కవితలు

క‌న‌బ‌డుట లేదు

క‌న‌బ‌డుట లేదు

కోడం పవన్‌కుమార్‌

కళాక్షేత్రం కథా కమామిషు

కళాక్షేత్రం కథా కమామిషు

కక్కునూరి శ్రీహరి

మోహనం

మోహనం

దాసరాజు రామారావు

అంత‌స్సంగీత స్ర‌వంతి

అంత‌స్సంగీత స్ర‌వంతి

మల్లారెడ్డి మురళీమోహన్‌

కాలం తూనీగ

కాలం తూనీగ

పరమాత్మ

వెంటాడుతున్న అజ్ఞాత స్పర్శ

వెంటాడుతున్న అజ్ఞాత స్పర్శ

తెలిసీ తెలియని పొగమంచు భావనలోంచి ఆమె నా వైపు నడిచొచ్చింది ఆమె తలలోని పూలపరిమళం నన్ను చేరకముందే నేనామెను మనసు నిండా నింపుకున్నాను నన్ను నేను ప్రశ్నించుకున్నాను- ‘‘ఎవరీమె? ఏమిటీ చూపులు? ఏమిటీ పూలూ?’’- అని! నా పక్కనే కూర్చుని ఆమె ‘‘ఇది నీ కోసం, నేను నీ కోసం’’ - అంటూ పువ్వు తర్వాత పువ్వు నా ఒళ్లంతా కప్పేసింది ఆ చల్లని పూల స్పర్శ, ఆ మెత్తనిబాధ గింగురుమంటున్న ఆ మాటలు రక్తంలో ఒక కొత్త ఉత్సాహం.. ఎప్పుడూ లేని అనుభవం... ‘‘మరి నువ్వు ఓ ఆగంతుకురాలివి అపరిచిత వ్యక్తివి... ఏమిటీ ప్రేమ?’’ భావోద్వేగంతో నా కన్నీళ్లు కణతలు దాటిపొయ్యాయి ‘‘అపరిచిత వ్యక్తినా? కాదు - పొరబడుతున్నావ్‌ నువ్వు పుట్టినప్పటి నుంచే నేను నీ దానిని నీ పుట్టుక కోసమే నేను ఎదురు చూశాను ఈ బంధం జన్మ జన్మలది’’ అంది. ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాను చిక్కని పొగమంచు తొలగిపోయింది పొగమంచుతో పాటు ఆమె... ఆమెతో పాటు పరిమళం... అప్పటి నుంచి నేను ఒంటరిని కాను! కనిపించని ఆమెను తలమీద మోస్తూ తిరుగుతున్నాను. ‘‘హమ్మయ్య! ఈరోజుకి బతికిపొయ్యాను’’ అని ఏరోజుకారోజు  ఊ...పి...రి... పీల్చుకుంటున్నాను!!
మనిషంటే..!

మనిషంటే..!

నేను  మనిషిని వెతుకుతున్నాను ఓ మంచి మనిషి దాగున్నాడేమోనని వెతుకుతున్నాను ఎద పన్నీటి ఊటలూరే మనిషి కోసం మచ్చలేని మెచ్చతగని మనిషి కోసం చూస్తున్నాను నిజానికి నా వాసం మనుషుల మధ్యే నా చుట్టూ మనుషులే కానీ ఏదో వెలితి ఎప్పుడూ పరుగులు పెడుతున్న మానవ ముసుగులు మాత్రమే నే చూస్తున్నది అందుకే, మనిషిని వెతుకుతున్నాను కాలగతిలో కరగని కర్మణుడి కోసం కారుణ్య నిర్మలుడి కోసం సెలయేటి స్వచ్ఛతలున్న మనిషి కోసం వెతుకుతున్నాన్నేను మనుసులో లోతులు స్పృశించే మిన్న తలపులున్న వాని కోసం  అచ్చమైన తృప్తి ఉన్న వాని కోసం నే వెతుకుతున్నాను మనిషంటే... చదువు డబ్బు హోదా కాదు ఆసరా అయి భుజం తట్టేవాడు ప్రజల నాల్కల మీద నడయాడేవాడు మనిషంటే.
భాష లెన్నయినను బ్రతికించవలె...

భాష లెన్నయినను బ్రతికించవలె...

