కవితలు

మా బడి

మా బడి

గరిమెళ్ళ నాగేశ్వరరావు

తెలుగుదనానికి బాపు

తెలుగుదనానికి బాపు

ఆచార్య గంగిసెట్టి లక్ష్మీనారాయణ

న్యూమరిక్కులు

న్యూమరిక్కులు

రమణ యశస్వి

ఇప్పుడు

ఇప్పుడు

సి.హెచ్‌.మధు

నేను

నేను

దండమూడి శ్రీచరణ్‌

తెలుగు వెలుగు కావాలి

తెలుగు వెలుగు కావాలి

ఏంటీ? ‘ఖ’కి నూకచెల్లిందని ‘క’తో సరిపెడతానంటావా? ‘ఖ’రమును ‘క’రముగా తలచి కళ్లకద్దుకుంటావా? ‘కూ’నిరాగాన్ని ‘ఖూ’ని రాగంగా ఆలపిస్తావా? ఓహో! ‘ఝ’ అసలే మాయమైందా? గిరుల మధ్య ఉరికే సొగసు ‘ఝ’రులు సామాన్య ‘జ’లాలెలా అవుతాయి? తుమ్మెదల ‘ఝుం’కారాన్ని ‘జా’వ కారుస్తావేం? ఆబ్బో! ‘ఠ’ కష్టమట! చిన్నప్పటి నుంచీ నేర్చిన పా‘ఠా’లు ‘ట’పా కట్టేసినట్టేనా? పీ‘ఠా’న్నీ- పీ‘ట’నీ ఒకటిగా ముడేద్దామా? ఇంతకీ రా‘ధ’తో ఎప్పుడూ ట్యాంకుబండేనా? అక్కడ త‘థా’గతుణ్నెప్పుడైనా తలిచావా? అవునూ! నేను ‘రాధ’ అనమంటే నీకు ‘క్రోదం’ ఎందుకు? అవున్లే! ‘రాద’ అని పిలిస్తే నీకేం ‘బాద’ ఆవిడగ్గానీ? ఏంటి? బోడి అ‘ణా’ ఎవడిక్కావాలా? నీ రక్తికి- ఒక ఓ‘ణీ’లో జా‘ణ’ తోడుకావాలేం? నీ భక్తికి- ఒక గ‘ణ’పతిని వేడుకోవాలేం? మీ నాయ‘ణ’ పేరుని నారాయ‘న’ అనేట్టున్నావు అద్సరే! ‘ళ’ ఏం చేసింది? అంత మంగ‘ళ’కరంగా ఉంటే? ‘కళ్ళన్నా’, ‘కల్లన్నా’ నీకు తేడావొద్దా? మింగేయ్‌! అమంగ‘లా’న్ని తిమింగలంగా! ష్‌! ఆగక్కడ! ఆఅమ్మాయ్‌ తన పేరేదో చెప్తోంది! ‘‘నా పేరు ‘షా’న్టి కాదు... షైలజ!’’ శభాష్‌ తల్లీ! నాకు ‘షై’గా ఉంది నీ భాషతో! ‘ష’నివారం తలకి ‘శాం’పూ వేసుకోవాలి - వెళ్ళొస్తా! ఇంతకీ నా సణుగుడేమిటి అంటావా? చిత్తం! రాసేదేదో ‘హా’యిహాయిగా రాసుకుందామంటున్నా! అక్షరాన్ని దీక్షగా సాక్షాత్కరింపజేద్దామంటున్నా! చెప్పింది తప్పైతే ‘క్ష’మించండి. ఓహో! బండి‘ఱ’ని చెఱవిడిపిస్తావేం? ‘చెఱకు’ తీపినీ గజ్జెల గు‘ఱ్ఱా’న్నీ ఎలా వదలబుద్ధైంది? నీ ‘స్పోకెన్‌’ తెలుగులో నేను ‘పోక్‌’ చెయ్యన్‌ గానీ- రాతలో ‘తెలుగు వెలుగు’ కావాలి తమ్ముడూ! ‘తెలుగు వెలుగై’ ప్రకాశించాలి చెల్లీ!
మా బడి

