కవితలు

తెలుగుదనానికి బాపు

తెలుగుదనానికి బాపు

ఆచార్య గంగిసెట్టి లక్ష్మీనారాయణ

న్యూమరిక్కులు

న్యూమరిక్కులు

రమణ యశస్వి

ఇప్పుడు

ఇప్పుడు

సి.హెచ్‌.మధు

నేను

నేను

దండమూడి శ్రీచరణ్‌

మల్లెమొగ్గ

మల్లెమొగ్గ

జి.రామకృష్ణ

పిచ్చుకల కిచకిచలు

పిచ్చుకల కిచకిచలు

ఇంటిలో వరికంకులు దూలానికి రెక్కలు దాచుకు వేలాడినప్పుడు చెంగు చెంగున ఎగురుతూ తేలివచ్చిన పిచ్చుకలు మనసు లోయల్లో ఊయలలూగేవి వరిచేను కోసిన దగ్గరనుంచీ కుప్పలు నూర్చే వరకూ కదులుతున్న నేస్తాలుగా ఉండేవి పిచ్చుకలల్లిన గూళ్లు ఇప్పటికీ మనసు పొరల్లో జ్ఞాపకాల ఊటలుగా సంచరిస్తూనే ఉన్నాయి పిచ్చుకల కిచకిచలు ఇంటిలో మార్మోగుతుంటే ఆప్యాయతలు బంధువల్లే నడిచొచ్చినట్టు గుండె లోతుల్లోంచి అభిమానం తీగలై లాగుతున్నట్లు తెలియని పరవశం పరిచయమయ్యేది ఎండుతున్న వడియాల చుట్టూ పిచ్చుకలు  వాటి చుట్టూ పిల్లలు ఓ పసందైన ఆటలా ఉండేది ఇప్పుడు పిచ్చుకల్లేని ఇంటిలో శబ్ద పరిమళమేదీ..!! కృత్రిమ ప్రపంచపు అంచుల్లో విషపు ఎరువుల లోకంలో కలుషిత వనాల్లో ఎగరాల్సిన పిచ్చుకలు సందడి చేయాల్సిన కిచకిచలు అలా రాలిపోతున్నాయి గుండెను తడుముతూ కాల శిల్పం మీద కొన్ని కొన్ని జ్ఞాపకాలుగా వాలిపోతున్నాయి
పుస్తకాల అలమరా

పుస్తకాల అలమరా

పుస్తకాల అలమరా మస్తకానికి కెమెరా! అంతరంగ మథనంలో ఆవిర్భవించిన భావమయూరాలు పేజీల పురులు విప్పి నాట్యమాడతాయి. పుస్తకాల అలమరా జ్ఞాపకాల దొంతర! తీగ మీటితే వీణ మోగినట్లు తిప్పుతున్న ప్రతి పుటకూ గుండె తంత్రులు ఝల్లుమంటాయి. పుస్తకాల అలమరా అద్భుతాల ఖజానా! మంత్రగాళ్లూ, మహారాజులూ, భూతాలూ, బ్రహ్మరాక్షసులూ, మాయాద్వీపం, ఎగిరేమంచం పట్టుకోగానే ప్రత్యక్షమవుతాయి. పుస్తకాల అలమరా అనుభూతుల నజరానా! అప్పుడెప్పుడో చదివిన చిట్టి పొట్టి నేస్తం ఇప్పుడు మనపిల్లలకూ దోస్తీకావటం, భలే విచిత్రం. పుస్తకాల అలమరా అనుభవాల జమానా! అక్షరాలలో ప్రతిష్ఠించిన అనేకానేక పాత్రలు జీవితం వివిధ దశల్లో అందివచ్చిన అపురూప మిత్రులు పుస్తకాల అలమరా మనిషికొక ఆసరా! అది తల్లడిల్లే హృదయాలకి చల్లని సందేశమిస్తుంది. ఎల్లలులేని మానవలోకానికి విలువల వెలుగు నందిస్తుంది.  
జ్ఞాపకం

