిన ప్రేమలేఖలో అమ్మ ఒక అందమైన అక్షరం కాలం చాలా క్రూరమైంది ఏ క్షణాన్నీ కుదురుగా ఉండనివ్వదు అనుభవాలనన్నింటినీ జ్ఞాపకాలను చేసి జీవితాన్ని ఒంటరితనంలోకి నెట్టేస్తుంది ఇంత కాలానికి నాన్న మళ్లీ అక్షరమయ్యాడు ఇప్పుడు ఇది చదవడానికి నాన్న లేడు ఇంతకు ముందు నాన్నను ఇంట్లోనో, ఊళ్లోనో వెతుక్కునే వాళ్లం ఇప్పుడు శ్మశానంలో వెతుకుతున్నాం అక్కడక్కడా పడ్డ ఎముకల్లో వెతుక్కుంటున్నాం ఈ స్పర్శ నాన్నకు తెలుస్తుందా.....?? చితిలో కాలిపోయింది నాన్న దేహం కాదు అక్కడ మిగిలిపోయింది నాన్న ఎముకలు కావు అవి అనుభవాలు.. అవి జ్ఞాపకాలు..... ఇప్పుడు నాన్నలేడు... నాన్న ఒక జ్ఞాపకమై ప్రతి క్షణం అక్షరాలవుతున్నాడు అంతా అయిపోయినట్టే ఉంటుంది మళ్లీ అప్పుడే మొదలైనట్టూ ఉంటుంది.....!!!
దుఃఖితుడి చింత

దుఃఖితుడి చింత

తొలికోడి

తొలికోడి

చుట్టూ సరిహద్దు సైనికుల్లా పహారా కాసే ఎత్తైన కొండలు.... పొగమంచు పరదాలో పొదిగిన మంచిముత్యాల్లా వీధుల్లో మిలమిల మెరిసే                  విద్యుద్దీపాలు...! ఆడీ ఆడీ అలసిపోయి అమ్మ గుండెలమీదే నిశ్చింతగా నిద్దట్లోకి జారుకున్న చంటిపిల్లాడిలా సద్దుమణిగిపోయింది మా ఊరు....! ఉరగొండ పక్కనున్న చెరువులో తామర తంపరల మీది మంచు తుంపరల్ని... బుక్కేద్దామని ఆశగా అంతెత్తెగిరిన చేపపిల్ల చేసే బుడుంగు శబ్దం...!! ఎక్కడో దూరంగా, వినీ వినిపించనంత మంద్రంగా... కీచురాళ్ల జోలపాట పైరగాలి అతి సుతారంగా  వింజామరలు విసురుతుంటే రేపటి సౌభాగ్యాన్ని కలగంటూ ఆదమరచి నిద్రపోతోంది మా ఊరు!!! ఉన్నట్టుండి తొలికోడి ‘‘కొక్కురొక్కో’’ గాఢనిద్దట్లో ఒకింత ఉలికిపాటు..!! మళ్లీ నిశ్శబ్దం ఆవహించి, నిద్రమత్తు ముంచుకొచ్చేలోపు మలికోడి కూతందుకుంది కిచ కిచమంటూ ఉరపిచ్చుకోటి కిటికీ దగ్గరకొచ్చి అలికిడి చేసి తుర్రుమంది ఊరి చావిట్లో మర్రిచెట్టుకి భళ్లున తెల్లారినట్టుంది. కిలకిలరావాలతో పక్షుల పంచరత్న సేవ...! దారి పొడుగునా తారసపడే ఏరువాక లేడికి లేచిందే పరుగన్నట్టు బిలబిలమంటూ పాడి పంటలకు ఉపక్రమించే జనం ఎప్పుడు తెల్లారిందో తెలీదు కొట్టుగదిలో కవ్వం చిలుకుతూ అమ్మ...! లయబద్ధమైన చిలకరింపుల్లో శృతికలిపే గాజుల గలగల... కమ్మని సంగీతమేదో చెవుల్ని కమ్మేసినట్టయింది!! ఆమె గాజుల కింకిణి ముందు తొలికోడి మా అమ్మకెపుడూ పోటీ కాదు వాకిలూడ్చి, కళ్లాపి చల్లి, పిండి ముగ్గేసి ఉషస్సును స్వాగతించే  అమ్మను చూస్తే... మా కోడిపుంజుకీ ఎంత సంబరమో? అమ్మనెవరూ ‘తొలికోడి’ అనరు!
హలాయుధుడు