మా బడి

ఇన్నాళ్ల తరువాత మళ్లీ బడిని చూస్తూ... మురిసిపోయిన నా మనసు యూనిఫాం తొడుక్కుంది. బడిముందిలా నిలబడి కాలం కళ్లలోకి తొంగిచూస్తూ... గతాన్ని నోటు పుస్తకంలోని పేజీల్లా వెనక్కి తిప్పుకున్నాను... మదిని మడతపెట్టి... కాగితపు రాకెట్‌లా మార్చి గురిచూసి బడిగోడల మధ్యకి విసురుకున్నాను. నాకు తెలీకుండానే బడికి... గుండెల్లో కట్టుకున్నట్టున్నానొక బంగారు గుడిని. గర్భగుడిలో ఘడియకో రూపాన్ని మార్చే మూలవిరాట్టులా... హృదిలో కదులుతోన్న గురుదేవుళ్లు. స్తుతించడం మొదలుపెడితే... అయిపోతుంది అష్టోత్తరం. చేతులెత్తి నమస్కరించినందుకే... చక్కని జీవితాన్ని ప్రసాదించిన దేవాలయం ఇది. బడి, నా బాల్యానికి గుర్తుగా మిగిలిన మినీ తాజ్‌మహలే! ఆటపాటలలో మునిగి తేలినప్పుడు అంతగా అర్థమవలేదు గానీ ఆటుపోట్లనెదుర్కొనేందుకు రాటుదేల్చిన బాట ఇదే. కలసిమెలసి తిరిగినప్పుడు అనుకోలేదు గానీ... సహజీవనాన్ని నేర్పిన సహజ జీవన వనం ఇది. ఈ నల్లబల్ల సాక్షాత్తూ... సారవంతమైన చదువుల పంట పండించిన నల్లరేగడి నేలే! ఇక్కడ నాటిన విత్తనాలే కద ఇప్పటికీ... గుండె లోతుల్లో వటవృక్షాలై శాఖోపశాఖలుగా విస్తరిస్తోన్నది. ఈ బడిగోడల మధ్యన మరోసారి కూర్చొని... మౌనంగా గతాన్ని పాఠంలా మళ్లీమళ్లీ చదువుకుంటాను... తప్పులని దిద్దుకుని... తలెత్తుకు మనిషిలా... మళ్లీ... నడక మొదలుపెడతాను! మిమ్మల్ని మీరు మార్చుకోవాలని అనుకుంటే... మిత్రులారా... ఒక్కసారి మీ బడికి వెళ్లిరండి.
గమ్యాన్ని చేరాలి

గమ్యాన్ని చేరాలి

చెప్పలేని బాధ, చూడలేని వ్యథ ఎదంతా ఒకటే రొద  నా గమ్యాన్ని చీకటి మింగేసింది నిరుత్సాహం నరనరాన్నీ వణికిస్తోంది ఆకాశంలోకి పక్షములతో ఎగరాలనుకున్న మనసు నేల మీదే ఆగిపోయింది నాలుగు గోడల మధ్య నలిగిపోయింది చాలా అలసిపోయింది చీకటిని చీల్చే వెలుగు కోసం వేవేల నయనాలతో ఎదురు చూస్తోంది చీకటి పొరలతో కప్పబడిన నా గమ్యాన్ని ఇంకా  వెతుకుతూనే ఉంది నిస్సత్తువ నిందించిన, సంకెళ్ళతో బంధించిన ఇంకా వెతుకుతూనే ఉంది చీకటి కోరల్లో చిక్కుకున్న నా గమ్యం కోసం లోలోపల కుమిలిపోతున్నది గాని ఆగిపోవట్లేదు అదిరి పడింది, బెదిరి పడింది, చెదరి పడింది చాలా సార్లు పడుతూ లేస్తూనే ఉంది. చీకటిని ఛేదించి, వెలుగుని సాధించి, గమ్యాన్ని హత్తుకోవాలని కెరటాల లాగే  పడినా లేస్తూనే ఉంది మనస్సు. 
వాన ఊరేగింపు