భాష లెన్నయినను బ్రతికించవలె గాని     చావరాదవి మన చర్యచేత ఉమ్మనీరు భాష ఉగ్గుపాల భాష వృద్ధినిచ్చు భాష ఇంటి భాషె మాతృభాషలోనె మనిషితానెదుగును విషయజ్ఞాన మబ్బు విపులముగను అన్య భాషె - నేర్వ ఆత్మవిశ్వాసంబు సంస్కృతీ విలువలు సన్నగిల్లు చిన్న కలముపోటు చిదిమేసె భాషను తెలియని తనమొకటి తెలివిహెచ్చి తప్పుడు పనియంటు చెప్పు ధైర్యంలేక చేష్టలుడిగె జాతి చేవ చచ్చి భేషజాలు వీడి పేరు నాశింపక  భాష బాగుకోరి బతుకులీడ్చు వారివలనె భాష భావినందున నిల్చు వినుడు రాము మాట విజ్ఞులార కండువాలు దాల్చి కబురులాడెడివారు ప్రాపకమ్ము కొరకు ప్రాకులాడు వారివలనె భాష బ్రతుకునన్నది భ్రమ వినుడు మంచిమాట విజ్ఞులార
యవ్వనం నింపిన వర్షం!

యవ్వనం నింపిన వర్షం!

వానాకాలం ఆవిరవుతుంటే దిగులు మేఘం కమ్ముకుంది నింగి కన్ను తెరిస్తే నేల పచ్చని సామ్రాజ్యాన్ని రాసిచ్చింది! పరిగెత్తుతున్న నదీ నదాలమధ్య భూతల్లి స్వయంభూ బతుకమ్మయింది! మట్టి వాసనకు మైమరచిన సమస్త జీవరాశులు చైతన్య దీపాలై ఊరేగింపులు తీస్తున్నాయి మట్టికి ఆకాశానికి మధ్య విచ్చుకున్న సప్త వర్ణాల సింగిడి తెగిపోని వారసత్వ వంతెన నిర్మించింది! ఊరకే భయపడతాంగాని వానలో పిల్లలు తడిసొస్తుంటే వరుణదేవునికి కృతజ్ఞతలు చెబుతున్నట్లుంటది నిండు వర్షంలో నే నడిచొస్తుంటే నా చెప్పొకటి తెగిపోయింది రెండోదాన్ని పడవని చేసి వదిలేశా వర్షం పోతూ పోతూ నాలో కొంచెం యవ్వనాన్ని నింపి పోయింది!
మామిండ్ల కాలం

మామిండ్ల కాలం

ఎన్ని కాలాల తీపి రుచులో ఎన్నెన్ని కాలాల్ని ముంచెత్తిన తీపి రసాప్లావితాలో ఏ చెట్ట‌యినా అదే పేరు ఒక్కొక్క పండుకు తీరొక్క పలుకు శెంబు మామిడి పప్పుగుండి అంత నల్ల మామిడి తీపుల కెల్ల రారాజు సదాంకాయ నాము నాము అదెప్పుడు పండవగా చూడలే ఉపయోగపడని దేనికైనా ఉనికేలనో అనిపిస్తది దాన్ని చూసినప్పుడు జీడికాయ ఆవకు ఫస్ట్‌ పీసు కడక్‌ అల్లం మామిడిది నిండు చంద్రుని పోలికే తరుగుడు తొక్కుకు కండ గల్గిన కాయల చెట్లు మస్తే కోతిమూతి కాయకు మొదట ఎరుపు, పేరనుకుంట పడి పడి నవ్వేది పండిందో, తేనెసొంటి రసం ఖర్జూర మామిడి అంటం, తోలు పలుచగ, రసం జాంబెడు ఇస్కూల్లకు తాతీల్లనే తీపి మాటతో మూడు మైళ్ల తీయని తోటకు దౌడు రాలిన పాటువండ్లకై పడిన ఇక్మత్తులు అన్నా యిన్నా!  పోయేటపుడు మాత్రం వచ్చినోళ్ల సంచులు నిండువడాలె పటేల్‌ కర్నాల తోట కలెగలిసిన, కలెతిరిగిన చోటు అరవై చెట్ల భువన లోగిలి అత్మీయబంధాల హృదయవాసిలి ఎవలు నాటిండ్రో ఏమనుకొని పెంచిండ్రో ఎవలు తిన్నా సల్లవడేది వాండ్ల కండ్లే గాలికో వానకో అంతపెద్ద తోట ఉండేదేనా? పండేదేనా? కావలీ, నిగిరానీ ఒక చెట్టు లాంటి మనిషిదే అన్ని చెట్ల జాతకం నాల్క మీద దస్తూరే మేం నిర్రందే, మామిండ్లన్ని నిర్రందే ఆ యమ కంటిచూపు వైశాల్యంలో కోవులున్న చెట్టుకు కాయలు తెంపడం ఒక యుద్ధకళ ఒంటికి బూడిద, పొడుగు ధాతి కట్టె కాయ చెదరకుండ కింద జనుపతట్టు అడ్డు తేనె పూసిన, విరబూసిన చెట్లో రెండో మూడో పూసేవి, కాసేవి కావు సూర్యకాంతిల ఆకుల సొగసు చూస్తుంటే కంటికి రెప్ప ఆనేది కాదు మూణ్నెల్లకాలం మా ఇండ్లల్ల, వాడల్ల మామిడిపండ్ల వాసనే ఎవలొచ్చినా చేతిల పండే రుచుల థీసిస్‌ గణుతి కెక్కాక భోజనంలో మామిడిపండు పెట్టే మనిషి ఏడి? ఊరు కటీఫ్‌ అయింది తోట కటాఫ్‌ అయింది చేదెక్కిన యాల్లల్ల ఆ పండుని తలచుకుంట నోట్లో నీళ్లూరుతయి అవి తీపవుతయి
ఊహల వాన...