హలాయుధుడు

ఆకాశం నిండా మబ్బుల వెన్నముద్దలు కమ్ముకొస్తే అవి తనకోసమే వచ్చాయని తెగ సంబురపడిపోతుంటాడు ఉరుములు మెరుపులతో చినుకుల ముత్యాలు రాలుతోంటే రోహిణికార్తె అదును అయ్యిందని చేతులెత్తి మొగులుకు మొక్కుతుంటాడు రోజూ రేకలువారంగనే లేచి నిద్రముఖానికి దోసెడు నీళ్లు కొట్టి చెల్క నలుమూలలా గుంటుకతో దుమ్ముదుమ్మయి కొట్టుకులాడుతుంటాడు సరిగ్గా అంబటి యాళ్లప్పుడు ఆలి తెచ్చిన పిడికెడు మెతుకులు తిని చెట్టునీడన కాసేపు సేదతీరుతూ వర్షాధార పంటల్ని కలగంటుంటాడు తడారిపోయిన తరిపొలానికి గండ్లు మెత్తి కాలువలు తీసి కత్తెర వడ్లకు మడికట్లల్ల బురదనాగలై సాగిపోతుంటాడు పసులకొట్టంలో జోడెడ్లు నెనరుతో తలలూపుతోంటే పలుపులూ- పగ్గాలు తీసుకొని ఎలుగడి నాగలి అంటగడుతుంటాడు రాళ్ల వర్షంలో నేలకు ఒరిగిన వరికంకుల్ని గుండెలకు హత్తుకొని ముందరి కార్తె మంచిగుంటదని భరోసా వరమ్మీద బతుకవుతుంటాడు ఋతువుల రాణి వికృత చేష్టలకు సేద్యం నిండా కరువొచ్చి పడితే దుక్కిటెద్దులా కూడదీసుకొని వలపట - దాపట ఒక్కడై గెలుస్తుంటాడు రేయింబవళ్లు పొలం నిండా తన చెమటపూల పరిమళమద్ది మన్ను పిసికి మన్ను బుక్కుతూ కల్లం నిండా దాన్యం రాశవుతుంటాడు తరతరాలుగా చరిత్రకెక్కని భూమి పుత్రుడి శ్రమ సౌందర్యాన్ని ఏ బాధల గాథలూ పట్టించుకోకున్నా మనిషికి పట్టెడన్నం పెడుతుంటాడు ఇన్నాళ్లూ ఆగమైన రైతు బతుకు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నది సాలుకు ఎకరాకు ఎనిమిది వేలు ప్రభుత్వం పెట్టుబడి బాట పడుతున్నది
తెలుగుభాష సోయగం

తెలుగుభాష సోయగం

సముద్ర గర్భం లోంచి ఎన్ని ముత్యాలను ఏరి రాశిపోస్తే అవి తెలుగు అక్షరాలంత అందంగా ఉంటాయి? ఆకాశం లోంచి ఎన్ని నక్షత్రాలను ప్రోగుచేస్తే అవి తెలుగు పదాలంత తళుకు లీనుతాయి? పృథ్విలోని ఎన్ని సుమగంధాలను సమీకరిస్తే అవి తెలుగు పద్యమంత గుబాళిస్తాయి? ఏ ప్రాచీన భావుకుడి శిల్ప నైపుణ్యమో ఈ తెలుగు అక్షరాలు! ఏ పురాతన రసజ్ఞుడి భావ చిత్రాలో ఈ తెలుగు పదాలు! ఏ చైతన్యకారుడి మహాద్భుత రచనా కౌశలమో ఈ తెలుగు వాక్యాలు! ఎన్ని కోయిలల కుహుకుహు రవాలతో రంజిల్లుతుందో ఈ తెలుగు వనం ఎన్ని రసరమ్య వాక్యాలతో విలసిల్లుతుందో ఈ తెలుగు కవనం ఎన్ని ముత్యాల ముగ్గులతో అలరారుతుందో ఈ తెలుగు సదనం ఎన్ని మాధుర్య రాగాలతో పరవశింపజేస్తోందో ఈ తెలుగు గానం.
మా ఊరి చెరువు