జ్ఞాపకం

వద్దనుకున్నదే ముఫ్పై రూపాయలు లేవని అలిగి ఇంట్లో పడుకున్న సంగతే గుర్తు మూలలు చినిగిపోయి ఇల్లు కారినప్పుడు వాన  నీళ్లు పడి అన్నీ మరకలే, చెప్పుకోలేనన్ని కుంచెం అటు జరుగు నా తల కనబడడం లేదు పొడుగు కాళ్ళకి మోకాళ్ల దండనం రా! నా ముందైనా నిలబడు కనీసం కళ్లు భాషని బట్వాడా చేస్తాయి నవ్వండర్రా...! ఏడాది మొత్తానికి ‘పేము’ బెత్తం ఆఖరి అదిలింపు సంతోషం నిండిన ముఖాలపై ఫ్లాష్‌ మెరుపు ఏం రాశావు ఆటోగ్రాఫ్‌ బుక్‌లో! ఏవో పాటలో నాలుగు లైన్లు ఇంకా సంతకం చేయడం రాని వయసులో పేరంటే పొడి పొడి అక్షరాలు పొడుగు జడలు, పొట్టి ప్యాంట్లు తొలిసారి దూరం అవుతున్న బంధం జీవితంలో తొలిసారి ఒంటరి ఏడుపుని నేర్పిస్తుంది ఇవ్వలేని లేఖలు, గులాబీల మధ్య భవిష్యత్‌ కలలు నలిగిపోతాయి లంచ్‌ బాక్సుల్లా జీవితాలేం చేతులు మారిపోవు రుతువుల్లా స్నేహాలూ స్థిరం కాదు జామెంట్రీ బాక్సుల కాగితాల మడతల్లో నుంచి తాను తీసిచ్చిన ముఫ్పై రూపాయల జ్ఞాపకం కళ్ళనిండా ప్రేమ చేతినిండా దుఃఖపు ఆనవాళ్లు గుర్తు పడుతుందో లేదో పిల్లలొచ్చి అడుగుతుంటే బాల్యాన్ని కలవడానికి వెళుతున్నానని చెప్పడానికి గొంతులో ఆనందం అడ్డుపడింది.
అక్షరాలు

అక్షరాలు

అక్షరాలు అంటే నేర్చుకొని వదిలేయడం కాదు జీవితానికి వెలుగునిచ్చి రాచబాట పరచిన కుసుమాలు.. బతుకు వేదికపై అక్షర నిర్మాణం జరిగి జ్ఞాన సముపార్జనకు చేయూతనిచ్చిన రోజు.. సామాజిక చైతన్యానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచి చేదోడువాదోడుగా ఉంటూ అంకురం చేసిన చెదరని శిలాక్షరాలు బతుకు మార్గానికి మెతుకు జీవనానికి ప్రతిబింబించేలా ప్రతిధ్వనిస్తూ చప్పుడు చేసే గుప్పెడు అక్షరాలు మానవీయ విలువలకు సంబంధ బాంధవ్యాలకు  దిక్సూచిలా పనిచేసే అక్షర చిగురులు.. అమ్మ ఒడిలో అమూర్త భావనల భాష ప్రాథమిక బడిలో  మూర్త భావనల అక్షర భాష సొంతంగా ఎదిగి ఒదిగేందుకు ఆ అక్షరాలు అమృత కలశం.. అక్షరాలు అంటే ఆషామాషి వ్యవహారం కాదు తమస్సు తొలగించి ఉషస్సు కలిగించే జ్ఞాన వీచికలు విజ్ఞాన గీతికలు జీవితాంతం వెన్నంటి ఉండే ఆశల మణిహారం ఆశావాహులకు సమగ్ర సమాహారం అక్షరాలు అంటే క్షీణించని పదాలు మనసులో నిలిచే పదాలు భవిత మయూఖానికి మరో క్షీరదాలు
ఆకుపచ్చని కల

ఆకుపచ్చని కల

ఆకుపచ్చని సముద్రంలో అలనవ్వాలని కలగంటానా? కడగవలసిన గిన్నెలు గలగల నవ్వుతాయి మేలుకొలుపు రాగాన్ని వినిపిస్తాయి పున్నాగ పారిజాత పరిమళాలలో పరవశించిపోదామని పరిగెడతానా? నిను వీడని నీడను నేనంటూ పోపు వాసన పకపకలాడుతుంది విరిసిన పూబాల సోయగాన్ని ఎదలో పదిలం చేసుకోవాలనుకుంటానా? మది తలుపులు మూసేసి మా సంగతి చూడమంటూ మాసిన బట్టలు మౌనంగానే గుడ్లురుముతాయి శిశిరం నుంచి వసంతానికి వసంతం నుంచి శిశిరానికి పయనమే సృష్టి ధర్మమని మారని దేది లేదని తెలుసుకొని మారవలసింది నువ్వేనని కొమ్మల చేతులతో వింజామరై వీస్తూ మొక్కవోని ధైర్యాన్ని ప్రాణశ్వాసను చేసే నిలువెత్తు నీడ సాహచర్యాన్ని కోరుకుంటానా? ఎంత దూరం పయనించినా నీ చివరి మజిలీ నేనేనంటూ అమ్మతనాన్ని వదలలేని నీకు శాశ్వత సహచరిని నేనేనంటూ ఆకుపచ్చని కలలు కనడం మాని నా ఆమరణాంతపు కౌగిలిలో కరిగిపోమ్మంటూ వంట గది విలాసంగా హితబోధ చేస్తుంది అలవోకగా ఆశలకు సమాధి కట్టడం నేర్పిసుంది
బంగారుతల్లి - శ్రీ కనకదుర్గ!