వాన ఊరేగింపు

మేఘం రాగమైతే ఉరుము ఉత్సవమైతే మెరుపు పుంజాలు పూ లతలైతే తూనీగ బృందాలు పొలిమేరలో మోహరిస్తే వాన ఊరేగింపుగా మాఊరొచ్చింది  చినుకు పూల పావడాలో వానజల్లు ఓణి వేసుకొని ఊరు కన్నెపిల్లయిపోయింది గుడిసె తడిసిన పావురమైంది చూరులన్ని చిత్ర గీతాలు పాడుతున్నాయి అరుగులన్నీ తుంపర్ల వజ్ర తునకలతో మెరుస్తున్నాయి వానొచ్చి వాకిట్లో నీటి ముగ్గేసింది పల్లెపడుచు కన్నుల్లో కోర్కెల సిగ్గు లేపింది వీధులన్నీ నదులైనాయి పాత పుస్తకం పడవై తేలింది చిన్నపిల్లాడు చేపపిల్లాడయ్యాడు. దండెం మీద బట్టలు చెదిరి.. చేతిలో గాలిపటాలైనాయి నీళ్ళోసుకున్న చెరువు నిండు చూలాలైంది రైతు చేతులు చినుకులను చేరదీస్తున్నాయి ఆశల నారుమళ్లకు నీరు పోస్తున్నాయి ఇలా.. వాన ఊరంతా ఊరేగింది ఊరి జనం జ్ఞాపకాల్లో హర్షంగా మిగిలింది.
నేను-అరిషడ్వ‌ర్గాలు

నేను-అరిషడ్వ‌ర్గాలు

నన్ను కోపం హెచ్చరించింది, నేేను పెచ్చరిల్లితే నిన్ను దహిస్తాను కామం వణికించింది నేను పూనితే నీ పరువు తీస్తాను దురాశ భయపెట్టింది నాతో సాగితే నీకు దక్కేది దుఃఖం అసూయ అదిరించింది నాతో చెంత నీకో పెద్ద చింత మోహం మందలించింది నా మీద మోజు నిన్ను నలుపుతుంది రోజూ గర్వం గడగడలాడించింది నేను నెత్తికెక్కితే నిన్ను కిందకి తొక్కుతాను  అయ్యో బాధ! ఎంత బాధ!! నన్ను భయపెట్టడానికి, హెచ్చరించ‌డానికి, బెదిరించడానికి, అదిరించడానికి అసలు వీళ్ళెవరూ! అనే బాధ!!! పోరాటం! ఎంత పోరాటం!! కోపాలు, తాపాలు, శోకాలు, మోహాలు, వీటినుంచి తప్పించుకోవడానికి ఎంత పోరాటం!!! ఆరాటం! ఎంత ఆరాటం!! నన్ను నేను తెలుసుకోవడానికి ఎంత ఆరాటం!!! ఆ ఆరాటం అంతులేని ఆవేదనగా మారి నిస్సహాయంగా నిరీక్షిస్తున్న క్షణంలో అంతరంగ లోతుల్లో.. అకస్మాత్తుగా అవతరించింది ఒక అద్భుతం అది, నాకు తెలిసిన నన్ను  నిన్నటిలో కలిపేసిన నిముషం నాకే తెలియని నన్ను  నూతనంగా నిలబెట్టిన నవ్యోదయం ఆ నిముషం తర్వాత నాకు అర్థ‌మైంది ఈ అవలక్షణాలు ఆకాశంలో కదిలిపోయే మబ్బులైతే నేను మాత్రం ఆ మబ్బులని నిర్మలంగా,  నిబ్బరంగా పైనుంచి చూసే ఆకాశాన్ని ఈ దుర్బుద్ధులు మనసుని దర్శించే సందర్శకులైతే నేను మాత్రం ఆ మనసుని ఉత్తేజపరిచే  నిత్య చైతన్యాన్ని ఈ అరిషడ్వ‌ర్గాలు ఊపిరితో పాటు ఊడిపోయే ఉలిపిరిలైతే నేను మాత్రం అంతం లేని అనంతాన్ని శబ్దం సమసిన నిశ్శబ్దాన్ని
బాల్య‌పు సంక్రాంతి