మా ఊరి చెరువు

ఆ రోజుల్లో మా ఊరికి ఆ చెరువే  ఓ బట్టలుతికే యంత్రం వేసవి వచ్చిందంటే ఊళ్లో జనాలకీ, పశువులకీ   అదే పెద్ద ఈత కొలను చెరువు గట్టంతా చలువ పందిళ్లు వేసినట్టు   చిక్కని నీడ పరచిన చింత చెట్లు ఎవరైనా! చుట్టాలొస్తే చెరువుగట్టే   మంచి పర్యటక కేంద్రం గట్టెక్కి చూశామా! ఓ పక్క, ఉత్తరాన   దూరంగా టేకు, మోదుగ, వెదురు వనాలు మరోపక్క ఊళ్లోకెళ్లే దారిలో   జామ, ఉసిరి, కొబ్బరి, మామిడి పళ్లతో వచ్చిపోయేవాళ్లకు విందుకాహ్వానిస్తున్నట్లుండేవి పల్లాల్లో కంటూ చూస్తే  పచ్చలు ప్రవహిస్తున్నట్టు పంట పొలాలు ఎన్ని పక్షులు, ఎన్నెన్ని రకాలు,  గట్టుమీది చింతలపై వాలి అవి చేసే  అల్లరి, శబ్దాలు అంతా ఇంతా కాదు. రోజుకోసారైనా చూడ్డానికి వెళ్లాలనిపించేది చదువుకొనే పిల్లలకి పరీక్షలు దగ్గరికొచ్చాయా   ఇక చెరువు గట్టే చదువుల వేదిక అక్కడి ముత్తాలమ్మ గుడి అందరి కోరికలు ఈడేర్చే అమ్మవొడి ఎందుకో తెలీదుగాని చెరువు లేని ఊరినిగాని ఊరు లేని చెరువునుగాని ఊహించలేం ఆ చెరువే వేసవి విడిది అదే ఆధ్యాత్మిక కేంద్రం అదో ప్రశాంత నిలయం  ఇవన్నీ ఇప్పుడు లేవుగాని ఊరు, పల్లెగానే ఉన్నందుకు  అందులో కొన్ని ఆనవాళ్లయినా మిగిలాయి...
ప్రకృతి పలికిన గీత

ప్రకృతి పలికిన గీత

ప్రకృతిలోని నిశ్శబ్దాన్ని గమనించేవా నేస్తం, ఆ తల్లి నిశ్శబ్దంగా చెప్పే ఊసులెన్నో, కవికి, రవికి చిక్కక ఉర్రూతలూరిస్తూ పదనిస పాడుతూ పరుగులు తీసే సెలయేరులెన్నో, సంద్రపు ఒడ్డున ఎగసి, ఎగసి పడే అలలను గమనించేవా నేస్తం, మనసులోని ఆలోచనల తాకిడిని గుర్తుచేస్తుంది, అదే, నడి సంద్రపు నిశ్శబ్దం మనలోని గాంభీర్యాన్ని తట్టిలేపుతుంది, అద్వైతాన్ని ప్రబోధించే ఆదిశంకరుని రూపుగా భాసించే, ఆ నదీ సంద్రాల సంగమాన్ని చూడవోయ్‌ నేస్తం, ఉహలకందక ఉత్తేజపరిచే దృశ్యాలెన్నో, వినలేదా నువ్వు నేస్తం, కొండలు, కోనలు, పర్వతాలు చేస్తున్న ఆ మహానాదాన్ని ఆకాశమే మన హద్దుగా, సరిహద్దుగా సాగిపొమ్మని, వినలేదా నువ్వు నేస్తం, కారుచీకట్లను చీల్చుకొని ప్రకృతిలోని రంగులకు కొత్త హంగులు గూర్చే ఆ సూర్యుడు చెప్పేది, జీవితాన ఆనందోత్సాహాలే తిమిరసంహారాలని, వినబడలేదా నేస్తం, చల్లనిగాలిలో ఆడుతూ కిలికిలారావాలు చేసే ఆ పైర్లు మగాణిగా మారతాయో మడిసిపోతాయో తెలియక  అమాయకత్వపు అంచుల్లో చిందులేస్తూ చెప్పేది ప్రయత్నమే ప్రతి పనికి ప్రాణప్రదమని విజయ, వైఫల్యాలు విధినిర్ణీతాలని. ఆ తల్లి చెప్పే ప్రతీ అంశం గీతాసారాంశమే ఆ ప్రకృతి నిశ్శబ్దమే నీలకంఠుని స్వరం