బంగారుతల్లి - శ్రీ కనకదుర్గ!

శ్రీ పరాదేవి! ప్రణవేశ్వరీ! త్రినేత్రి! శిష్ట రక్షా పరాయణి! దుష్ట దమని! కరుణ వర్షిణీ! ‘‘కళ్యాణ కనకదుర్గ’’! శాంకరీ! జగదీశ్వరీ!! జయములిమ్ము!! ధరణిలో - అవినీతి దనుజుల - ‘‘దుర్ముఖా’’-     ధముల నణచ రమ్ము! ‘‘ధర్మగాత్రి’’!! రక్త పిపాసులౌ - ‘‘రక్త బీజా’’దుల -     శిక్షింపగను రమ్ము - ‘‘శ్రీ భవాని’’!! స్వార్థపు కోరల - ‘‘చండ ముండా’’దుల -     చెండాడ రమ్ము - ‘‘చాముండి దేవి’’!! దేశ సంక్షభులై - తిరుగు - ‘‘శుంభా’’దుల -     దునుమాడగను రమ్ము - ‘‘దురితహారి’’! అవని ధర్మ భక్షకులు - ‘‘మహిషాసురా‘‘ధ’’ ములను - మట్టుపెట్టగ రమ్ము - ‘‘మోక్షదాత్రి’’! సకల లోక కళ్యాణి!! ‘‘శ్రీచక్రరాజ్ఞి’’!! ‘‘శ్రీ కనకదుర్గ’’ చరణాలె - శ్రీ పదాలు!! ముజ్జగాల - ‘‘బంగరు ఒడి’’ - మురిపెమొలుక, కరుణ తోడ లాలించు - శ్రీ కల్పవల్లి!! భక్తజనుల చల్లగసాకు - పాలవెల్లి!! ‘‘శ్రీ జగన్మాత’’ పాదాలె - శ్రీకరాలు!! ‘‘అన్నపూర్ణ’’వై - రైతుల నాదుకొనుమ! ‘‘భరతమాత’’ - శాంతి సుధల - పరిఢవిల్ల ‘‘తెలుగునేల’’ - సువర్ణ కాంతుల విరియగ - ‘‘స్వర్ణ దుర్గాంబ!’’ - మమ్ముల సాకుమమ్మ!! ‘‘సర్వమంగళ!’’ త్రిభువనేశ్వరి! శుభకరి! భక్త హృదయ సరసున - భవ్యగతి - ‘‘స్వర్ణ’ ‘‘హంస’’పై - విహరించెడి - ‘‘అమృత తల్లి’’! కరుణ బ్రోవుమా! మమ్ము - ‘‘బంగారుతల్లి’’!!
న్యూమరిక్కులు

న్యూమరిక్కులు

తెలుగు లిపి బహు చిలిపి సరళరేఖల రారాజు గీతల గీతమార్చిన సత్తిరాజు బాపు రేఖలు కలిపి రేఖలతో చిత్రకారుడు రీళ్లతో చలన చిత్రకారుడు  చెరగని బాపు గీత తరగని గిలిగింత ఘనతలో చరిత్రకారుడు బాపు బాణీ ‘సాక్షి’తో బోణి రమణ ప్రాణి సత్తిరాజు వాణి రెండుగా విడిన తెలుగునేల బాపు రమణల కీర్తితో వెలుగునేల ఆణిముత్యాల శ్రీరామరాజ్యం ఆఖరి అలివేణి ఈ ప్రపంచానికి బాపు సెలవ్‌ మరో ప్రపంచంలో రమణకి ‘సే’లవ్‌ బావురుమన్నాడు తండ్రిని కోల్పోయి బుడుగు బాపు బొమ్మ జడపదార్థమైంది పడక అడుగు వారి స్నేహంపై దేవుడా నువ్వే సినిమా తీయగలవ్‌ మీ గీత ఘంటసాల పాడలేనిది మీ సీత వాల్మీకి కనలేనిది వెలవెలబోయిన వెండితెర కళతప్పిన బాపు బొమ్మల పరంపర మీ చేత ఇహలోకంలో సాటిలేనిది
    1234..................................................55
  • Next