బాల్య‌పు సంక్రాంతి

గుర్తొస్తే బాల్యపు సంక్రాంతి వర్తమానం అవుతుందొక భ్రాంతి తలపోస్తే బాల్యపు సంక్రాంతి, మనసంతా ఓ నూతన క్రాంతి. సామూహిక భోగిమంటల వేడుక అదో అపురూపమైన వాడుక ఊళ్లన్నీ, వీధులన్నీ, జనంతో.. తెలికిరణ జాడలు తూర్పున పొడమే వరకూ. భోగి సందెమ్మకు తూర్పున వేగు పొడిచే వరకూ. ఉదయాన్నే తెలుగిళ్లల్లో చెరకు పొంగలితో భోగి పొంగిపోయేది. పులిహోర, పరమాన్నంతో సంక్రాంతి పరవశించేది. ‘కనుమన తినాలి మినుము’ అని నానమ్మ గారెలొండేది. ముగ్గుముత్యాలతో వీధిమురిసేది. ఆ పల్లె పట్టుకొమ్మల్లో శుభక్రాంతి వెల్లివిరిసేది. దూరంనుంచీ బంతుల తోటన రంగుల చాళ్లు లెక్కించే బాల్యం  మల్లెగులాబీ తోటల్లో చొరి సువాసనలాఘ్రాణించిన వైనం పిల్లలమంతా ఒక దరిచేరి వీరి... వీరీ.. గుమ్మడులాడీ... రంగుల గురిగింజలేరీ ఏరీ, చెరకుతోపులో దాగుడు మూతలు చెరకుల తడికి ఆరని మూతులు చెరువు గట్టున ఆడిన ఆటలు గాలికి ఊదిన జమ్ము కంకులు నీటిపై తూనీగ బారులు అందీఅందని నల్లబాతులు తెల్ల గులాబీ రంగుల కలువలు కోయడానికై అలసిన తనువులు పావులూరు, నాగళ్లల్లోన సంకురాత్రి తిరునాళ్లల్లోన చెక్కగుఱ్ఱమూ.. చక్కెర చిలకలు బందరు మిఠాయి.. బూందీలడ్డూ.. జడకోలాటం, తప్పెటగుండ్లూ.., నల్లని చెరకులు, మలెల్ల చెండ్లూ.., జాతి సమైక్యతకద్దం పట్టిన మన తెలుగింటి ఎద్దుల తీరు, పోటీల కోసం దారుఢ్యంతో.. బారులు తీరిన గిత్తల జోరు గుర్తొస్తే, బాల్యపు సంక్రాంతి,... మనసంతా.... ఒక నూతన క్రాంతి.
స్వాగ‌త గీతిక‌

స్వాగ‌త గీతిక‌

రాయంచల బారులు రంగ వల్లులై ముంగిట నిలచెనాయనుచు తోచెను  ముగ్గులు మనోజ్ఞ కళా విలాసముతో సంక్రాంతి లక్ష్మికి స్వాగత గీతి పలుకగన్‌! ఎర్రచెంగల్వ కెరటాలు దాటి వచ్చె మెట్ట తామర గుట్టుగా వచ్చిచేరె పచ్చ చామంతి పొత్తిలి వీడెననగా మెరయుచున్నవి ముగ్గులు ముంగిళ్లలోన సంక్రాంతి లక్ష్మికి స్వాగతగీతి పలుకగన్‌! మంచి ముత్యాలు చేజారి చెదరినట్టు పాల సంద్రపుటల ఇలపైకి ఎగసినట్టు చంద్రకాంత శిల చిదిమి అలదినట్టు మెరయుచున్నవి ముగ్గులు ముంగిళ్లలోన సంక్రాంతి లక్ష్మికి స్వాగతగీతి పలుకగన్‌! సంజకెంజాయను రంగరించి హరితవర్ణంపు పర్ణముల నమరికగనద్ది వెండి వెన్నెల జాలు వేడుకగ కొసరి ముద్దుగుమ్మలు ముగ్గులు వేసినారేమో సంక్రాంతి లక్ష్మికి స్వాగతగీతి పలుకగన్‌!
జీవన రాగం

జీవన రాగం

పైరగాలి పాటలతో పులకించే గిరులు..తుళ్లిపడి నవ్వే తరుల రాగాలు వింటూ నా ఉదయాలు మేలుకునేవి హృది కిటికీల నుంచీ  వలపు వాన ఒలిపిరి రాగం నా నిశ్చలతను నీరవ ఏకాంతాన్ని భగ్నం చేసేది రోలు రోకలిని శృతి చేసి వడ్లను బియ్యపు రూపాంతరం కావిస్తూ అమ్మ వేసే దరువులు ఆకలి పొట్టను ఆప్యాయంగా తడిమేవి ఏ సాయంకాలమో... సాగర సాంగత్యంలో వినిపించే సరిగమలు అలుపెరగకుండా పాడే అలల సడులు నా అంతరంగ తీరాన్ని తాకేవి జీవప్రపంచంలో ఆకలి కేకలదో రాగం.. ఆక్రందనలదో రాగం శ్రమ జీవితాల అడుగడుగునా.. అరుదైన రాగాలు దేహపు చెట్ల కొమ్మల రేమ్మల గుబుర్లలో గుండె కోయిల పాడే లయ తప్పని జీవన రాగాలే.. అసలైన సంగీత సౌరభాలు
    1234....................................................57
  • Next