ఊహల వాన...

అప్పుడప్పుడు ఇల్లు... ఇరుకైపోతే బాగుండు కదూ! అందరం ఒకచోట చేరి ఊసులు పంచుకోవచ్చు. ప్రపంచం నిశ్శబ్దమైపోతే బాగుండు కదూ! హృదయాంతరాళంలో భావం వినిపించుకోవచ్చు. యంత్రాలు స్తంభించిపోతే బాగుంటుంది కదూ! మనలోని మనిషిని మేల్కొల్పవచ్చు. మానవతా విలువల్ని పెంచుకోవచ్చు. ఆకాశం అంధకారం అయిపోతే  బాగుంటుంది కదూ! నక్షత్రాలను లెక్కపెట్టే అమాయక ఆనంద రోజుల్ని మళ్లీ నెమరేసుకోవచ్చు ఓడిపోతే బాగుంటుంది కదూ! ఓటమిలో కూడా మలుపుందని ఓటమి గెలుపునకు పునాదని తెలుసుకోవచ్చు అప్పుడప్పుడూ నువ్వు నేనూ చెరోవైపు ఆలోచిస్తే  బాగుంటుంది కదూ! కొత్తగాలితో మన మెదళ్ల బూజును దులిపేసుకోవచ్చు. పక్షులన్నీ గూటికి చేరుకుంటే బాగుంటుంది కదూ! మళ్లీ గూడు కళకళలాడుతుంది,  సంతోషాన్ని ఇక్కడే చూసుకోవచ్చు. రైతే రాజైపోతే బాగుంటుంది కదూ! అందరి కడుపు నిండిపోతుంది. ఆకలనే పదాన్ని నిఘంటువు నుంచి తీసివేయవచ్చు. ఈ సమాజాన్నీ పునాదులను, విలువల్ని కలిపి పునర్నిర్మించుకుంటే బాగుంటుందికదూ! విదేశీ వ్యామోహాల జాడ్యాల నుంచి బయటపడవచ్చు. ఊహలన్నీ సీతాకోకచిలుకలై  మనమీద వాలిపోతే ఎంత బాగుంటుందోకదూ! లోకమంతా... నందనవనమై... మనమేమో వాటితో పూలవానలో తడిసిపోతాము. అంతకుమించి ఆనందం ఈ ప్రపంచంలో  ఉండదని రుజువు చేయవచ్చు కదూ!
రాత్రి కురిసిన వర్షం

రాత్రి కురిసిన వర్షం

రాత్రి కురిసిన వర్షానికి, అవని హిమవశ్శీతల తుషార శ్వేతధారల్లో అభ్యంగన స్నానమాడి, కురులుముడిచి, హరితవస్త్రం, చుట్టుకున్నట్లుంది. సిరులు పండించే సస్యశ్యామల క్షేత్రంగా గగనమందించిన ప్రియరాగాన్ని ప్రేమతో సాంతం అనుభూతిస్తున్నట్లుగా ఉంది. భాషకందని, భావగర్భిత ముగ్ధై హరితపల్లవి, అంకురానికై వేచి, మౌనమై తియ్యని అనుభూతుల ఆనందం తలబోసుకున్నట్లుంది. పరవశాన పవళించిన ధాత్రి చరాచర ప్రాణకోటి జగత్తుకు క్షీరధారలందించి, ధన్యతపొందినట్లుంది. చల్లగా, మెత్తగా, అమ్మ మనసులా ఒడిచాచి వాత్సల్యంతో, క్షమా, సహనాలతో అక్కున చేర్చుకునే తల్లిలా ఉంది. మట్టి పరిమళాలను మనసారా ఆఘ్రాణించిన వర్షం తనకు తాను త్యాగమై ధాత్రిలో ఏకమై తదాత్మ్యం పొందినట్లుంది.
ఆత్మ విమర్శ

