సుమనోహరం

ప్రేమ విశ్వజనీనమైన భావోద్వేగం. ప్రేమ అంశంగా ఎన్ని కథలనైనా అల్లుకోవచ్చు. బుర్రకి కాస్త పదునుపెట్టి చిన్నపాటి మెలిక పెడితే, తప్పకుండా ఆ కథ ప్రేక్షకులను అలరిస్తుంది. అందుకు మరో ఉదాహరణే ఈ లఘుచిత్రం. విష్ణుమూర్తి, నారదుల మధ్య సంభాషణతో మొదలవుతుందిది. కలియుగంలో సామాజిక మాధ్యమాల ప్రాబల్యం, సహజీవనం లాంటి వాటి గురించి చర్చిస్తుందీ చిత్రం. మనుషుల మధ్య నిజమైన ప్రేమ కనిపిస్తే బాగుండు అని నారదుడు వాపోతే, రతీమన్మథులే దానికి సమాధానం చెబుతారని విష్ణుమూర్తి అంటాడు. అందుకు ఓ కథ కూడా చెబుతాడు. ద్వాపరయుగంలో రతీమన్మథులు ఓ ముని తపస్సుకు భంగం కలిగిస్తారు. కోపించిన ముని, వాళ్లను భూలోకంలో బొమ్మలుగా మారిపొమ్మని శపిస్తాడు. నిజమైన ప్రేమజంట కనిపించిన రోజున శాపవిమోచనం కలుగుతుందని సెలవిస్తాడు. ముని చెప్పినట్టుగానే రతీమన్మథులు బొమ్మలుగా మారి ఓ కాఫీషాపునకు చేరతారు. మరి వాళ్లకి నిజమైన ప్రేమ జంట కనిపించిందా? శాపవిమోచనం జరిగిందా? అన్నదే అసలు కథ చక్కని సంభాషణలు, నటన ఈ చిత్రానికి అదనపు బలం.

సుమనోహరం

నటీనటులు: శివ, చాందినిరావ్‌

నిర్మాత: కె.వెంకట శివకుమార్‌

రచన, దర్శకత్వం: కె.వెంకట శివకుమార్‌bal bharatam