ఆత్మ విమర్శ

చాన్నాళ్లైంది కదూ... ఆ పుస్తకపు పుటలు తిరగేసి.. అసలు తెరవనేలేదా..! నిన్ను నువ్వు ప్రత్యేక ముద్ర వేసిన వస్త్రాలతోనో పట్టు పీతాంబరాలతోనో కప్పేసుకుంటూ నువ్వు కాని నువ్వవుతూ అదే నువ్వని నీకు నువ్వు నచ్చచెప్పుకుంటున్నావు! నిన్ను నువ్వు తెలుసుకునేందుకు మాయతోనూ అహంకారంతోనూ కప్పిన శరీరపు పొరలను తొలగిస్తూ వెళ్లి... నీకు నువ్వే అయిన నీలోకి ఓసారి తొంగి చూడు... అక్కడ నీ తప్పొప్పులను తూకం వేసేందుకని ఓ తక్కెడ తయారుగా ఉంటుంది! నువ్వనుకుంటుంటావు నేను ఏ మాత్రం బురదంటని తామరనని... ఏమో ఆ చివర కొంచెం బురదంటి ఉండవచ్చు... మరో చివర చీడపట్టి ఉండవచ్చు... ఇకనైనా నువ్వు బాకీ పడిన భావాలను వెలిబుచ్చేందుకు... పొరపొచ్చాలు లేకుండా కొన్ని ధన్యవాదపు పుష్పగుచ్ఛాలను,  కొన్ని క్షమాపణల గులాబీలను నీ హృదయపు సంచీలో వేసుకో... ఎక్కడ ఏది అవసరమో గ్రహిస్తూ... ఒక్కోటీ ఇస్తూ నిన్ను నువ్వు తేలిక చేసుకో....! అప్పుడు నీ మనసు విహంగమై నింగి అంచులను తాకుతుంది! అప్పుడప్పుడూ నీ ఆత్మను పలకరించడం  గుర్తుంచుకో మరి!
షరతులు వర్తిస్తాయి...

షరతులు వర్తిస్తాయి...

ఎపిసోడ్‌ అయిపోయింది టీ.వీ.ని పొడిబట్టతో శుభ్రంగా తుడవండి అది కన్నీళ్లతో తడిసిపోయింది. నాయకుడు మాట్లాడేశాడు సభనుంచి జనం వెనుదిరిగారు మైక్‌ చెవుల్లోని దూది తీసేయండి. సినిమా మొదలైంది ప్రేక్షకుల జవసత్వాలు ఉడిగిపోతున్నాయి రీళ్లన్నీ వారసత్వాల కంపుకొడుతున్నాయి. రోడ్లు వాహనాలను ఈనుతున్నాయి వాహనాలు ఇంధనాన్ని తాగుతున్నాయి పెట్రోలు పంపులకు సెలైన్‌ ఎక్కించండి. మాటలతో పాటు స్మార్ట్‌ పనులు ఎక్కువైనాయి అయ్యో! దానికి రేడియేషన్‌ తలనొప్పి ఎక్కువవుతోంది మొబైల్‌ ఫోన్‌కెవరైనా జండుబామ్‌ పట్టించండి. కోరుకోవడం ఆగిపోయింది అర్చనాభిషేకాలు పూర్తయ్యాయి దేవుణ్ని శుభ్రంగా కడగండి సాఫ్ట్‌వేర్‌ నేర్చుకొని మనిషి హార్డ్‌వేర్‌ అయ్యాడు హార్ట్‌ను వేరుచేసుకొని హార్ట్‌లేనివాడయ్యాడు కంప్యూటర్‌కి మానవత్వమనే ఓ.యస్‌.ను లోడ్‌చేయండి వేసవిలో ఏసీల తలలు మాడిపోతున్నాయి మనల్ని చల్లబరిచే పనిలో చచ్చుబడ్డాయి విసనకర్రతో విసరండి అవి సేదతీరుతాయి నదుల్లో నీరెండిపోయి కన్నీరు మిగిలింది పవర్‌గ్రిడ్లు గుడ్లు తేలేస్తున్నాయి పవర్‌ ప్లాంట్లకు ఇన్వర్టర్లు బిగించండి! రాజకీయాల్లో నెంబర్‌వన్‌ కోసం పోటీ ఎక్కువైంది డాబు, దర్పô, కత్తులు, బాంబులవే కుర్చీలు నెంబర్‌వన్‌ అధికారపు కుర్చీలు లక్షకొనండి వస్తు వినియోగం పెరిగింది మనిషి కోరికల చిట్టా విచ్చుకుంది ఆఫీసు బల్లల కింద నోట్ల కట్టలు ఉంచండి స్నేహం, ఆత్మీయతలు చెట్టెక్కాయి విక్రమార్కుడు బేతాళుడిచ్చిన లంచాన్ని మెక్కాడు డబ్బులే జీవితమవడంతో కథ సాగటంలేదు బాబ్బాబు! మనిషిని కాస్త వదలిపెట్టండి. 
    1234...........................................48
  • Next